అమ్మా !

ఈ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి. మా అమ్మ పరమపదించి నేటికి రెండేళ్ళు పూర్తయ్యాయి.

నవ మాసాలు మోసి,
కని, కని పెట్టుకొని,
పెంచి, పెద్ద చేసి,
బిడ్డ ఎదిగి ఏం సాధించినా తానే కొండెక్కినంత సంబరపడిపోయే –
ఎంత ఎదిగిన బిడ్డడైనా ఎంత చిన్న కష్టం వచ్చినా తానే పాతాళానికి జారినంత బాధపడిపోయే –

అమ్మకు …

ఏ బిడ్డడయినా
ఏమివ్వగలడు ?
ఎంతిచ్చి ఋణం తీర్చుకోగలడు ?

కానీ …
డా. పోరెడ్డి రంగయ్య ( నల్లగొండ జిల్లావాసి ) కేవలం తన మాతృ మూర్తికే గాక 172 మంది కవులు తమ మాతృ మూర్తులకు కవితా నీరాజనాలను సమర్పించుకొనే అవకాశాన్ని కల్పించారు. ఆయన సంపాదకత్వంలో వెలువడిన
” మా అమ్మ ” అన్న గ్రంథంలో ఆంధ్ర దేశంలోని ప్రముఖ కవులందరూ తమ తమ మాతృ మూర్తులపై వ్రాసిన కవితలను పొందుపరిచి, ఎనలేని పుణ్య ఫలాన్ని సంపాదించుకొన్నారు.

Image0762

ఆ గ్రంథంలో మా అమ్మపై నేను వ్రాసిన పద్యాలు …

అమ్మా !

* కన్నది ఆదిగా, ఎవరు కన్పడినన్ వివరించినావు – ” నా

పున్నమి నాడు పుట్టిన సుపుత్రుడు వీ ” డని ! ఎంతొ మోదమున్

కన్నుల వెల్గ చెప్పితివి – కాగ మెకానిక లింజనీరునున్,

మన్నన లొంద నే కవిగ, మాటికి నద్దియె ప్రస్తుతించుచున్ !


* సుకుమారుడు కష్టమ్ము

న్నొకింత ఓపడని, విఫలమొందిన; గెలువన్,

సకల సమర్థుడని పలుక –

అకళంకము నీదు ప్రేమయని తెలిసెనులే !


* నీ యారోగ్యము క్షీణమైన దెపుడో ! నీ వెట్టులో ఐననున్

చేయంబూనితి వంట ! వేరెవరికిన్ చేయూని వడ్డింపకే,

నా యొక్కండున కేలొ జాలి, దయ మిన్నంటంగ, కంచాన ఆ

ప్యాయంబొప్పగ నుంచి చేతికిడినా వన్నమ్మ దే నెర్గుదున్ !


* అమ్మా ! నీవు ముదంబు నొందితివి నేనానాడు ’ పీ. హెచ్ డి. సీట్ ’

సమ్మానంబుగ పొందినంత – మరి యే శాపంబొ ? లేవైతివే –

ఇమ్మై పూర్తయి, ’ డాక్టరేటు ’ పదమే ఏ నొందు నీ వేళలో !

చెమ్మే నిండెను నాదు కన్నులను, నా చెంతింక నీ లేమిచేన్ !


* ” అమ్మా ! ఎటులున్నది ? ” యన –

అమ్మోమున హాస మొల్కి, ” అటులే ! ” యను నీ

కమ్మని కంఠ స్వరమే

చిమ్మని చీకట్ల నెటకొ చేరిన దయ్యో !

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

Single Sentence Delights

నా ’ వాక్యం రసాత్మకం ’ అనే ’ ఏక వాక్య కవితల సంపుటిని ఇటీవల ప్రొఫెసర్ ఐ. వి. చలపతిరావు గారు [ Former Registrar, Central Institute of English & Foreign Languages ] మరియు శ్రీ జి. రామకృష్ణారావు గారు[ Former Director of Translations, Govt. of A.P. ] కలసి, ఆంగ్లంలోకి Single Sentence Delights పేరిట అనువదించారు.

ఆ గ్రంథంలోని కొన్ని ఏక వాక్య కవితలు  …


Telugu Poet Dr. Acharya Phaneendra’s

” VAKYAM RASATMAKAM ” in Engish

” Single Sentence Delights “

[ Part 1 ]

* Alphabets conjoin and meaning is born.

