జ్ఞాపికల దొంతరలు .. !

25 ఏళ్ళు పైబడిన నా సాహిత్య కృషికి గుర్తుగా సాధించుకొన్న కొన్ని జ్ఞాపికల దొంతరలు .. !

–  డా. ఆచార్య ఫణీంద్ర

IMG_20160125_195855701

IMG_20160125_200022515

IMG_20160125_200052942

IMG_20160125_195952020


IMG_20160125_195911022

IMG_20160125_200008485

IMG_20160125_195758885

జగిత్యాలలో …

ఈ నెల 22 న జగిత్యాలలో నాకు “బోయినపల్లి వేంకట రామారావు స్మారక పురస్కార” ప్రదానం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కార గ్రహీతలను సత్కరించినారు.
– డా. ఆచార్య ఫణీంద్ర

_20160127_203405

FB_IMG_1453907096219

IMG-20160127-WA0005

 

 

“జయ కేతనం”


received_753745594758919_1453772604603

“తేజోప్రభ” మాస పత్రిక జనవరి సంచికలో, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రచురితమైన నా కవిత …

– డా. ఆచార్య ఫణీంద్ర

image

image

 

 

 

“ముఖ పుస్తకము” (face book)

fb

“ముఖ పుస్తకము” (face book)
రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర

ముఖమె? కాదది – పెక్కురి ముఖము లొకట
జేరి, ముచ్చటించుకొను ప్రసిద్ధ వేది!
పుస్తకమె? కాదు – లిఖిత ప్రహస్త భూష,
విశ్వమున మిత్రు లెవరేని విప్పి చదువ!

నవ్య కాలమందు భవ్య దివ్యావిష్కృ
తి – “ముఖ పుస్తకమ్ము”! దీని గూర్చె
విశ్వమును కుదించి వేయ గ్రామంబుగా,
“మార్కు జుకెరు బర్గు” మాన్యు డొకడు!

ఇక్కడి వారికి, మరి ఇం
కొక్కడొ వారి కది స్నేహ మేరుపరచుచున్,
చక్కగ వ్యాపించెను – “ఫేస్
బుక్క”ను పేరిట ధరిత్రి మొత్తము నందున్!

— && —

హైదరాబాద్ జిందాబాద్!

” సాక్షి” దినపత్రిక వారి కోరికపై నేను వ్రాసిన “హైదరాబాద్ జిందాబాద్” కవితను కుదించి ఈ రోజు ప్రచురించారు.

– డా. ఆచార్య ఫణీంద్ర

_20160112_072916

పూర్తి పాఠం :

“హైదరాబాద్ జిందాబాద్”

———————————–
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
————————————–
నాలుగు శతాబ్దుల క్రితం
మూసీ నది సాక్షిగా
అంకురించిన ప్రణయానికి చిహ్నం –
హైదరాబాద్!
కన్నతండ్రే కర్కశ ప్రభువై
కారాగృహంలో బంధిస్తే ..
ప్రాణాలకు తెగించి,
ప్రాణేశ్వరిని దక్కించుకొన్న
సాహసానికి సంకేతం –
హైదరాబాద్!
నిర్మలమైన నిజమైన ప్రేమకు
మల్కిభరాముడే నిలువెల్ల కరిగి
కవిత్వాన్ని, నృత్యాన్ని కలపడానికి
కట్టిన కల్యాణ వేదిక –
ఇక్కడి పురానా ఫూల్!
ఈ నేలపై ఆనాడు ..
రాచరికం నాట్యానికి నట్టువాంగం పాడింది.
ఈ నగరం పుట్టుక
సామ్యవాదానికి ప్రతీక!
ఈ భూమిపై ఆనాడు ..
ఇస్లాం హైందవం కౌగిలిలో పరవశించింది.
ఈ నగర జననం
మత సామరస్యానికి ఉదాహరణం!!
“భాగమతీ! నీ పేర వెలసిన ఈ నగరం
నా పాలిట భాగ్య నగరం” అన్నాడు కుతుబ్!
“నహీ .. మై తుమ్హారీ హైదర్ బేగమ్ హూ ..
ఇసీలియే యే హై హైదరాబాద్” అన్నది భాగమతి!
ఆ దివ్య ప్రేమికుల ‘మొహబ్బత్’ చూసి
ఆకాశమంత పొంగిన చార్మినార్
నాలుగు మినార్లతో చప్పట్లు కొట్టింది.

