“చాప యెంత వరకొ…”

“చాప యెంత వరకొ…”

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

seema

“చాప యెంత వరకొ, చాపుకోవలె కాళ్ళ
నంత వరకె …” యన్న యచ్చ తెనుగు
సామెత నిక యెరిగి సీమాంధ్ర నాయకుల్
మసలుకొనిన యెడల మంచిదగును!

ఐదేళ్ళు నిండాయి!

5th-birthday

25 నవంబర్ 2008 నాడు ప్రారంభించబడిన నా ఈ బ్లాగు ఈ రోజుతో ఐదేళ్ళు పూర్తి చేసుకొంది.

ఈ ఐదేళ్ళలో ఈ బ్లాగులో దాదాపు 300 పోస్టులను ప్రచురించాను. (సంవత్సరానికి సగటున 60 పోస్టులు)

ఇంతవరకు నా బ్లాగుపై దాదాపు అరవై వేల వీక్షణలు ప్రసరించాయి. (సంవత్సరానికి సగటున 12000 వీక్షణలు)

ఇప్పటి వరకు ఒక రోజులో నా బ్లాగుపై అత్యధికంగా 377 వీక్షణలు ప్రసరించాయి. 

ఒక వారంలో అత్యధికంగా 854 వీక్షణలు ప్రసరించాయి. 

ఒక నెలలో  అత్యధికంగా ప్రసరించే వీక్షణల సంఖ్య ఈ నెలలోనే 2750 దాటవచ్చు. (ఇప్పటిదాక ఈ నెలలో 2671) 

ఇక ఒక సంవత్సరంలో అత్యధికంగా ప్రసరించే వీక్షణల సంఖ్య ఈ సంవత్సరం 16500 దాటవచ్చు. (ఇప్పటిదాక పదకొండు నెలలలో 15744).

నా బ్లాగు టాగ్ లైన్ ( My Poetry, My thoughts) కు అనుగుణంగా, ఆత్మ వంచనను అంగీకరించలేని నేను – మనస్పూర్తిగా నమ్మిన సత్యాలను ప్రతిబింబిస్తూ, అభిరుచితో ఉత్తమ కవిత్వాన్ని, నిర్భయంగా సామాజిక విషయాలను వ్రాస్తూ ముందుకు సాగిపోతున్నాను.

నా ఈ బ్లాగు తోబాటు నా ఇతర బ్లాగుల url వివరాలు :

Dr. Acharya Phaneendra :  dracharyaphaneendra.wordpress.com 

పుస్తక పరిమళం :  drphaneendra.wordpress.com

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం : dracharyaphaneendra.blogspot.in

మౌక్తికం : drphaneendra.blogspot.in

నిష్పాక్షిక హృదయంతో, ధర్మ నిబద్ధతతో – ఉత్తమ కవిత్వాన్ని, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షించే అంతర్జాల పాఠకులందరూ నన్ను, నా బ్లాగులను ఇలాగే ఆదరిస్తూ, ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ఇలాంటి వారి వల్లే సీమాంధ్రులు ముద్దాయిలు అవుతున్నారు!!!

ఇంతకు ముందు “ఇప్పుడు ఎందుకు సీమాంధ్ర ‘ప్రజలు’ ముద్దాయిలు అవుతున్నారు?” అన్న శీర్షికతో నేను ప్రచురించిన టపాలో సీమాంధ్ర సోదరులకు సరైన మార్గదర్శనం లభించడం లేదన్న నా ఆవేదనను కొందరు సీమాంధ్రులు సరిగా అర్థం చేసుకోలేదు. 