* Two lives .. three knots … four witnesses …. marriage unites.

* It is the eyes that see and it is the heart that experiences.

* Heart moves – tears trickle down.

* I am leaving, leaving my imprint on you.

* Cot is the mother that puts one to sleep in her lap.

* Life is a black and white picture with delights and disasters.

* A tiny box turns the whole house into chaos.

* The earth carries the past history as a cemetery.

* Like a monkey, mind is fickle.

* I am in love and my language is ‘ sacrifice ‘.

* How did mother earth get guts and fortitude to carry mountains on its bosom.

* Eyes are the windows, the mind peeps through.

* That fresco is a silent poem.

* Dowry is a bribe given to the groom for living with him for his happiness.

* The moon is a lover tirelessly turning around the beauty queen, the earth.

* Ask the tears to tell about the worth of warmth.

* I’m genteel, still stones are pelted on me.

* Life is a kite in the sky of society.

* Cool breeze whispers and calm body feels jubilant.

* Earth turning round the sun – the moon turning round the earth – an unending triangular love story.

* The sculptor’s dream is revealed in the stone.

* Container’s black colour does not darken the white milk.

* Churn life and get the butter of experience.

* I knew the taste of tears, in my very childhood.

* Soil turns into man and finally man is reduced to soil.

* Rising from sleep, moving around and back to sleep – is what life.

* Man depends on his mother in childhood and on his wife in later years and yet calls woman as weaker sex.

* Crying children grow up, make their parents cry.

* By the time the eyes opened, half the life runs out.

* Though trampled, footpath shows the way.

* Morning is the boon granted by the sun to the world.

* The bus is moving like a pregnant woman, in labor pains.

* Although crores are spent on the film, the heroine does not have enough clothes on.

* Life is man’s signature on the document of light endowed by the sun.

* Poet is my name and my poem is my visiting card.

—  ***  —


వర్షోపరి

వర్షోపరి

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

after rain

ఉక్కు పలక నెటుల ఉత్తరించునొ యంత్ర

మురిమి, ఎగయ జిమ్మి మెరపు – లటులె

ఆకసమును చీల్చె ఆ మేఘ మాలికల్ !

కుండ పోత వాన కురిసె నపుడు !   …   1


వర్షానంతర ప్రకృతిని

తర్షముతో బయటకేగి దర్శింపగ, ఆ

ర్షించుచు సౌందర్యము –

హర్షము కలిగించె మదిని అపరిమితముగాన్ !   …   2


ఒక్కచో అగుపించె ఉరుకులెత్తుచు కొన్ని

సెలయేళ్ళు క్రొత్తగా వెలసినట్లు –

ఒక్కచో అనిపించె ఊరి బాట లెవండొ

కడు నిర్మలమ్ముగా కడిగినట్లు –

ఒక్కచో కనిపించె ఉత్తుంగ పర్వతం

బభ్యంజన స్నాన మాడినట్లు –

ఒక్కచో తలపించె మొక్కలకు మరల

ఆకుపచ్చని రంగు లద్దినట్లు –


ఒక్కచో తోచె ముత్యంబు లొక్కటొకటి

గుమ్మముల నుండి, చూర్లపై కొసల నుండి,

తరుల శాఖలం దలరు పత్రముల నుండి,

నేల జవరాలి ఒడిలోన రాలినట్లు –   …   3


తోచె – నేలపై వినయంబు తోడ గడ్డి

వచ్చి పోవు వారికి తల వంచినట్లు –

వీధులం దేగు వారిపై ప్రియము మీర

చల్ల గాలులే పన్నీరు చల్లినట్లు –   …   4


ప్రాత వడ్డ దెల్ల ప్రక్షాళనంబొంది

క్రొత్త దనము మరల కూడి, తోచె –

నిర్విరామ చలన నియతోర్వి యంత్రమ్ము

’ సర్విసింగు ’ నెవడొ సలిపినట్లు !   …   5


— *** —అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవం

అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవం

8 ఆగస్టు 2009 నుండి 24 ఆగస్టు 2009 మధ్య ( మరో 16 రోజుల్లోనే ) మరో 1000 మంది సహృదయుల వీక్షణాలు నా బ్లాగుపై ప్రసరించాయి. అంటే, నా బ్లాగు ప్రారంభించిన నాటి   ( నవంబర్ 2008 ) నుండి, ఇప్పటికి మొత్తం 8000 మంది సహృదయ వీక్షకులు దానిని సందర్శించారన్న మాట !

flowers

’ అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవ ’ సందర్భంగా, నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ఆదరాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ , ‘ నరసింహ ‘ , ‘ పవన్ ఫ్యాన్స్ . కాం ‘ , ‘ మంచు పూలు ‘  మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

అందరూ మహానుభావులే !