అలా ..
తెలుగు, ఫారసీ సంగమించి
‘దక్కనీ ఉరుదూ’కు జన్మనిచ్చింది ఇక్కడే!
గోల్కొండ కోట దివాణంలో
తెలుగు, సంస్కృతం, ఉరుదూ, పారశీక
భాషా సరస్వతులు బృంద గానం పాడాయి.
పహెలీ ‘ఉరుదూ షాయిరీ కితాబ్’ యహీ పైదా హుయీ!
తొలి తెలుగు యక్ష గానం పుట్టిందీ ఇక్కడే!
తొలి అచ్చ తెనుగు కావ్యం పుట్టిందీ ఇక్కడే!
ఇక్కడి కారాగారం ..
రక్తి పాఠాలే కాదు –
భక్తి కీర్తనలు నేర్పగలదు.
రామాలయం కట్టిన రామదాసు
ఆర్తితో “ఎవడబ్బ సొమ్ము?” అని నిలదీస్తే ..
దివి నుండి శ్రీరామచంద్రుడే దిగివచ్చి ఋణం తీర్చుకొన్నది ఇక్కడే కదా!

అక్కన్న పౌరుషం, మాదన్న మనీష
ఇక్కడ లభించిన ‘కోహినూర్’ వజ్రాన్ని
మించిన అమూల్య మణులు!

నగరానికి కూడ పెళ్ళి జరగడం ఎక్కడైనా విన్నారా?
ఒంటరిగా ఉన్న ఈ నగరం జంటగా మారింది
‘సికందరాబాద్ ‘ సొగసరిని చేపట్టి –
ఈ రెండు నగరాలను కలిపే మంగళ సూత్రం – ‘టాంక్ బండ్’!

మసీదులు, మందిరాలు, చర్చిలతో
ఈ నగరం ఒక త్రివేణీ సంగమం!
పరిశ్రమలకు ఈ షహర్ ఒక పరచిన తివాసీ!
వైద్యానికి ఈ నగరానిది వన్నె తరగని వాసి!
అన్నట్టు .. మలేరియాకు మందు పుట్టిందీ ఇక్కడేనండోయ్!

ఈ నగరం ఒక నందన వనం!
ఇక్కడ మూడు కాలాలు వసంతమే!!
ఈ ‘గోల్డెన్ త్రిషోల్డ్’ లోనే కదా ..
‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’
కమ్మని కవితా గానం పుట్టింది!

ఇక్కడి పడుచులు ‘బతుకమ్మలై’, పాటలై –
చెరువులలో నాట్యమాడుతారు.
బోనాలు, పీరీలు, క్రిస్మస్, దసరా, రంజాన్ –
ఏ పండుగైనా ..
నగర జనమంతా ‘అలై బలై’!

ముత్యాల మిలమిలలు
మెహిందీ తళతళలు
గాజుల గలగలలు
బిరియానీ ఘుమఘుమలు
ముషాయిరాల ‘వహువా’లు ..
హుషారు గొలుపుతాయి ఇక్కడ!

ఈ మహా నగరం
సంగీత సాహిత్య సంస్కృతుల కొలువే కాదు ..
స్వాతంత్ర్య సంగ్రామాలకూ నెలవే!
ఇక్కడ గడ్డి పరక కూడ
అవసరమైతే ఖడ్గమై విజృంభించగలదు –
గోల్కొండ కోట గుమ్మంలో దురాక్రమణదారులతో
మూడు పగళ్ళు .. మూడు రాత్రులు ..
వీరోచితంగా పోరిన ‘అబ్దుల్ రజాక్ లారీ’ –
శతృవులనే అబ్బురపరచిన పదునైన కటారీ!

