“టోరి” రేడియోలో

TORI

శుక్రవారం ( 26/04/2013 ) నాడు ఉదయం “టోరి”(తెలుగు వన్.కాం) ఇంటర్నెట్ రేడియోలో “పద్యం-గద్యం” అన్న లైవ్ ప్రోగ్రాంలో ప్రసారమైన నా పరిచయ కార్యక్రమం వినండి.

పరిచయ కర్త : శ్రీ రమేశ్.

http://www.teluguoneradio.com/archivesplayer.php?q=5685&host_id=45

– డా. ఆచార్య ఫణీంద్ర 

elu5

ప్రకటనలు

సిర్పూర్ కాగజ్ నగర్ లో…

జనవరి మాసాంతంలో ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో శ్రీరామోజు లక్ష్మీరాజయ్య గారు రచించిన “శ్రీ యాదగిరి నృసింహ శతకము” గ్రంథావిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా అందిన ఆహ్వానం మేరకు వెళ్ళి, గ్రంథావిష్కరణం చేసి రావడం జరిగింది. ఆనాటి సభకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఈనాటికి నా చేతికందాయి. ఆ చిత్రాలను వీక్షించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

సరస్వతీ మాతకు నేను పుష్పాంజలులు సమర్పిస్తూ :

kn1

“శ్రీ యాదగిరి నృసింహ శతకము” గ్రంథావిష్కరణ చేస్తూ :

kn2

ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ :

kn3

చివరలో సత్కారం స్వీకరిస్తూ :

 kn4

ఆనాటి సభలో …

విజయ నామ సంవత్సర యుగాది పర్వదినం నాడు ఏలూరు పట్టణంలో “నవ్య సాహిత్య మండలి” ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా జరిగిన సభలో నాకు “పైడిపాటి సుబ్బరామ శాస్త్రి స్మారక పద్య కవితా పురస్కార” ప్రదానం, “కవి దిగ్గజ” బిరుద ప్రదానం కార్యక్రమాలను ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ఉపాధ్యాయుల రామారావు గారు ఘనంగా జరిపించారు. 

ఆ సభా విశేషాలను తిలకించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

సభా ప్రారంభంలో సుఖాసీనుడనై …

elu5

 

“కవి దిగ్గజ”   బిరుదాన్ని స్వీకరిస్తూ …

elu4

 

“పైడిపాటి సుబ్బరామ శాస్త్రి” స్మారక పద్య కవితా పురస్కారాన్ని స్వీకరిస్తూ …

elu1

 

elu2

 

సన్మాన పత్రాన్ని స్వీకరిస్తూ …

ele3

 

“కవి దిగ్గజ” బిరుద పత్రం –

birudu

 

“పైడిపాటి సుబ్బరామ శాస్త్రి స్మారక పద్య కవితా పురస్కారం” జ్ఞాపిక –

puraskaram

బాపు కార్టూన్ – పోతన పద్యం – నా పేరడీ!

vidyarti

 

ఇటీవల నా అభిమాన కార్టూనిస్ట్ -కం- చిత్రకారులు – కం – చలన చిత్ర దర్శకులు అయిన బాపు గారి ఈ కార్టూన్ చూడగానే – నా బుర్రలో పోతన గారి పద్యానికి పేరడీగా ఈ క్రింది పద్యం మొలకెత్తింది.

ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కొక్కడై తోచు పో
లిక – విద్యార్థి, జనాంతరంగములలో లీలన్ – వృథా సల్పెడిన్
వికట వ్యక్తియునై, వివాహ విపణిన్ విక్రేత సామగ్రియై,
ప్రకటింపంబడు రాజకీయ పణమై, భ్రష్టంబునౌ జంతులై!

– డా. ఆచార్య ఫణీంద్ర

విజయ నామ సంవత్సర యుగాది సందర్భంగా …

youtube-panchangam-banner
‘విజయ’ నామ సంవత్సర యుగాది సందర్భంగా TeuguOne.Com వారు నిర్వహించిన ‘ఉగాది కవి సమ్మేళనం’లో ఒక పద్య కవిగా, ‘బాల అష్టావధానం’లో ‘నిషిద్ధాక్షరి’ పృచ్ఛకునిగా పాల్గొనవలసిందిగా నన్ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమాల వీడియో క్లిప్పింగ్సును అంతర్జాలంలో ఈ క్రింది url లలో చూడవచ్చు.

http://teluguone.com/splevents/ugadi2013/single/ugadi-kavi-sammelanam-18087.html

http://teluguone.com/splevents/ugadi2013/single/bala-astavadhanam-18086.html

– డా. ఆచార్య ఫణీంద్ర

శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సాహిత్య పురస్కారం

ఈ నెల 11వ తేది ఉగాది పర్వదినం నాడు ఏలూరు పట్టణంలో “నవ్య సాహిత్య మండలి” వారు నన్ను “శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సాహిత్య పురస్కారం”తో సత్కరించబోతున్నారు. నాకు సముచిత బిరుద ప్రదానం కూడ చేయనున్నట్టు నిర్వాహకులు తెలియజేసారు. ఒక పద్యకవిగా మరొకమారు తెలుగు భాషామతల్లి కరుణాకటాక్ష వీక్షణానికి పాత్రుడనౌతున్నందుకు ఆనందంగా ఉంది. సహృదయ మిత్రులందరూ నన్ను మనసారా ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

up1

 

up2

మా అబ్బాయిని ఆశీర్వదించండి.

406134_451848374863131_2085609473_n

మా అబ్బాయి “రేడియో సిటీ 91.1” వారి RJ Hunt లో ఫైనలిస్ట్ గా ఎన్నికయ్యాడు. “ఫేస్ బుక్” అకౌంట్ ఉన్నవారు ఈ క్రింది url ఓపెన్ చేసి, “Like us” మీద క్లిక్ చేసి, ఆ పైన వచ్చే స్క్రీన్ లో ఉన్న ….. రోహిత్ గోవర్ధనం ( గీతాంజలి కాలేజ్ ) వీడియోను like చేసి vote వేసి ఆశీర్వదించండి.

https://www.facebook.com/uninorindia/app_282883168510699

– డా. ఆచార్య ఫణీంద్ర

 

Previous Older Entries