“కాకతీయ వైభవం”

21/03/2015 ఉగాది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రవీంద్ర భారతి’లో నిర్వహించిన ‘ఉగాది వేడుకల’లో భాగంగా ప్రదర్శించిన “కాకతీయ వైభవం” సాహిత్య రూపకంలో నేను ‘కేతన మహాకవి’ పాత్ర (నీలం రంగు జుబ్బాలో ఉన్నాను) పోషించాను.

ఆ రూపకంలో ‘కేతన’ మహాకవి ‘ప్రతాప రుద్రుని’ ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం …

“వరయుత కాకతీయ ఘన వంశ సుధాంశు ప్రతాప రుద్ర! నీ
చరణము సోకి ఈ తెలుగు క్ష్మాసతి ఎంతొ పునీతమయ్యె! ఈ
ధరణిని శారదాంబ బహుదా.. బహుధా.. నడయాడుచుండి, ఆ
వరణ మదెల్ల శీఘ్రమె సువర్ణమయంబుగ తీర్చి దిద్దుతన్!”

( ఈ పద్యం కేతన కవి కృతం కాదు. నేను స్వయంగా వ్రాసుకొన్నాను.)

ప్రదర్శన అనంతరం నన్ను, ఇతర పాత్రధారులను తెలంగాణ శాసన సభ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి గారు సత్కరించారు.

ఆ ఛాయాచిత్రాలను వీక్షించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

DSC_0669DSC_0680

DSC_0685DSC_0684DSC_0745201503220322014509451