’ మరువం ’ ఉష గారు నిర్వహిస్తున్న ’ మత్స్య సుయజ్ఞము ’ నకు సమర్పిస్తున్న పద్య పుష్పము

matsya

నిగమము తస్కరించి గొని నీరధి దాగిన దుష్ట రాక్షసుం

డగు ’ హయ కంఠు ’ నిన్ దునిమి, ఆర్ష సుధర్మము నాది మత్స్యమై

ఖగపతి వాహనుండు హరి గాచెను ! ’ మత్స్య సుయజ్ఞ ’ మూనె మా

భగిని, సుకావ్యకర్త్రి – ’ ఉష ’ ! భాగ్య మొసంగుత నాత డామెకున్ !

( * ఉష గారు !
నేను నిన్నే లాంగ్ టూర్ చేసి, స్వగృహానికి చేరాను. ఈ రోజే మీ ’ జల పుష్పాభిషేకం ’ గురించి తెలిసింది.
ఆ మహాయజ్ఞ ప్రసాదం నా కందకపోయినా, ఆ మత్స్యావతార మూర్తి కరుణా కటాక్ష ప్రాప్తి మీకు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పద్య పుష్పాన్ని సమర్పిస్తున్నాను.
– డా. ఆచార్య ఫణీంద్ర )

1 వ్యాఖ్య (+add yours?)

  1. మరువం ఉష
    అక్టో 13, 2009 @ 21:33:53

    ధన్యురాలను. ఇంతకన్నా కృతజ్ఞత ఏవిధంగా తెలుపగలను ఆచార్యా! నీది మంచి జాతకం అన్న ఇద్దరు పండితులు ఎక్కడున్నా వారికి కూడా ప్రణమిల్లుతూ, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలతో. – మరువం ఉష

    స్పందించండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.