ముఖ్యంగా పేరుకి మాత్రం ’సమైక్యాంధ్ర’ నినాదం తలకెత్తుకొని, ఒళ్ళంతా ఏక ప్రాంత ప్రయోజనాల స్వార్థం నింపుకొన్న ఒక విషపు పురుగు నేను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రవచించిన ఈ నిజమైన సమైక్యత, సఖ్యతను జీర్ణించుకోలేక తన బ్లాగులో నా మీద అక్కసంతా వెళ్ళగ్రక్కుతూ, విషం కక్కాడు. దానికి ప్రతిస్పందనగా ఒక టపాను విపులమైన విషయాలతో ప్రచురిద్దామని అనుకొన్నాను. కాని మిడిమిడి జ్ఞానంతో మిడుకుతున్న ఆ విషపు పురుగుకు అంత సీన్ లేదని మానుకొన్నాను. ఇలాంటివారు మనం లేవనెత్తిన వాస్తవిక అంశాలను ఖండించేందుకు సరైన సమాధానాలు దొరకక, అక్కసుతో వ్యక్తిగత దూషణలకు దిగుతారు. వీళ్ళకు ధర్మాధర్మ విచక్షణ ఏమిటి … ప్రపంచమంతా ఆ అంశాన్ని ఎందుకు న్యాయమైనదిగా, ధర్మమైనదిగా భావించి మద్దతిస్తున్నారు … అన్న విషయాలతో పనిలేదు. వీళ్ళకు తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. నిజానికి ఇలాంటి వారి వల్లే సీమాంధ్రులు ముద్దాయిలు అవుతున్నారు.
అయితే ఇంకా దురవగాహనతో ఉన్నవారికి సదవగాహన కొరకు చదివేందుకు వీలుగా నా బ్లాగులో జరిగిన చర్చను ఇక్కడ మరొకమారు ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

—————————————————————-

విశ్వరూప్
నవం 12, 2013 @ 09:13:32

ఆచార్య ఫణీంద్ర గారూ,

చాలా బాగా రాశారు.

తెలంగాణ ప్రజలది తమ హక్కుల సాధన కోసం పోరాటమయితే సీమాంధ్రులది తెలంగాణ ప్రజల హక్కులకు అడ్డుపడటానికి జరిగే ఉద్యమం. తమ సొంత హక్కులకోసం కాకుండా కేవలం ఎదుటివారి హక్కులను హరించడానికి ఉద్యమం జరగడం ప్రపంచంలోనే ఇదే ప్రధమం, ప్రపంచంలోనే ఇది దుర్మార్గపు ఉద్యమం.

ఇలాంటిదే మరో పోస్టు.
http://sujaiblog.blogspot.in/2013/08/worlds-ugliest-movement.html

ఇప్పుడు వీరు ఢిల్లీలో ధర్ణాలు చేస్తూ నేషనల్ మీడియా సాక్షిగా తాము ఇన్నాళ్ళూ తెలంగాణాను దోచుకుంటున్నామనే వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు.

అయితే ఇది సీమాంధ్రలో అన్నివర్గాలూ చేస్తున్న నిజమయిన ప్రజా ఉద్యమం కాదు, కొందరు అగ్రకుల ధనిక వర్గాలవారూ, ఉద్యోగస్తులూ చేస్తున్న ఉద్యమం. ఇక్కడి పేద దళిత వర్గాలవారు విభజన సమర్ధిస్తున్నారు.

——————————————————————

తాడిగడప శ్యామలరావు
నవం 12, 2013 @ 10:46:35

సరేనండీ.

సీమాంధ్రలో పుట్టిన వారంతా తెలంగాణాద్రోహులేనని శ్రీమాన్ కేసీఆర్‌గారు సెలవిచ్చారు.
ఇప్పుడు మీరు సీమాంధ్రప్రజలు ముద్దాయిలు అన్నారు.

ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడే సూచనలు బలంగానే ఉన్నాయి కాబట్టి ఎవరన్నా, ఏమన్నా అనవచ్చు. తప్పు లేదు. కానివ్వండి.

తొందరలోనే మరొక మేథావిగారు, సీమాంధ్ర ప్రజలంతా సముద్రంలో దూకి, ఆ భూభాగాన్ని ఖాళీచేసి తెలంగాణాకు ఇచ్చేయాలీ అన్నా ఏమీ ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు.

