ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారి పీఠిక

1998లో ప్రచురించబడిన నా ’కవితా రస గుళికలు’ వచన కవితా సంపుటి(అది నా రెండవ ముద్రిత గ్రంథం)కి విద్వద్విమర్శకులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పూర్వ ఉప కులపతి, కీర్తి శేషులు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు రచించిన పీఠిక ఇది. ఈ పీఠిక అందించే నాటికి ఆయన హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు.
ప్రసిద్ధి చెందిన నా కవితా దృక్పథాన్ని తెలిపే మినీ కవిత –

        ” ఇష్ట సఖి అధరమ్ము జూచి మోహింతు –
        నికృష్ట జీవుల రుధిరమ్ము గాంచి విలపింతు –
        కష్ట సుఖములకు స్పందించి కదలు
        ఉత్కృష్టమైన కలము నాది! ” 

ఈ గ్రంథంలోనిదే!

– డా. ఆచార్య ఫణీంద్ర

 

ప్రకటనలు

నా సంపాదకత్వంలో…

2010లో నా సంపాదకత్వంలో ప్రముఖ కవి ‘ప్రౌఢ పద్య కళానిధి’ ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారి కవితా సంకలనం “ఆత్మీయ కవితా కదంబం” ముద్రించబడింది. రెండు నెలల క్రితమే ప్రతులన్నీ అయిపోయాయి. కవిగారు మళ్ళీ పునర్ముద్రణకు ఉద్యుక్తులవుతున్నారు.
తొలి ముద్రణకు నేనందించిన సంపాదకీయం/ పీఠిక ఇది.

– డా. ఆచార్య ఫణీంద్రమా వంశ వృక్షం…

ఇది మా ’గోవర్ధనం’ వారి వంశ వృక్షం. మా వంశం మొత్తంలో దాదాపు ఎనిమిది తరాల వివరాలను అందించగలిగే చిట్ట చివరి వ్యక్తి మా నాన్న గారే!

దైవానుగ్రహమే అనుకోవాలి… మా నాన్న గారు 2004లో పరమపదించే కన్న ముందు ఆ వివరాలను రికార్డ్ చేయాలన్న తలంపు నాకు కలిగింది.  అలా సేకరించిన ఆ వివరాలను ఇలా రూపు దిద్ది, నా ’ముకుంద శతకం’ కృతి రెండవ ముద్రణలో ప్రచురించాను. మా వంశీయులంతా ఇది చూసి ఎంతో ఆనందించారు. ఇది నేను చేసిన కొన్ని గొప్ప పనులలో ఒకటిగా భావిస్తాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

( Click on the Chart to see on Full Screen.)

’విశిష్ట కవి సమ్మేళనం’లో నేను

మూడు రోజులుగా హైదరాబాదులో ’రవీంద్ర భారతి’ మెయిన్ ఆడిటోరియంలో ’కిన్నెర ఆర్ట్ థియేటర్స్’ నిర్వహిస్తున్న ’తెలుగు వెన్నెల’ (కిన్నెర కవితా మహోత్సవాలు) ఎంతో వైభవంగా జరిగి,  ఈనాటితో సంపూర్ణమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా, నిన్న (22-05-2012) జరిగిన ’విశిష్ట కవి సమ్మేళనం’లో పాల్గొని, కవితా గానం చేయవలసిందిగా నన్ను ఆహ్వానించారు. నేను ’చిరు విరామము’ అన్న పద్య కవితను వినిపించాను. అంతకు ముందు ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డి గారు ’ఆధునిక కవిత్వం – దశ.. దిశ..’ అన్న అంశంపై కీలక ప్రసంగం చేసారు. ఈ వివరాలన్నీ తెలియజేస్తూ అన్ని దిన పత్రికలలో చక్కని కవరేజ్ చేయబడింది. అన్ని పత్రికలలో ఫోటోలను కూడ ప్రచురించారు.
కొన్ని పత్రికలలోని ఆ భాగాలను అందజేస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

సాక్షి ( పై చిత్రంలో ఎడమ నుండి రెండవ స్థానంలో కూర్చున్నది నేనే) :

ఆంధ్ర భూమి (చిత్రంలో ఎడమ నుండి రెండవ స్థానంలో నేనున్నాను) :


ఆంధ్ర ప్రభ ( చిత్రంలో ఎడమ నుండి రెండవ స్థానంలో ఉన్నది నేనే) :

నమస్తే తెలంగాణ  ( పై చిత్రంలో ఎడమ నుండి మొదటి స్థానంలో ఉన్నాను నేను) :

నా శిష్యుని నూతన గ్రంథం …

నా శిష్యుడు ’శంకు’(శంభుని కుమార్) ఈ రోజే తన నూతన ముద్రిత గ్రంథం తొలి ప్రతిని తెచ్చి నాకు అందించాడు. ఆ గ్రంథానికి నేను వ్రాసి ఇచ్చిన పీఠికను చదివి, నా శిష్యుని ఆశీర్వదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