అందరికీ పేరు పేరునా వందనాలు !

– డా.ఆచార్య ఫణీంద్ర

వరాహ శతకము – 4

70th_birthday_number_seventy_sticker-p217219051090451728tdcj_313

ఇది నా 70వ టపా

వరాహ శతకము

( నాలుగవ భాగము )

రచన : ’పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

varaha1

సింహ ముఖుండునైన నరసింహ పరాత్పరు డాహ్వయంబునన్

’సింహము’ జంతు నామమది చేరిన చాలక, తృప్తి లేక, ఆ

’సింహము’ కన్న ముందు జతచేర్చియు నీ తిరునామధేయమున్

సింహగిరిన్ ’వరాహ నరసింహు’ డయెన్ గద ఓ వరాహమా!   …   31


అగణిత తారకా గణిత మధ్యయనం బొనరించి, ఖ్యాతినిన్

యుగముల పూర్వమెట్లు భరతోర్వికి గూర్చె ఖగో శాస్త్ర భ

వ్య గురుడు శ్రీ వరాహ మిహిరాఖ్యు డటన్నను – నీదు నామమే

తగిలెను ముందు నాతనికి – దాని ఫలమ్మె గదా! వరాహమా!   …   32


ఇంతటి పూర్వ సంస్కృతిని, ఇంతటి ఉన్నత వంశ కీర్తినిన్

సాంతము విస్మరించుచు, నశౌచము మేయుచు, ’మోరి’ గుంటలో

సుంత వివేకమున్ కలుగజూపక పొర్లిన ఏవగింపరే?

చెంతకు చేరి నిన్ను ప్రజ చేతురె ముద్దు? అయో వరాహమా!   …   33


భాషలయందు ద్వేషయుత భావము దెల్పగ మానవాళికిన్

దూషణ శబ్ద జాలములు తోచవు – కల్గియు వేన వేలునున్!

రోషము నీకు గల్గగ, విరోధుల బూనియు నీదు పేరుతో

దూషణ సల్పుచుందు – రది దోష మటందువె? ఓ వరాహమా!   …   34


ఇంతగ ఏహ్య భావనము నెల్లరి మానసమందు నిండుచో –

అంతయు నీ స్వయంకృతమె! అన్యుల నేమని లాభమేమి? నే

చింతిలుచుందు మా యువత చేష్టలు చూడగ – విస్మరించి భా

స్వంత సుసంస్కృతిట్లు, దిగజారుట నీవలె – ఓ వరాహమా!   …   35


తేటగనున్న నీట నిను తెచ్చియు స్నానము పోసి, అందమున్

చాట నలంకరించి, వెదజల్ల సువాసన ’సెంటు’ పూసినన్ –

మాటికి ’మోరి’ బొర్లుటను మానవు! ” పంది యదేమెరుంగు ప

న్నీటి సువాసన ” న్న నుడి నిష్ఠుర సత్యమె – ఓ వరాహమా!   …   36


తప్పును చేయు టెవ్వరికి తప్పదు _ సత్యము లోకమందునన్!

తప్పు నెరుంగ మానవులు,తప్పక మానగ పూనుకోవలెన్!