కాలం చేసే గారడీల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి!

—————————————————————-

gopi
నవం 12, 2013 @ 17:05:47
ప్రజల్ని ముద్దాయిల్ని చేసిన మేధావిని మిమ్మల్నే చూస్తున్నాను…

—————————————————————–

Dr.Acharya Phaneendra
నవం 12, 2013 @ 18:51:28
విశ్వరూప్ గారు!
మీరన్నది నిజమే! సీమాంధ్రలో పేద దళిత వర్గాలవారు విభజనను 

సమర్ధిస్తున్నారు.
మీకు నా ధన్యవాదాలు!

——————————————————————

Dr.Acharya Phaneendra
నవం 12, 2013 @ 19:04:14
శ్యామలరావు గారు!
మీ వ్యాఖ్య ఆవేశంతో చేసినట్టుంది. ఆలోచనతో కాదు.
కువిమర్శ, వ్యంగ్య వ్యాఖ్యానాల బదులు నా వ్యాసంలోని ప్రతి పాయింటును ఎత్తుకొని, ’లాజిక్’ సమాధానాలతో ఖండించి, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే సంతోషించేవాణ్ణి. వాదనకు పాయింట్ దొరకని వారే వ్యక్తిగత విమర్శలకు దిగుతారు.

—————————————————————-

Dr.Acharya Phaneendra
నవం 12, 2013 @ 19:13:51
గోపి గారు!
వాదనకు పాయింట్ దొరకని వారే వ్యక్తిగత విమర్శలకు దిగుతారు.
నేను ప్రజల్ని ముద్దాయిల్ని చేయడం కాదు.
సీమాంధ్ర ప్రజలే ముద్దాయిలుగా నిలిచారు.
ఎలాగో సవివరంగా వ్యాసంలో తెలియజేసాను. వ్యాసంలో మరొక మాట కూడ వ్రాసాను.. గమనించారో … లేదో … !
“బహుశ: ప్రపంచ చరిత్రలోనే ప్రజలు ముద్దాయిలుగా నిలిచిన ఘటన ఇదేనేమో!” అని.
మరొకమారు నొక్కి వక్కాణిస్తున్నాను – “సీమాంధ్ర ప్రజలు తామేం తప్పు చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలోనే అటు తప్పొప్పులను వివరించి, ఇటు ప్రజలను నియంత్రించగలిగే మేధావి కావాలి.”

——————————————————————

గుండు మధుసూదన్
నవం 12, 2013 @ 23:44:36
నిజం చెప్పారు ఫణీంద్ర గారూ! అక్షర సత్యం ఇది. తెలిసికొనగలిగిన మేధావులు మిన్నకున్నారు…తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలేం చేయగలరు? స్వార్థం తలకెక్కడం, హైదరాబాద్ అనే ఉద్యోగ స్వర్గం చేజారిపోతుందే అనే అపోహ వాళ్ళను సరైన బాటలో పయనింపజేయడం లేదు. తెలంగాణ ఏర్పడడమే దీనికి పరిష్కారం.

——————————————————————-

shankar
నవం 13, 2013 @ 13:22:57
సీమాంధ్ర పాలు తాగిన ఫణి విషము గ్రక్కెను..

——————————————————————-

shankar
నవం 13, 2013 @ 13:43:34
సీమాంధ్రులు తమ వుద్యమంలో వ్యతిరేకత తెలియజేసినది ఎవరిమీద??
తెలంగాణా ప్రజలమీద.. అక్కడ నాయకులమీదా కాదే..సీమాంధ్ర నాయకులమీద.. మరి ఆచార్యుల వారు సీమాంధ్రప్రజలను ఎందుకు ఆడిపోసుకున్నట్టు..

