మహాకవి దాశరథి గురించి బాల మురళీకృష్ణ గారి మాటలలో …

మహాకవి దాశరథి గురించి
బాల మురళీకృష్ణ గారి మాటలలో …
[ఈ రోజు ( 22 జూలై ) కీర్తి శేషులు దాశరథి గారి జయంతి సందర్భంగా …]

– డా. ఆచార్య ఫణీంద్ర

 

(మిత్రులు కె. ప్రభాకర్ సంకలనం చేసిన “దాశరథి సినిమా పాటలు” గ్రంథం నుండి ..)

 

 

కలల రేడు …

 

 

 

అతడు తలను ఒక ప్రక్కగా వాల్చి ఊపితే
ప్రేక్షక ప్రపంచాలు ఉర్రూతలూగేవి.
అతడు చిరునవ్వులు చిందిస్తే
వీక్షక హృదయాలు పులకించిపోయేవి.
అతడు “పుష్పా! ఐ హేట్ టియర్స్!” అంటే
అభిమానులు మనోధైర్యాన్ని పెంచుకొనేవారు!
అతడొక అంతులేని ప్రేమికుడు –
కన్నె పిల్లల కలల రేడు –
అతని కోసం ఉప్పొంగిన ప్రణయ జలధి తరంగాలెన్నో!
అతని ప్రేమ దాహార్తి తీర్చిన ఒక్క మంచి నీటి చుక్క లేదు!
కోట్లాది మంది అతని విరహంలో వేసారుతున్నా-
అతడు ఏకాకిగానే మిగిలాడు
తన ఊహా సుందరి నిరీక్షణలో!
అతడు ప్రణయ మధువును ప్రేమించాడు!
తుదకు మృత్యు గరళం అతణ్ణి వరించింది!!

అతడు ప్రేమ రవి!
ఒక భావ కవి!!

అతనికి మరణం లేదు –
అవును …
వెండి తెర వెలుగుతున్నంత వరకు
అతనికి మరణం లేదు!

నా అభిమాన నటుడు “రాజేశ్ ఖన్నా” పరమపదించిన వేళ … సంతాపంగా …

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

తెలుగు కవి సమ్మేళనం – మరికొన్ని వివరాలు …

14 జూలై 2012 నాడు “రవీంద్ర భారతి” మెయిన్ ఆడిటోరియంలో నిర్వహింపబడిన “అఖిల భారత తెలుగు కవి సమ్మేళనం” వివరాలు మరికొన్ని ..

– డా. ఆచార్య ఫణీంద్ర

“రవీంద్ర భారతి” ప్రధాన ద్వారం వద్ద ఉంచిన బ్యానర్ :

మరికొన్ని పత్రికలలో అచ్చయిన భాగాలు :

సూర్య :

నమస్తే తెలంగాణ :

 

సత్కార సమయంలో నాకు బహూకరించిన జ్ఞాపిక :

సత్కరింపబడిన నేను :

నిన్న “రవీంద్ర భారతి”లో …

నిన్న(14 జులై 2012) సాయంత్రం “రవీంద్ర భారతి” మెయిన్ ఆడిటోరియంలో ఎంతో వైభవోపేతంగా రసరమ్యంగా సాగిన “అఖిల భారత తెలుగు కవి సమ్మేళన మహోత్సవం” వివరాలను ప్రచురించిన కొన్ని దినపత్రికల భాగాలివి –
ఆంధ్రదేశంలోని ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన కవులు పాల్గొన్న ఈ కవి సమ్మేళనంలో నేను “వర్షోపరి”, “త్రిలింగ భాష” అన్న పద్య ఖండికలను వినిపించాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

 ఈనాడు:

సాక్షి:

ఆంధ్ర జ్యోతి:

రేపు “రవీంద్ర భారతి” లో …

రేపు సాయంత్రం “రవీంద్ర భారతి” వేదికపై “అభిప్రాయ్” సంస్థ ఆధ్వర్యంలో “అఖిల భారత తెలుగు కవి సమ్మేళనం” జరుగనుంది. దీనికి సంబంధించిన వార్తను  ( “నమస్తే తెలంగాణ” దిన పత్రిక సౌజన్యంతో ) ఇక్కడ అందిస్తున్నాను.

సాహిత్యాభిమానులకు ఇదే నా ఆహ్వానం.

–  డా. ఆచార్య ఫణీంద్ర

ఈనాటి ’ఈనాడు’ (ఆదివారం అనుబంధం) లో …

ఈనాటి ’ఈనాడు’ (ఆదివారం అనుబంధం)  లోని ’బాల వినోదిని’ శీర్షికలో, నా మరొక ’బాల గేయం’ ప్రచురించబడింది. చిన్న చిన్న మాటలతో పిల్లలకు చక్కని సందేశం అందించాలన్న సంకల్పంతో వ్రాసిన ఆ గేయాన్ని చూడండి.

– డా. ఆచార్య ఫణీంద్ర