తప్పని యెంచి కూడ అదె తప్పును చేయుట ఫంకమందు నీ

వెప్పటి కట్లె మాటికిని ఈదుటె గాదటె? ఓ వరాహమా!   …   37


ఈ నరజాతి బుద్ధి, మరి ఏమనుకోకుము – నీదు బుద్ధియున్,

కానగ నొక్క రీతిగనె కన్పడుచుండును! పాడు బుద్ధులన్

మానెదమంచు నప్పటికి మానసమందు తలంచి గూడ, ఆ

పై నిక సిగ్గు వీడి, అదె పద్ధతి సాగుదురే! వరాహమా!   …   38


కొందరు మూడు ప్రొద్దులెది కోరిన నద్ది భుజించి, స్థూలమౌ

బొందిని పొంది, కార్యమెది పూనరు – చేయరు – అట్టి వారలన్

” పందుల మాదిరిన్ బలుపు పట్టి ” రటంచును తూలనాడ – వి

న్నందుకు నీ మనంబుకెటు లార్తియె గల్గునొ? ఓ వరాహమా!   …   39


ఐనను నీకు మానసమటన్నది యున్నదొ, లేదొ గాని – ఆ

జ్ఞానము నాకు లేదు! ఒక సత్యము మాత్ర మెరుంగుదేను – నీ

మేనిని ఎండ వానలును మీద పడన్ చలనమ్ము శూన్యమే!

కానగ మాదు నేతలకు కల్గినదీ గుణమో వరాహమా!   …   40


ఆశలు రేపి, మాదు విలువైన మహత్తరమైన ’ఓటు’లన్

రాశుల కొల్ది కొల్లగొని, రాజ సుఖంబుల దేలుచుండి, ఏ

కోశమునందు మా కొరకు కొంతయునైన శ్రమింపబోడు! నీ

’రాశి’యు, మాదు నేత ’గ్రహ రాశి’యు నొక్కటె! ఓ వరాహమా!   …   41


ఎంతయు తిట్టిపోసినను ఒకించుక గూడ చలించబోడు – ని

శ్చింతగ కాలమున్ గడుపు చీమయు కుట్టని యట్టులింక! ఆ

సాంతము నైదు వర్షములు సాగిన పిమ్మట యంత వచ్చి, ఓ

ట్లింతయు సిగ్గు లేక, మరి ఇమ్మని వేడునులే వరాహమా!   …   42

గజ ముఖ !

ganapati

భుజమున గల్గు బాల ఫణి భూషణ మొక్కటి నీదు తొండమున్

నిజ కుల జీవిగా తలచి నెయ్యము సేయగ మేళగించ, ఆ

బుజిబుజి రేకు నాగు గని ముచ్చటగా ముసి నవ్వు రువ్వెడిన్

గజ ముఖ! పార్వతీ తనయ! కావుమటంచిదె నీకు మ్రొక్కెదన్!

విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగు లీనుతున్న తెలుగు వారందరికీ

’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !

– డా. ఆచార్య ఫణీంద్ర

ఛాయా చిత్రాలలో …

ఛాయా చిత్రాలలో

డా. ఆచార్య ఫణీంద్ర ఏకవాక్య కవితల సంపుటి ’ వాక్యం రసాత్మకం ’ ఆంగ్లానువాదం Single Sentence Delights గ్రంథావిష్కరణ

సభా వివరాలు :

కీ.శే. వేమరాజు నరసింహారావు గారికి శ్రద్ధాంజలి :


Image0720

అధ్యక్షోపన్యాసం :

ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి IAS ( Retd.)


Image0717

గ్రంథావిష్కరణ :
ముఖ్య అతిథి శ్రీ పి.కె.బెనర్జీ (Gen. Manager, Nuclear Fuel Complex) చే


Image0718

Image0719

అంకితోత్సవం :
కీ.శే. వేమరాజు నరసింహారావు గారి తరపున వారి కుమారుడు శ్రీ వి. విజయ కుమార్ స్వీకరణ

Image0735

Image0736

ముఖ్య అతిథి అభిభాషణం :


Image0724


అనువాదకుల ప్రసంగాలు :

1. Prof. I.V. చలపతి రావు, Former Registrar, Central Institute of English & Forein Languages


Image0721

2. శ్రీ G. రామకృష్ణా రావు, Former Director of Translations, Govt. of A.P.


Image0722

గ్రంథ పరిచయం :
శ్రీమతి U.V.L. ఆనంద, Times of India విలేకరిచే


Image0723


గ్రంథ కర్త డా. ఆచార్య ఫణీంద్రకు సత్కారం :


Image0726

Image0728

గ్రంథకర్త స్పందన :


Image0725

సభానంతరం ఆత్మీయులు, అభిమానులతో డా. ఆచార్య ఫణీంద్ర :


Image0729

Previous Older Entries