కొన్ని వందల నైజాం నవాబుల కాలంలో జరిగిన చీకటి జీవితాన్ని మర్చిపోయి.. ఆంధ్రప్రదేశ్ లో కలిసిన తర్వాత నేర్చిన పలుకులు, చదువులు, విద్య, వైద్యం ఇన్ని సౌకర్యాలు కలిగిన తర్వాత చేసిన మేలుకి కనీసం కృతజ్ఞత తెలుప లేని సంస్కారానికి పరాకాష్టే ఈ రాతలు..

తెలంగాణా ఏరియాలో ఆంధ్రా నుండి వచ్చి పనిచేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలకు, దూషణ భూషణలను ఎదుర్కొని సేవలు చేసిన ఫలితం ఇది..

శాంతిభద్రతలను కాపాడటంలో శ్రీ.వ్యాస్ లాంటి ఎంతో మంది ఆంధ్రా పోలీసులు అసువులు బాసారు..

సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ఏర్పాటుకు వ్యతికులైతే ఇన్నాళ్ళూ వుద్యమం సాగదు.. కాని కొంతమంది తెలంగాణా నాయకుల దారుణమైన మాటలవలన గుండే ముక్కలై వుద్యమాలు చేసారు.. మూడు ప్రాంతాల ప్రజల పన్నులతో అభివృధ్ధి చేదిన రాజధాని నగరం నుండి పొమ్మంటున్నందుకు సీమాంధ్ర ప్రజలు వుద్యమం చేస్తున్నారు…
కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, హైకోర్టు, అనేక సహాయ సంస్థలు అన్నీ అక్కడే.. ఆఖరుకి సముద్రమే లేని హైదరాబాద్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టేరు.

ఇది న్యాయమా అని అడుగుతున్నారు సీమాంధ్రా జనం .. విభజన జరిగితీరాలి లేకపోతే ఎన్నేళ్ళయినా ఇలా సీమాంధ్రులపై విషాన్ని చిమ్ముతూనే వుంటారు….

————————————————————–

Jai Gottimukkala
నవం 13, 2013 @ 15:07:27

Sir, most “ordinary” Andhras are not against Telangana formation.

Apart from vested interests (politicians, contractors and NGO leaders), many “educated” and Internet savvy Andhras (most of whom live in Hyderabad) are the main “defendants” in the case.

The last group’s motives are uncertain. They prefer to quote KCR/TRS instead of debating the question raised. Their main idea seems to be instill a fear psychosis in the minds of Andhras living in 13 districts.

—————————————————————-
papad19051975
నవం 13, 2013 @ 20:38:48
Sir…. kondaru MAHANUBHAVULU kutarkam chestunnaru…. vaari blog lo seemandhrule panditulu., Telangana variki sahityam gurunchi emi teliyadu ani rastunnaru…. bahusa mimmalni choosi asuya ankunta…. Sir… keep posting…..

—————————————————————–

surya
నవం 13, 2013 @ 21:54:48
కేంద్రం మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి అది ధర్మం న్యాయం అయిపోయింది. ఇదే కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం దయ్యం లా కనిపిస్తుంది కదూ. ఇక మీ పోస్టులో కేంద్రం అన్నీ ఆలోచించి అందరి వాదనలు విని తీర్పు ఇచ్చ్చింది అన్న మాట పచ్చి అబధ్ధం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పై సరైన చర్చే జరగలేదు. కేంద్రం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది కేవలం తెలంగాణాలో సీట్లకోసం తప్ప ఇక దేనికోసమూ కాదు. అసలు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం రాలేదెందుకో మరి. నిజమైన సమర్థవంతమైన అధిష్టానమే కనుక పైన ఉన్నట్లయితే తమ పార్టీకే చెందిన ఇరుప్రాంతాల ప్రతినిధుల మధ్య సమన్వయం సాధించలేదా? కేవలం తన సీట్లకోసం నిర్ణయం తీసుకున్న పార్టీని, తన కుటుంబ పదవులకోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని నెత్తిన పెట్టుకున్న మీరు మేధావి ఎలా అవుతారో టీవీల వాల్లకే తెలుస్తుంది. మాకెలా తెలుస్తుంది లెండి.