కోఠీ ‘రెసిడెన్సీ’ పై దండెత్తి
తెల్లవారిని తెల్లబోయేలా చేసి ..
ఉరికంబమెక్కిన తుర్రే బాజ్ ఖాన్ –
హైదరాబాద్ కా ‘సమ్మాన్ ‘!

రైతాంగ పోరాటాన్ని
బాహాటంగా సమర్థించి
నవాబును నడి బజారు కీడ్చి,
రక్తాన్ని ధార వోసిన
రచయిత, పత్రికా సంపాదకుడు
షోయబుల్లా ఖాన్ –
హైదరాబాద్ కా ‘షాన్ ‘!

నవ్య భవ్య రాష్ట్రం కోసం
స్వీయ ప్రాణాన్ని తృణప్రాయంగా
సజీవ దహనం చేసి స్ఫూర్తి రగిలించాడు
శ్రీకాంతాచారి –
ప్రపంచమంతా ‘పరేషాన్ ‘!

ఉద్యమం ఈ నగరానికి ఊపిరి!
పోరాటం ఈ నగరం పోకడ!
ఇక్కడ విశ్వవిద్యాలయాలకు
విద్యార్థులే ఉద్యమ పాఠాలు నేర్పుతారు.
ఉత్తుంగ లక్ష్యాలను సాధిస్తారు.

ఇక్కడ అన్ని సంస్కృతులు కలిసి బ్రతుకుతాయి.
ఇక్కడ అన్ని సంప్రదాయాలు కలిసి బ్రతుకుతాయి.
అన్ని మతాలు కలిసి బ్రతుకుతాయి.
అన్ని భాషలు కలిసి బ్రతుకుతాయి.
ఈ నగరం అందరినీ
అక్కున చేర్చుకొంటుంది.
“నమస్తే అన్న!”, “కైసే హో భాయ్?”
అన్న పలకరింపులతో ఈ నగరం
పులకరింపజేస్తుంది.
సహజీవనం ఈ నగరం అసలు భాష!
సాదరమైన ఆప్యాయత ఈ నగరంలో ఆగని శ్వాస!
ఆధా కప్ ‘ఇరానీ ఛాయ్’ స్నేహాన్ని
అమృతమయం చేస్తుంది ఇక్కడ!

కాస్త ‘హలీమ్’. తిని, ‘ఫాలూదా’ తాగి,
నిజం చెప్పు భాయ్ ..
హైదరాబాద్ హై హైదరాబాద్!
హైదరాబాద్ జిందాబాద్!!
అవునా? కాదా?

— &&& —

“హిడింబ”

కవి మిత్రులు – ఆచార్య రావికంటి వసునందన్ గారి 
“హిడింబ” కావ్య పఠనానంతర హృదయ స్పందన : 
_20160103_001220
————————————————————————
                           ‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’
                               డా. ఆచార్య ఫణీంద్ర   
            (తెలుగు విశ్వవిద్యాలయం “కీర్తి” పురస్కార గ్రహీత)                                                                             

                                                                        Dt. 29/12/2015

మిత్రులు, ‘కవి శిరోమణి’

ఆచార్య రావికంటి వసునందన్ గారికి

నమ:

 

  పుడమి కుమారితె, ద్రోవది,

  పడతులు రుక్మిణియు, సత్యభా మాదులనున్

  విడుచుచు – “హిడింబ” వెంటం

  బడితివి! కడు గడుసరి కవివరుడ వనంగాన్! 

 

  తెలుగును, సంస్కృతంబు నతి తేలికగా  కలబోసి, అందులో

  కలిపి పురాణ వీరరస గంధము కొంతయు – కొంత, కొంతయున్

  చిలికియు హాస్య, మోహముల – చేసితి వీవు “హిడింబ” కావ్యమున్!

  వలచెడునట్లు జేసితివి “వాయువు గోడలి” నెల్ల తెల్గులున్!

 

  రస పోషణ పాకములో

  వసునందన సత్కవీంద్ర! వలలుడ వీవే!

  దెసలెల్ల నీదు లఘుకృతి

  పస బారగ – మెచ్చుచుండ్రి పండిత గణముల్!

 

శుభాభినందనలతో –

 ఆచార్య ఫణీంద్ర

—————————————————————————