Best National Anthem

tricolour

“మాదేయంచు గర్వించమే!”*
రచన: డా|| ఆచార్య ఫణీంద్ర

సకలోర్విన్ వినిపించు శ్రావ్యమగు పల్ జాతీయ గీతాలలో
అకళంకంబయి, అందమైనదయి, ఆహ్లాద ప్రదాయంబునై
ఒకటే ఒక్కటి నుత్తమోత్తమముగా నుర్వీ జనుల్ నిల్పిరే!
ఇక ఆ గీతము భారతాంబ! మరి, మాదేయంచు గర్వించమే!

(* భారత దేశ జాతీయ గీతం ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా ఎంపికైన సందర్భంగా…)

Devotional Song on Lord Venkateshwara

balaji1

ఇంతింత తిరుమణికాపు…(భక్తి గీతం)
రచన: డా|| ఆచార్య ఫణీంద్ర

ఇంతింత తిరుమణికాపు
ఎంత వైభవమగు రూపు
వేంకటపతి పై చూపు
వెనుదిరుగదు- తిరు
వేంకటపతి పై చూపు
వెనుదిరుగదు- ||ఇంతింత||

వజ్ర ఖచిత ఘన కిరీటము-
పద్మ పత్ర సమ నేత్ర ద్వయము-
అధర జనిత మధు మందహాసము-
వెరసి, కమనీయ వదన రాజము- ||ఇంతింత||

అమ్మల గన్న అమ్మలు
అలిమేల్మంగ, శ్రీ సతులు
రొమ్మున కొలువై భక్తులపై
చిమ్మెడి దివ్య కాంతులు- ||ఇంతింత||

అభాగ్య జీవుల అశాంతి బాపి
ఆత్మ స్థైర్యమిడు అభయ హస్తము-
అనంత కోటి పాతకములను
పరిహరించెడి పాద యుగ్మము- ||ఇంతింత||

నెట్టే వరకు కదలరని
తిట్టేరు ధర్మ కర్తలు-
కొట్టిన గాని కదలమని
పట్టుబట్టేరు స్వామి భక్తులు- ||ఇంతింత||

“Bhakta Varaaham”

pig

“భక్త వరాహం”    
             ———————-
                       రచన: డా|| ఆచార్య ఫణీంద్ర

వింత! వరాహమొక్కటి పవిత్రముగా నది నాడి స్నానమున్
ఎంతయొ భక్తి మీర గుడికేగి ప్రదక్షిణ చేసి, చేసి, “సి
ద్ధాంత”మటన్న గ్రామమున తన్వును డస్సియు మూర్ఛిలంగ- అ
ద్దంతయు గాంచి గ్రామ ప్రజ హారతి పట్టిరి మోకరిల్లుచున్!

‘virus’

           computer
  “వైరస్”
          ——–
                రచన:డా.ఆచార్య ఫణీంద్ర

  పలు యుగముల, దైత్య వరులు
  అల హరి వైరులుగ పుట్టి, హరిచే హతమై –
  ఇల మనుజుల పీడింపగ
  కలి యుగమున “వైరసై”రి కంప్యుటరందున్!