—————————————————————
Dr.Acharya Phaneendra
నవం 15, 2013 @ 22:43:18
గుండు మధుసూదన్ గారు!
Jai Gottimukkala గారు!
papad గారు!

మూడు రోజులుగా మా తోడల్లుని కుమారుని వివాహంలో పాల్గొన్న నాకు బ్లాగును చూచే వీలు చిక్కలేదు. ఆలస్యంగా చూసినందుకు మన్నించండి.
మీకు నా ధన్యవాదాలు!
మీరన్నట్టుగా విభజనను సమర్థిస్తున్న సీమాంధ్రులూ ఉన్నారు. కాని ఇలాంటి ఉద్యమాలలో నేనింతకు ముందు వివరించినట్టు, వ్యవస్థాపరంగా generalized గా ’సీమాంధ్రులు’ అని అనవసి వస్తుంది! అయినా నేను కొందరు మూర్ఖులు అనుకొంటున్నట్టు వారిపై ద్వేష భావంతో ఈ వ్యాసం వ్రాయలేదు.
“కులములోన ఒక్క గుణహీనుడున్నచో
కులము చెడును వాని గుణము చేత …” అని వేమన అన్నట్టు – ’సమైక్యాంధ్ర’ అంటూ ఉద్యమిస్తున్న (కొందరో… ఎందరో… ఇక్కడ ప్రధానం కాదు) వారి వలన మొత్తం సీమాంధ్రులు ముద్దాయిలవుతున్నారే!” అన్న బాధతో ఈ వ్యాసం వ్రాసాను. “సీమాంధ్ర ప్రజలు తామేం తప్పు చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు.” అని తోటి సోదరులుగా మన ఆవేదనను కూడ తెలియజేసాను.
ఈ సందర్భంలో ఒక విషయం చెప్పుతాను.
నేను పాల్గొని వచ్చిన వివాహంలో పెళ్ళికూతురు వాళ్ళది గుంటూరు. సుహృద్భావ వాతావరణంలో వివాహం ఆనందంగా ఘనంగా జరిగింది. “తెలంగాణకు నిజంగానే అన్యాయం జరిగింది. రాష్ట్రం విడిపోవడమే మంచిది. రాష్ట్రాలు వేరైనా మానవ సంబంధాలు, బంధుత్వాలు ఎక్కడికి పోతాయి? బెంగుళూరు, చెన్నైలలో ఉన్న తెలుగు వాళ్ళతో, ఆ మాటకి వస్తే, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడం లేదా ఏమిటి?” అన్నారు అక్కడ పెళ్ళికూతురు తరపు బంధువులంతా. “ప్రాంతాలుగా విడిపోదాం… ప్రజలుగా కలిసుందాం…” అని మన తెలంగాణ వాదులు అన్నట్టుగానే – వాళ్ళలో కనిపించిన భావ పరిణతికి శిరస్సు వంచి నమస్కరించి ఇంటికి చేరాను.
బ్లాగు తెరిచాను … పాపం!
’శంకర్’ ఉరఫ్ ’వోలేటి’ ఉరఫ్ ’ilare’ అన్న ఒక విషపు పురుగు నిండా విషం కక్కి నీరసించి పడిపోయాడు. ముందు తన బ్లాగులో నాపై విషం కక్కుతూ టపా ప్రచురించాడు. తరువాత ఆ టపా శీర్షికను నా బ్లాగులో వ్యాఖ్యగా ప్రచురించాడు. ఆ పైన ఆ టపాలోని విషయమంతా వ్యాఖ్యగా ప్రచురించాడు. తరువాత ఆ టపా లింకును వ్యాఖ్యగా ప్రచురించాడు. ఇంతా చేస్తే – “నా వ్యాసంలోని అంశాలు ఎలా తప్పో సరైన వాదనతో నిరూపించి చూపాడా?” అంటే ఆ తెలివి లేదు! “బానిసలు కృతజ్ఞతతో పడి ఉండాలి” అన్నట్టు అహంకారాన్ని చూపాడు. ఆక్రోశంతో తన అవివేకాన్ని బయట పెట్టుకొన్నాడు. వేమన చెప్పిన గుణహీనులు ఇలాంటి వారే! వ్యక్తిగతంగా కొందరు సీమాంధ్రులలో కనిపించే పరిణతి – వ్యవస్థగా సీమాంధ్రులలో కనిపించకపోవడానికి ఇలాంటి మూర్ఖులే కారణం!
ఇలాంటి వారి అజ్ఞానాన్ని రూపుమాపాలంటే … వ్యాఖ్య ఏం సరిపోతుంది? మరో టపా వ్రాయవలసిందే!

