పది, పదిహేనేళ్ళ క్రిందట నేను, సాహితీ మిత్రులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు, శ్రీమతి జ్యోతి వలబోజు గారు, శ్రీ కంది శంకరయ్య గారు ప్రభృతులు తెలుగులో తొలితరం బ్లాగర్లుగా రాణించిన వాళ్ళం.
నిన్న ఎందుకో పాత బ్లాగులన్నీ ఒకసారి చూద్దామనిపించింది. అప్పుడు ఒక పోస్ట్ నా కంటబడి, చాల ఆనందం కలిగింది …
సరిగ్గా … పుష్కర కాలం క్రిందటి దీపావళి పండుగ సమయంలో కంది శంకరయ్య గారు తన “శంకరాభరణం” బ్లాగులో నాపై ఒక “ప్రహేళిక”ను రూపొందించి పోస్టు చేసారు. దానికి సమాధానాన్ని ఇస్తూ .. చాల మంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లలో నేనూ పద్యరూపంలో స్పందించాను.
అదంతా .. ఈ క్రింద పొందుపరిచాను.
గమ్మత్తుగా .. మీరూ ఒకసారి గమనించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర
శంకరాభరణం
##########
5, నవంబర్ 2010, శుక్రవారం
ప్రహేళిక - 27
~~~~~~~~~
ఎవరీ బ్లాగరి?
""""""""""""""""""'"""""
ఆ.వె.
పడగ యున్న దొకటి పవిధారి యొకఁడు స
వర్ణదీర్ఘ సంధి వలనఁ గలియ
నాంధ్ర పద్య కవిత కాచార్యుఁడై బ్లాగు
లందు మెరయు డాక్ట రతఁ డెవండు?
ఆ బ్లాగరి ఎవరో చెప్పండి.
- కంది శంకరయ్య
14 కామెంట్‌లు:
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
శుక్రవారం, నవంబర్ 05, 2010 8:44:00 AM
డాక్టర్ ఆచార్య ఫణీంద్ర
గన్నవరపు నరసింహమూర్తిశుక్రవారం,
నవంబర్ 05, 2010 10:38:00 AM
డాక్టరు ఆచార్య ఫణీంద్ర గారు
రవి
శుక్రవారం, నవంబర్ 05, 2010 11:55:00 AM
ఆచార్య ఫణీంద్ర?
SRRao
శుక్రవారం, నవంబర్ 05, 2010 1:19:00 PM
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- శి.రా.రావు
శిరాకదంబం
రాజేశ్వరి నేదునూరి
శుక్రవారం, నవంబర్ 05, 2010 4:34:00 PM
మిత్రు లందరికి దీపావళి శుభా కాంక్షలు
“డా . ఆచార్య ఫణీంద్ర గారు” [ javaabu ]
చంద్రశేఖర్
శుక్రవారం, నవంబర్ 05, 2010 9:27:00 PM
ఆచార్య ఫణీంద్ర (ఫణి + ఇంద్ర)
mmkodihalli
శనివారం, నవంబర్ 06, 2010 5:42:00 AM
ఇష్ట సఖి అధరమ్ము జూచి మోహించు
నికృష్ట జీవుల రుధిరమ్ము గాంచి విలపించు
కష్ట సుఖములకు స్పందించి కదలు
ఉత్కృష్టమైన కలమెవరిదొ?
అట్టివారె డాక్టర్ ఆచార్య ఫణీంద్ర.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
శనివారం, నవంబర్ 06, 2010 7:33:00 AM
డా.ఆచార్య ఫణీంద్ర
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
డా.ఆచార్య ఫణీంద్ర
శనివారం, నవంబర్ 06, 2010 10:58:00 PM
ఇప్పుడ చూచినాడను – ప్రహేళిక నొక్కటి నాదు పేరుపై
అప్పటికప్పు డల్లి ఇటు లందగ జేసెను శంకరార్యుడున్ –
చప్పున నుత్తరం బిడుచు చాటిరి ప్రేమను పండితోత్తముల్ –
ఎప్పటి పుణ్యమో గదిది ! ఎల్లరకున్ తల వంచి మ్రొక్కెదన్!
కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:29:00 AM
మందాకిని గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రవి గారూ,
నేదునూరి రాజేశ్వరి గారూ,
చంద్రశేఖర్ గారూ,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
మీ అందరి సమాధానం సరియైనదే. అభినందనలు.
కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:31:00 AM
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
మీకు ప్రత్యేకంగా అభినందనలు.
కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:58:00 AM
“శిరాకదంబం” రావు గారూ,
ధన్యవాదాలు.
కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:59:00 AM
డా.ఆచార్య ఫణీంద్ర గారూ,
ధన్యవాదాలు.
