ద్వితీయ వార్షికోత్సవం

                        ఈ రోజు(25 Nov 2010)తో నేను తెలుగు బ్లాగులోకంలో ప్రవేశించి రెండేళ్ళు పూర్తయ్యాయి. ఈ రెండేళ్ళలో ఈ ‘ Dr. Acharya Phaneendra ‘ అన్న నా ప్రప్రథమ బ్లాగుతోబాటు, ’ నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ’ , ’ మౌక్తికం ’ అన్న మరో రెండు బ్లాగులను కూడా ప్రారంభించి, నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా, ఈ రోజు ఈ ‘ Dr. Acharya Phaneendra ‘ అన్న బ్లాగు జన్మదిన ద్వితీయ వార్షికోత్సవం.
                       ఇప్పటి వరకు దాదాపుగా 19,720 మందికి పైగా వీక్షకులు నా ఈ బ్లాగును దర్శించారు. అంటే సగటున సంవత్సరానికి పదివేల వీక్షణలు నా బ్లాగుపై ప్రసరించాయి.  ఈ రెండేళ్ళలో ఈ బ్లాగులో 127 టపాలను నేను ప్రచురించగలిగాను. ఆరు వందలకు పైగా వ్యాఖ్యలను (ఇందులో అత్యధికం ప్రశంసాపూర్వకమైనవి కావడం ఆ యా వ్యాఖ్యాతల సౌజన్యంగా, నా సౌభాగ్యంగా భావిస్తున్నాను) అందుకొన్నాను. అయితే, గత సంవత్సరం తో పోల్చి చూస్తే ఈ సంవత్సరం నేను తక్కువ టపాలను ప్రచురించడం జరిగింది. దీనికి కారణం … దైనందిన జీవితంలో నేను ఇతర సాహిత్య కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించడమే. అలాగే, ఈ సంవత్సరం కొందరు వీక్షక సోదర, సోదరీమణుల ఆదరణకు నా బ్లాగు దూరమయిందన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. బహుశః నేను తెలంగాణోద్యమానుకూల రచనలు చేయడం దీనికి కారణమేమో! అలాగని, లౌక్యం ప్రదర్శిస్తూ … సత్య వచనం చేయకుండా, ధర్మ సమరం సలుపకుండా ఆత్మద్రోహం చేసుకోలేను కదా! తెలుగువాళ్ళంతా మట్టిగా విడిపోయినా, మానసికంగా కలసి ఉండాలని ఆకాంక్షించేవాళ్ళలో నేను అగ్రగణ్యుడను.
                         ఇనాళ్ళుగా నా ఈ బ్లాగును ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ శతాధిక నమోవాకాలను సమర్పించుకొంటున్నాను. 
                              

                          సత్యం వద ! ధర్మం చర !!
                                               
                – డా. ఆచార్య ఫణీంద్ర

’నకిలీ ముల్కీ’

గతంలో ’శ్రీకృష్ణ కమీషన్ కు నా నివేదికలు’ అన్న నా టపాలో
”It is pity that then Union Government abolished Mulki rules by amendment of Constitution of India, against the Supreme court orders and the will of people of Telangana to control a counter ‘ Separate Andhra Movement ‘ in Andhra region. People of Telangana were deeply disheartened by this, as it lifted off one of the major safe guards of then youth and the youth of future generations of Telangana region.
3. Telangana people were then little bit consoled by introduction of ‘ Six point formula ‘, with Presidential order to safe guard their interests of employment to some extent, though the criterion of local stay is reduced from 12 years to a meager 4 years. But, again this was also violated by the people of Andhra region with the support of political leaders and officials belonging to their own region. Here I want to explain my personal experience. In 1980, I passed my ‘ diploma in mechanical engineering ‘ and I was residing in Secunderabad, which was a part of Hyderabad dist. Hyderabad dist. was consisting of only a limited urban area till recent times ( ie., before formation of Greater Hyderabad by Dr. Rajashekhara Reddy’s Govt. ) and all suburban areas were in Ranga Reddy dist. in which lot of public and private industries were established. Keeping this in view, I went to Ranga Reddy dist. Employment exchange for registering my name. I was denied registration, saying that, my residence does not fall under Ranga Reddy dist. area. Where as, a person who came to Hyderabad the previous day for the first time from Andhra region spoke something and gave Rs. 200/ – as bribe to the concerned clerk, who also belongs to Andhra region originally. That clerk took out a blank residential certificate ( which was already signed and stamped by the competitive authority ), filled his name in it and registered his name for employment. Though Hyderabad and as a matter of fact Ranga Reddy dist. being heart of Telangana region, I ( a hardcore Telangana person ) was deprived of my right, where as a person from Andhra region got the benefit, violating ‘ Six point formula ‘. At that tender age, I like any Telangana person, was too innocent to fight against the clark and too poor to afford to pay Rs. 200 / – for bribing. This is just an example to show how ‘ Six point formula ‘ was violated.”
అని నేను నా స్వానుభవాన్ని వివరించిన సంగతి పాఠకులకు గుర్తే ఉండి ఉంటుంది.
అయితే ఈ వ్యవహారం ఈనాటికీ కొనసాగుతున్నది అనడానికి ఈ రోజు (22 Nov 2010) ’ఈనాడు’ పేపర్లో వచ్చిన వార్త ఒక తార్కాణం.