—————————————————————–

Dr.Acharya Phaneendra
నవం 16, 2013 @ 01:49:58
Mr. Surya!
“కేంద్రం మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి అది ధర్మం న్యాయం అయిపోయింది. లేకపోతే దయ్యం లా కనిపిస్తుంది కదూ” అనుకోవడం మీ అవగాహనా రాహిత్యం. కాని గత పదమూడేళ్ళ తెలంగాణ ఉద్యమకాలంలో అది ఒక ధర్మపోరాటమని, అందులో న్యాయం ఉందని తెలంగాణ ప్రజలే కాదు – సీమాంధ్ర మేధావులు అన్నారు. విని ఉండకపోతే, మీకు మీరుగా కూడ విశ్లేషణ చేసుకొనే సత్తా లేకపోతే, అది మీ తప్పు.
ఈరోజు కేంద్రం అంగీకరిస్తే – అది అవకాశవాదం అంటున్నారు. మరి దశాబ్దం క్రిందటే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమం న్యాయమైనదే అన్నాయే! ఆ పార్టీల జాతీయ నాయకులంతా మూర్ఖులా? చివరికి శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణవాదంలో న్యాయముందని చెప్పిందే? అది మీరు చదువక పోతే మా తప్పా?
పైగా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చ జరుగలేదంటారా?
పొద్దున లేస్తే, ప్రతి టీ.వీ. ఛానల్ లో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజా సంఘాల ప్రతినిధులు సంవత్సరం పాటు చర్చించారు కదండి. అప్పుడు మీరు నిద్రపోయారా?
చివరికి హైకోర్టులో కూడా బలమైన వాదనలు జరిగాయే? బెంచ్ ప్రధాన న్యాయమూర్తి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలిచ్చుకోలేక కేంద్ర ప్రభుత్వ న్యాయవాదే తల్లకిందులైన విషయం అప్పట్లో వార్తా పత్రికలు చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. తమరికి ఆ అలవాటు కూడ లేనట్టుంది.
ఆ ప్రధాన న్యాయమూర్తి 8 వ చాప్టర్ ను ఉటంకిస్తూ, జస్టిస్ శ్రీకృష్ణ వంటి రిటైర్డ్ సీనియర్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటని కూడ వ్యాఖ్యానించారు. అప్పుడు మీరెక్కడ ఉన్నారో మరి! కొసమెరుపు … ఓ రోజు స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణయే విలేకరులతో “ప్రభుత్వం ఎలా కోరితే అలా రిపోర్ట్ ఇచ్చా”మని చెప్పారు. అదీ ఆ రిపోర్ట్ విలువ!
ఆ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం కేవలం అప్పుడు రెండు వర్గాల ఆవేశకావేశాలను చల్లార్చడానికి వాడుకొంది. అందుకే అన్ని ఆప్షన్స్ ను అడిగి ఇప్పించుకొంది. అందులో తాము ఇప్పుడు అవలంబిస్తున్న 5 వ ఆప్షన్ ను కూడ ఇప్పించుకొంది.
అయినా ప్రతి వాడు ఈ మధ్య – “నిర్ణయం తీసుకున్నది కేవలం తెలంగాణాలో సీట్లకోసం” అనడం ఓ ఫాషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని బలంగా కోరుకొంటున్నారని మీరే అంటున్నారుగా! మరి తెలంగాణ ప్రజలు ప్రజలు కారా? ప్రజాస్వామ్యంలో వారి ఆకాంక్షలు నెరవేరకూడదా? వారు ఎలా బ్రతకాలో… నిర్ణయం ఇతర ప్రాంతీయుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలా? What nonsense?
కేంద్రం తెలంగాణను ఇవ్వాలని 2009 లోనే నిర్ణయించుకొంది. తమకు అనుకూలమైన సమయం కోసం ఇంత కాలం వేచి చూసింది.
బ్రిటిష్ వారు కూడ 1942 లోపే భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు. కాని మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధంలో మన సేనలను వాడుకోవాలనుకొన్నారు. అందుకే 1947 వరకు ఆపి అప్పుడు ప్రకటించింది.
ప్రపంచంలో ఏ ఉద్యమంలోనైనా ఫలితం ఇచ్చేవారు ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం సర్వసాధారణం! ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
ఇక చివరలో ‘మేధావి’, ‘టీవీల వాళ్ళు’ అంటూఏవో దెప్పిపొడుపు మాటలు వదిలారు.
నేను మేధావినో, కవినో, పండితుడినో … సీమాంధ్ర సాహితీ సంస్థలకు తెలుసు. సీమాంధ్ర మేధావులకు తెలుసు. ’ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ ప్రభుత్వానికి తెలుసు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలుసు. దానికి మీ సర్టిఫికెట్ అక్కర లేదు.

