భారత మహిళా క్రికెట్ జట్టు నాయకురాలు
“మిథాలి రాజ్”
క్రీడా విరమణ ప్రకటన సందర్భంగా –
అభినందన పద్య మాలిక
“””””””‘””””””””””””””””””””””””””””
రచన : డా. ఆచార్య ఫణీంద్ర~~~~~~~~~~~~~~~~~~~

బాలిక వోలె వచ్చి యొక ప్రౌఢగ “భారత జట్టు” నందునన్
వేలకు వేల పర్గులిడి, విశ్వమునం దొక వీర నారిగాన్
“స్త్రీల క్రికెట్టు” క్రీడను ప్రసిద్ధిని బొందితివో “మిథాలి రాజ్”!
ఖేలనమందు నీదు ఘన కీర్తికి గొన్ము – శుభాభినందనల్!
“వండే మ్యాచ్” పరుగులలో
దండిగ – విశ్వమున మొదటి స్థానము నీదే!
ఇండియ సన్మానించెను
పండిన నీ ప్రతిభకు తగు “పద్మశ్రీ”తో
ఆడినా “విరువది మూడు వర్షముల”పై!
నాయకత్వము నిడినా వొక “పద
హారు వత్సరములు”! అందుకొంటి “ద్విశతి”న్*!
విరమణ మొనరించు వేళ – జయతు! #
*(Double Century in Test Match)