  (’ఈనాడు’కు కృతజ్ఞతలతో – )

’ఈనాడు’ ఇచ్చిన చిత్రంలో స్పష్టంగా ’RESIDENTIAL CERTIFICATE’ అని ఉండడం గమనార్హం. అదే చాలు – ’ఆరు సూత్రాల పథకం’ను నిర్వీర్యం చేయడానికి. ఇంత సులభంగా అక్రమాలు చేయడం వల్లే ’గిర్గ్లాని కమీషన్’ లెక్కించే నాటికే రెండున్నర లక్షల మంది సీమాంధ్రులు అక్రమంగా తెలంగాణ ప్రాంతంలోని రాష్ట్ర ప్రభుత్వోద్యాగాలలో చేరారని తేలింది.
ఏభయ్యేళ్ళుగా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలియకుండా సాగుతుందని ఎవరైనా వాదిస్తే … వాళ్ళ కంటే వెర్రి వెంగళప్పలు గాని, ఆత్మ ద్రోహులు గాని, ఉండరన్నది వాస్తవం.

నేనెప్పుడో 1980లో చూసిన అవినీతి ఈనాటికీ కొనసాగుతుంటే, ఇంకా –  ముల్కీ .. ఆరు సూత్రాల పథకం .. 610 G.O. ఏమిటి? – తెలంగాణ యువత ఖర్మ  కాకపోతే …?

ప్రపంచంలో అన్నింటి ధరలు పెరిగినా, ఈ దొంగ సర్టిఫికేట్ మాత్రం ఆనాడు, ఈనాడు రెండు వందల రూపాయలకే లభించడమేమిటా! … అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇందులో నిజంగా వ్యాపార దృష్టి ఏ మాత్రం లేదు. ఇది కేవలం సీమాంధ్ర ప్రాంతీయుల అక్రమ ప్రయోజనాలు నెరవేరేందుకు ఏర్పాటు చేసిన అవినీతి వ్యవస్థ అని నిరూపితమవుతుంది.

ప్రభుత్వంలోని సీమాంధ్ర మంత్రులు, ఉన్నతాధికారుల అండతో ఇన్నేళ్ళుగా జరుగుతున్న ఈ అవినీతిని అరికట్టగలిగి, ప్రభుత్వోద్యోగాలలో తెలంగాణ యువతకు న్యాయమైన వాటా దక్కి ఉంటే … 1969 లో గాని, ఇప్పుడు గాని, ఇంత ఉధృతంగా ’తెలంగాణ ఉద్యమం’ వచ్చేదా ? 
పైగా ఇప్పుడు రాజధానికై పోట్లాడుతూ,  ”హైదరాబాదులో మా జనాభాయే ఎక్కువ” అని చాలెంజ్ చేసే వాళ్ళున్నారు. చట్ట వ్యతిరేకంగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులే కలసి పది లక్షలు దాటితే … ఇంకా కేంద్ర ప్రభుత్వోద్యోగులు,  ప్రయివేటు సంస్థల ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయులు, సినిమా వాళ్ళు చట్టబద్ధంగా వచ్చేవారాయె … ఉండరు మరి!

– డా.ఆచార్య ఫణీంద్ర

బందీబందీ

రచన : డా.ఆచార్య ఫణీంద్ర

నేను కనిపించగానే
నీ సంపంగిమొగ్గ క్రింది
సరళరేఖ వక్రరేఖగా పరిణమించి
సుమధనువుగా రూపాంతరం చెందుతుంది
చిరునవ్వులు విరితూపులై
సంధించబడతాయి
నీతో సమరం సలిపే ధైర్యం చాలక
నా గుప్పెడంత గుండె
‘ దాసోహం ‘ అంటుంది –
నీ నయనాలు
ప్రణయ విజయ పతాకలను                                                                 ఎగురవేస్తాయి –
నేను కట్టు బానిసనై
నీ గుండెలో బందీనౌతాను.

            ____***____

” మనుషులకే ఎందుకో ”

“చావా కిరణ్” బ్లాగులో
“పాట ఒకటి వ్రాద్దాం రండి — 3” అన్న శీర్షికలో

ఇచ్చిన సన్నివేశం –

అతను కొన్ని కారణాల వల్ల మనసు గాయపడి అలా బయటకు వెళ్తాడు.ఇతను ఎప్పుడో చదువుకునే రోజుల్లో కవితలు అల్లిన వాడే, కానీ తరువాత సంసారంలో పడి ఆ వైపు కూడా చూడలేదు, కనీసం కవితలు చదవడం కూడా చెయ్యడు గత ముప్పై సంవత్సరాలలో.

