పండంటి నా జీవితం …

పండంటి నా జీవితం …

( ప్రేమ గీతం )

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

Love

పండంటి నా జీవితం
పలుకుతోంది స్వాగతం !  || 2 ||
నా గుండెలోన ఉండిపో –
నిండు వలపు కుండవై !           || పండంటి ||

నీ పేరు విన్న చాలు –
ఒళ్ళంత పులకరాలు !
నీ తోడు ఉన్న చాలు –
మురిపాలు నా పాలు !
నీ తోటి యుగళ గీతం –
హృదయంగమ సంగీతం !  || 2 ||
నా గుండెలోన ఉండిపో –
నిండు వలపు కుండవై !           || పండంటి ||

మన రెండు జీవితాలు
విరబూచినట్టి పూలు !
అవి ప్రేమ పరిమళాలు
వెదజల్లు వేన వేలు !
మన ప్రేమ కథా చరితం –
రస రమ్య సుధా భరితం !  || 2 ||
నా గుండెలోన ఉండిపో –
నిండు వలపు కుండవై !          || పండంటి ||

___ *** ___

Single Sentence Delights (Part 3 )

నా ’ వాక్యం రసాత్మకం ’ అనే ’ ఏక వాక్య కవితల సంపుటిని ఇటీవల ప్రొఫెసర్ ఐ. వి. చలపతిరావు గారు [ Former Registrar, Central Institute of English & Foreign Languages ] మరియు శ్రీ జి. రామకృష్ణారావు గారు[ Former Director of Translations, Govt. of A.P. ] కలసి, ఆంగ్లంలోకి Single Sentence Delights పేరిట అనువదించారు.

Image0671

ఆ గ్రంథంలోని కొన్ని ఏక వాక్య కవితలు …

Telugu Poet Dr. Acharya Phaneendra’s
” VAKYAM RASATMAKAM ” in English

” Single Sentence Delights “
[ Part 3]

* Navel is the bud on the creeper of the waist.

* In God’s play, universe tops as a top.

* Born with pain and ends with pain, man can’t tolerate pain in between.

* Desire always has a desire for fulfilment of desire over desire.

* Man made religion has divided Gods and now it is dividing human beings.

* If one man believes another, where is the need for doors and locks?

* What melts is not time, but your longevity.

* Selfless umbrella gets drenched to protect you from getting drenched.

* Cheeks are doorways of the girl’s eyes and shy-smiles are welcome signs.

* ‘Gurkha’ is a marching torch in the sleeping city.

* I’m journeying in the darkness, in quest of the dawn.

* You and I are in front of each other and shyness is erected as a wall.

* Rain drops are dancing on quivering lips of the maiden.

* The sea is a tailor who stiches the sky and the earth together with a thread of water.

* Don’t eulogize the sea, while drinking the water of the river.

* I have seen a wet bundling curled up in corner of the foot path, moaning in rain.

* Mountain is heart broken and tears stream as water fall.

* For that aged couple, their bodies are in India, while their hearts are in America.

* Why ponderous tomes, when a single sentence is full of literary flavour?

’ మరువం ’ ఉష గారు నిర్వహిస్తున్న ’ మత్స్య సుయజ్ఞము ’ నకు సమర్పిస్తున్న పద్య పుష్పము

matsya

నిగమము తస్కరించి గొని నీరధి దాగిన దుష్ట రాక్షసుం

డగు ’ హయ కంఠు ’ నిన్ దునిమి, ఆర్ష సుధర్మము నాది మత్స్యమై

ఖగపతి వాహనుండు హరి గాచెను ! ’ మత్స్య సుయజ్ఞ ’ మూనె మా

భగిని, సుకావ్యకర్త్రి – ’ ఉష ’ ! భాగ్య మొసంగుత నాత డామెకున్ !

( * ఉష గారు !
నేను నిన్నే లాంగ్ టూర్ చేసి, స్వగృహానికి చేరాను. ఈ రోజే మీ ’ జల పుష్పాభిషేకం ’ గురించి తెలిసింది.
ఆ మహాయజ్ఞ ప్రసాదం నా కందకపోయినా, ఆ మత్స్యావతార మూర్తి కరుణా కటాక్ష ప్రాప్తి మీకు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పద్య పుష్పాన్ని సమర్పిస్తున్నాను.
– డా. ఆచార్య ఫణీంద్ర )