2012 లో నా బ్లాగు రిపోర్ట్

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 14,000 views in 2012. If each view were a film, this blog would power 3 Film Festivals

Click here to see the complete report.

ప్రకటనలు

విశ్వనాథ – పుట్టపర్తి – ఒక ఆసక్తికర విషయం!!!

ఈ మధ్య కీ.శే. ఆచార్య తిరుమల గారి సంపాదకత్వంలో మూడు దశాబ్దాల క్రితం వెలువడిన “ఆధునిక కవిత – అభిప్రాయ వేదిక” అన్న గ్రంథాన్ని సంపాదించి చదువుతున్నాను.
అందులో ఆసక్తికరమైన అంశాలు చాల ఉన్నాయి. అన్నిటి కంటె చాల ఆసక్తికరమైన అంశం – ’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణపై ’సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు వ్యక్తీకరించిన అభిప్రాయం. దీనిని సాహిత్యాభిమానులతో పంచుకోవాలనిపించింది. ఇదేదో వారి 

VP1అభిమానులకు, వీరి అభిమానులకు తగవులు పెట్టాలని కాదు. ఇరువురు మేధావుల మధ్య అభిప్రాయ భేదాలు ఎలా మొలకెత్తుతాయో అవగతం చేసుకోవడానికి మాత్రమే.

– డా. ఆచార్య ఫణీంద్ర 

VP2

VP3

VP4

పాపయ్య శాస్త్రి గారి ప్రశంస

ఇటీవల తిరుపతిలో నిర్వహించబడిన “ప్రపంచ తెలుగు మహా సభల”లో, ప్రధాన వేదికపై నాతోబాటు “పద్యకవి సమ్మేళనం”లో పాల్గొన్న ప్రముఖ కవి శ్రీ కావూరి పాపయ్య శాస్త్రి గారు, నా “మాస్కో స్మృతులు” పద్యకావ్య పఠనానంతరం వ్రాసిన లేఖలోని అభినందన పద్యాలను ఇక్కడ ప్రచురిస్తున్నాను.

చదవండి –

– డా. ఆచార్య ఫణీంద్ర

msl

మీ మాస్కో స్మృతులన్నియు

నా మానసమునకు గూర్చె నవ్యానందం

బా మధురిమలను పలికితి

ధీమహితా! మీరు తేట తెల్లము గాగన్!

 

మంచి పద్య రచన “మాస్కో స్మృతుల” యందు

మొదటి నుండి సాగె తుది వరకును –

శీర్షికలకు మంచి చెలువంపు నామాలు

దిద్ది తీర్చినారు తిలక మట్లు!

 

ఓయి ఫణీంద్ర సత్కవి! రసోజ్జ్వల సుందర బంధురమ్ముగా

హాయిని గూర్చు కావ్య మది యందము మెచ్చ రచించి, వెంట గొం

పోయిరి మమ్ము గూడ నవ మోహన ’రష్య’ విదేశ యాత్రకున్ –

నీ యసమాన కావ్యమున నిస్తుల పద్య పథమ్ములందునన్!

 

బ్రతికి చెడినట్టి మాస్కోను పద్య కావ్య

మను మహా సౌధమందున నరయ మరల

బ్రతుక జేసితి వయ్యారె! ప్రతిభ మీర –

“కవి ప్రజాపతి!” యను మాట కల్ల యగునె?

పద్య ఫణీంద్ర! నిక్క మది పల్కుచు నుంటిని పద్య విద్యలో

సద్యశమున్ గడించితివి – సత్కవి వర్యుల మార్గమందునన్

హృద్యముగా రచించితివి – యెల్లరు మెచ్చ కథా పథాన! నీ

విద్యకు కేలు మోడ్తు సుకవీ! యభినందన లంద జేసెదన్!

                           రచన : డా. కావూరి పాపయ్య శాస్త్రి

హెచ్చరిక

14 జనవరి 2013 నాడు హైదరాబాదు “ఎగ్జిబిషన్ కవి సమ్మేళనం” లో వినిపించగా, పలువురి ప్రశంసలు పొందిన నా కవిత ఇది.
ఈ మాసం “మూసీ” పత్రికలో ప్రచురితం.

– డా. ఆచార్య ఫణీంద్ర

indian soldier

h1

 

’అభినవ మొల్ల’ అభినందన లేఖ

 

cn3ఇటీవల “ప్రపంచ తెలుగు మహాసభల”లో నాతోపాటుగా ’పద్యకవి సమ్మేళనం’లో పాల్గొన్న ప్రముఖ కవయిత్రి, ’అభినవ మొల్ల’ బిరుదాంకితురాలు శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారు నా ’వరాహ శతకము’ను చదివి, నాకు వ్రాసిన అభినందన లేఖ – 

ఆమెకు ధన్యవాదాలను సమర్పిస్తూ –

డా. ఆచార్య ఫణీంద్ర

cn1cn2vs1