నాకు తెలుగు విశ్వ విద్యాలయం “కీర్తి పురస్కారం” !!!

సాహిత్యాభిమానుల అందరి ఆశీస్సులు ఫలించి, ఈ రోజు తెలుగు విశ్వ విద్యాలయం నాకు పద్య కవిత్వంలో “కీర్తి పురస్కారా”న్ని ప్రకటించింది.
అందరికీ ధన్యవాదాలతో …

– డా. ఆచార్య ఫణీంద్ర

ఈనాడు :

en27615

  వార్త :

vr27615ఆంధ్ర జ్యోతి :

AJ27615

ప్రకటనలు

నాన్న

naannaపితృ దినోత్సవ శుభాకాంక్షలతో …

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

 

 

 

నా “ఏక వాక్య కవితల” ప్రక్రియకు వారసులు …

తెలుగు సాహిత్యంలో నేను మొట్టమొదటగా రచించి ప్రవేశపెట్టిన “ఏక వాక్య కవితల” ప్రక్రియను అందిపుచ్చుకొని చాల మంది యువ కవులు, కవయిత్రులు రచనలు చేస్తున్నారు. అలా .. నా శిష్యులుగా శ్రీ”శ్రీనివాస్” మరియు శ్రీమతి “సిరి వడ్డే” రచించిన ఏకవాక్య కవితల గ్రంథాల ఆవిష్కరణ నిన్న జరిగింది. ఆ కార్యక్రమం ఫోటోలు …

– డా. ఆచార్య ఫణీంద్ర

IMG_34613303828511IMG_34683406260746IMG_34779755854213IMG_34896205450374IMG_34792079432444IMG_34873479931680IMG_34640254869051IMG_35049800905922IMG_35034961219228

తెలంగాణ తల్లి (గీతం)

telanagana-Talli

తెలంగాణ రాష్ట్రావిర్భావ ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా నేను రచించిన గీతం :

తెలంగాణ తల్లి (గీతం)
రచన : డా. ఆచార్య ఫణీంద్ర

జయము జయము తెలంగాణ తల్లి !
జయహో జయహో మా కల్పవల్లి !!
అందుకోవమ్మా దివ్య హారతులు –
అందుకోవమ్మ మా నమస్కృతులు – || జయము ||

‘అశ్మక దేశం’ గా అంకురించినావు
‘కోటి లింగాల’ లో కొలువు దీరినావు
‘ఓరుగల్లు’ జిల్లాలో ‘కాకతి’ వై వెలసినావు
‘గోలకొండ’ ఖిల్లాలో ‘కోహినూరై’ వెలగినావు – || జయము || 1

‘భద్రాద్రి సీత’ గా భద్రత చేకూర్చేవు
‘బాసర వాణి’ గా పలుకు తీర్చి దిద్దేవు
‘ఆలంపూర్ జోగులాంబ’ గా శుభమందించేవు
ముగురమ్మల మూలపుటమ్మగ నీవే నిలిచినావు – || జయము || 2

‘గణపతి దేవ చక్రవర్తి’ ఘన కీర్తివి నీవే –
‘రాణి రుద్రమాంబ’ ఖడ్గ వీర విఖ్యాతి నీవె –
‘మల్కిభరాముని’ మత సామరస్య రక్తి నీవె –
‘మహామంత్రి మాదన్న’ మహిత ధీయుక్తి నీవె – || జయము || 3

‘వేములవాడ భీమ కవి’ వశ్య వాక్కు నీవే –
‘పాల్కుర్కి సోమన’ జాను తెనుగు పల్కు నీవె –
‘మల్లినాధ సూరి’ మధుర వ్యాఖ్యాన రీతి నీవె –
‘పోతన కవి’ భాగవత పద్య సుధా నిధివి నీవె – || జయము || 4

‘అప్ప కవి’ వెలయించిన ఛందశ్శాస్త్రం నీవె –
‘విద్యానాధుని’ నృత్య లక్షణ శాస్త్రం నీవె –
‘పొనగంటి తెలగన’ తొలి అచ్చ తెనుగు కృతి నీవె –
‘కందుకూరి రుద్ర కవి ‘ తొలి యక్ష గాన జతి నీవె – || జయము || 5

‘కంచర్ల గోపన్న’ భక్తి కీర్తన నీవె –
‘శేషప్ప కవి’ విరచిత శతక కీర్తివి నీవె –
‘సురవరం’, ‘దాశరథి’, ‘వానమామలై’, ‘సుద్దాల’ …
నవ సాహితీ నిర్మాతల నవ్య స్ఫూర్తివి నీవె – || జయము || 6

“దున్నే వానిదె భూమి” అన్న ఆశయంతో –
‘కొమురం భీం’ – “జల్, జమీన్, జంగల్” నినాదంతో –
రైతాంగ పోరులు, విద్యార్థి ఉద్యమాలతో –
దేశానికి దారి చూపు దివ్య క్షేత్రం నీది – || జయము || 7

మగువ లాడి పాడు పూల ‘బతుకమ్మ’ గీతాలు
‘సమ్మక్క, సారలమ్మ’ తరతరాల జాతరలు
‘లష్కర్ మహంకాళి బోనాల’ పండుగలు
నీ సంస్కృతి చాటేను – మా గుండెలు మీటేను – || జయము || 8

గోదావరి జల జలా .. కృష్ణవేణి కిల కిలా ..
రావాలు పలుకగ, ప్రవాహాలు ఒలుకగ,
నిండు కుండ చెరువులతో – నీటి ప్రాజెక్టులతో –
బంగారం పండవలె ! భాగ్యాలు నిండవలె !! || జయము || 9

‘కాకతీయ తోరణాలు’, ‘చార్మినార్’ వెలుగులతో
‘నిర్మల్, పెంబర్తి కళలు’, ‘సింగరేణి’ జిలుగులతో
‘ఉస్మానియ’ విజ్ఞానం, ‘ఐ. టి.’ విజయాలతో
‘నవ తెలంగాణ’ వై – ఆనంద నాట్యమాడు మమ్మ! || జయము || 10

— *** —

తెలంగాణ రాష్ట్రావిర్భావ వార్షికోత్సవాలు

IMG_20150603_231222

3/6/2015 రోజు తెలంగాణ రాష్ట్రావిర్భావ వార్షికోత్సవాలలో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన అష్టావధానంలో పృచ్ఛకునిగా పాల్గొని, నిషిద్ధాక్షరి అంశాన్ని  నిర్వహించాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు మా కవులందరినీ సత్కరించారు.