కులీ కుతుబు కావ్య మధువు

కులీ కుతుబు కావ్య మధువు

[గోల్కొండ ప్రభువు, ‘హైదరాబాదు’ నగర నిర్మాత – ‘మహమ్మద్ కులీ కుతుబ్ షా’ రచించిన ‘దక్కనీ ఉరుదూ’ కవితలకు ఆంధ్రానువాదం]

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

1
మదిలో ఒక్కటె కోర్కి నాకిక ఖుదా! మన్నించి ఆలింపుమా!
నదిలో చేపల నింపినట్లు – దయతో, నా చేత నిర్మాణమై
హృదులన్ రంజిల జేయునట్టి నగరంబీ ’భాగ్ పురం’బందునన్
చదలున్నంతటి దాక, నీవు ప్రజలన్ సమృద్ధిగా నింపుమా!

2
హిందు సంస్కృతి యన ఎంతొ ఆదర మొప్పు –
ఇచ్చినాడ మద్ద తేను సతము!
మందిరమ్ము గూడ మస్జీదు వంటిదే!
పక్షపాత బుద్ధి పడదు నాకు!

3
కానగ నభమను నల్లని
ఏనుగు కొక చిన్ని దంత మేర్పడె నేడే!
దానిని జూచిన వెంటనె
పూనిరి ’ఈదు’ను జరుపగ పురమున జనులే!

’ఈదు’ పండుగే సఖి! నేడు ఈదనిమ్ము
సరస శృంగార వైభోగ సాగరమ్ము!
ఎంత త్రావినన్ చషకమ్ము నింక నింపు!
ఎంత సేపైన ఈ శయ్య నింక దిగకు!

4
రండు! కలసి రోదింపగా రండు! రండు!
కార్చ ఈ శోక దినము రక్తాశ్రువులను!
త్యాగ ధనులౌ ’ఇమాములన్’ తలచి, తలచి –
గుండె పగులుటే ’మొహరమ్ము’ గుర్తు మనకు!

5
సప్త సాగరముల సమము సంస్కృత భాష!
తరచి చూడ – తెలియు దానిలోని
సరస శబ్ద భావ సంయోగ సంజాత
రాగ రచిత మధు తరంగ ఘోష!

6
చెంతకు రాత్రి మొత్తమును చేరగనీయవు నిద్ర – సుందరీ!
సంతసమందె నీ ప్రియుడు – సంతసమందెను మన్మథుండు – తా
సంతసమొందె శయ్య – మరి సంతసమొందెను నాల్గు కన్నులున్ –
సంతసమందె గాదె ఇటు సంగమమొందుచు కంటి కాటుకల్!

7
మధువునం దేమి కలదోయి మత్తటంచు
చెంపపై మీటి మృదువైన చేయి తోడ,
ప్రణయమున పంచ ప్రాణాలు రంగరించి
చషకమును నింపి త్రావించె జాణ నాకు!

చెలి సమాగమమ్మె జీవనంబీ ధాత్రి ;
మరి వియోగమన్న మరణమగును!
ఆమె కరము తోడ అందించు చషకమే
’విశ్వ పాలనమ్ము’ విలువ సుమ్ము!

8
ఆమె అందము గని అదిరిపోయిన దేమొ!
కొంత కొంత కరిగె క్రొవ్వు వత్తి!
సూర్య కిరణము లవి సోకగా ఒక్కింత
కరిగిపోయెడి వడగల్లు వోలె!

9
తప్ప త్రాగి తూలు త్రాగుబోతుల వంటి
మగువ మత్తు కనులు మరల మరల
వాలిపోయి, లేచి, వాలిపోవగ – నాకు
కలిగె సందియమ్ము పిలిచినట్లు!

10
మధువు గ్రోలి నేను మత్తుగా నిద్రింప –
నిద్ర పట్టనట్టి నీరజాక్షి
కరములందు స్వర్ణ కంకణమ్ముల నూపు!
చరణ నూపురములు సతము కదుపు!

11
అక్షరముల నేర్పు శిక్షకుం డెవడైన!
పదము, లర్థములను పండితుండు!
’పద్య విద్య’ నేర్పు పండితుం డెవడురా?
’అల్ల’ కరుణ వలన అబ్బు నద్ది!

***

నండూరి వారి శిష్యునిగా …

రాజమహేంద్రి వాస్తవ్యులైన డా. వింజమూరి లక్ష్మి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయానికి సమర్పించి, పి.హెచ్.డి పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం – “నండూరి రామకృష్ణమాచార్యుల సాహిత్యానుశీలనము – వ్యక్తిత్వము”. అందులో నండూరి వారి శిష్యుల పరిచయంలో భాగంగా నా పరిచయాన్ని పొందుపరిచారు ఆ  పరిశోధకురాలు. ఆ పరిచయం ఇది.

– డా. ఆచార్య ఫణీంద్ర

Previous Older Entries