మనసు తీవ్రంగా గాయపడి అలా బయటకు వెళ్లి, నీలాకాశంలో ఆనంగా ఈనంగా ఉన్న తెల్లని మేఘాలు, వాటి క్రింద ఎగురుతున్న పక్షులు , నిండు కుండలా పారుతున్న నది, దాని నిండుగా చేపలు, వాటిని భక్షించు పక్షులు, వాటిలో అవే ఆడుతున్న పక్షుల జంటలు, ఎగురుతున్న సీతాకోక చిలుకలు, వాటి జంటలు, తుమ్మెదల జంటల విన్యాసాలు, తీరిక లేని తుమ్మెదల ఆవృతాలు, నర మానవుడి జాడ లేని చోటు, చల్లగ రివ్వున వీచే గాలి, నీటి శబ్దం, పక్షుల అరుపులు, జంతువుల అరుపులు, పచ్చని చెట్లు, నాగరికతకు ఆనవాలుగా నిర్మానుష్యమైన అందమైన నల్లని తారు రోడ్డు, దానికిరువైపునా పూల మొక్కలు, దూరంగా ఉన్న జలపాతపు హోరు, తారు రోడ్డు పక్కన ఎర్రని కాలిబాట, ఎవరూ లేని తాటాకుల పాత గుడిసె, ఏనాటిదో ఒక రాతి మండపం దానిపై అద్భుత శృంగార భంగిమలు, .…..

ఇలా ప్రకృతిని చూస్తూ తన్ను తాను మరచి, తానే ప్రకృతిలో ఒక భాగం అయి, ప్రకృతే గురువు కాగా ఒక అద్భుతమైన పాట పాడతాడు. తనలో ఉన్న మరో తానును కనుగొంటాడు. మనసు తేలికవుతుంది. పాట పాడుతూ, పాడి, మట్టి రోడ్డు తారు రోడ్డు కలిసే దగ్గర కూర్చుండిపోతాడు.

ఆ సన్నివేశానికి నేను వ్రాసిన పాట :

” మనుషులకే ఎందుకో ”

గీత రచన : డా|| ఆచార్య ఫణీంద్ర 

మనుషులకే ఎందుకో
మనసంతా వేదన ?
మానులకు ఉన్నదా ?
మబ్బులకు ఉన్నదా ?       || మనుషులకే ||

ఆ ఎగిరే పక్షిని చూడు –
ఆకాశపుటంచులలో …
హాయిగా రెక్కలు విప్పి
ఆనందం చిందేను !
ఆ వాలే తెమ్మెద చూడు –
అందమైన పూ యెదపై
హత్తుకొని మధురిమలు
ఆస్వాదన చేసేను !             || మనుషులకే ||

ఆ చల్లని గాలిని చూడు –
ఆకులనే మీటుతూ
కొమ్మలనే ఊపుతూ
ఈల పాట పాడేను !
ఆ జలపాతం చూడు –
అద్రి నుండి దూకుతూ
నేలపై తకధిమి.. తకధిమి..
భరత నాట్యమాడేను !         || మనుషులకే ||

మానైనా కాకుండా …
మనిషిని నేనయ్యాను –
ఆమనులను కోల్పోయాను !
అందాలను కోల్పోయాను !
మబ్బైనా కాకుండా …
మనిషిని నేనయ్యాను –
శ్రావణమే కోల్పోయాను !
సంగీతం కోల్పోయాను !       || మనుషులకే ||

అరమరికలు, అసూయలు,
ఆవేశం, స్వార్థాలు,
వేదనలు, రోదనలో
వేసారి పోయాను –
అమ్మలాంటి ప్రకృతీ ! నను
నీ ఒడిలో దాచుకో !
కమ్మనైన జోల పాడి
నన్ను నిదుర పుచ్చుకో !       || మనుషులకే ||

— *** —విశ్వ సంగీతం

విశ్వ సంగీతం

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

ఆ మనిషి అలపై నిలుచున్నాడు
అతని చేతులు గాలిలో కదలాడుతూ
సంగీత కచేరీని నిర్వహిస్తున్నాయి
ఆ అల –
కుంచెతో గీసిన రంగు రంగుల కల !
రెప్పపాటు అది
హరివిల్లులా మెరిసింది మిలమిల !
కాలం కదలికలు లేని
కొండ కాదు –
అది వాయువులా సాగిపోతుంది
వేగాన్ని పుంజుకొని విజృంభించింది
ఆ అలను నేలకు విసిరికొట్టింది !
రాగాల తీగ తెగిపోయింది
కచేరీ నురగలై విరిగిపోయింది
అంతకు ముందు నిటారుగా
నిలిచున్న ఆ మనిషి
నేలపై చచ్చిన పాములా                                                                                                               చతికిలబడిపోయాడు
ఒక్కసారి ఓపిక తెచ్చుకొని,                                                                                                                              తల త్రిప్పి వెనుకకు చూసాడు –
మరో అల …
మరో మనిషి …
మరో సంగీత కచేరీ …
మరో రంగుల హరివిల్లు …
ఆ మనిషికి అవగతమయింది –
మనిషి సంగీతం ముందు
ఒక మరుగుజ్జని !

( జాన్ ఫుల్లర్ ఆంగ్ల కవితను చదువగా కలిగిన  ప్రేరణతో … )

___ *** ___