—————————————————————–

Dr.Acharya Phaneendra
నవం 23, 2013 @ 07:05:27
“కొందరు స్వార్థపరులు రెచ్చగొడితే, ’సమైక్యాంధ్ర’ ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ప్రజలు తామేం తప్పు చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు” అని తోటి సోదరునిగా ఆవేదన చెందుతూ ఈ బ్లాగులో ఇంతకు ముందు ఒక టపాలో – “ఇప్పుడు ఎందుకు సీమాంధ్ర ప్రజలు ముద్దాయిలు అవుతున్నారు?” అన్న శీర్షికతో ఒక వ్యాసాన్ని వ్రాసి ప్రచురించాను. ఆ వ్యాసం చదివి సీమాంధ్ర ప్రజలలో ప్రస్తుత రాష్ట్ర విభజన పరిస్థితులలో సహృదయత నెలకొని, ఏర్పడబోయే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలలో నిజమైన సఖ్యత ఏర్పడాలని ఆకాంక్షించాను.
అయితే పేరుకి మాత్రం ’సమైక్యాంధ్ర’ నినాదం తలకెత్తుకొని, ఒళ్ళంతా ఏక ప్రాంత ప్రయోజనాల స్వార్థం నింపుకొన్న ఒక విషపు పురుగులాంటి ’శంకర్’ ఉరఫ్ ’వోలేటి’ ఉరఫ్ ’ilare’, నేను ప్రవచించిన ఈ నిజమైన సమైక్యత, సఖ్యతను జీర్ణించుకోలేక తన బ్లాగులో (ఆ బ్లాగు ముఖచిత్రంలో నిలుపుకొన్న సీతా,రామ,లక్ష్మణస్వాములు వాని దురహంకారాన్ని క్షమిస్తారా?) నా మీద అక్కసంతా వెళ్ళగ్రక్కుతూ, విషం చిమ్మి, పైగా నా గురించి “సీమాంధ్ర పాలు తాగిన ఫణి విషము గ్రక్కెను..” అంటూ వ్యాఖ్యానించాడు.
నేను సీమాంధ్ర పాలు తాగానా? ఏం? మా తెలంగాణలో పాలు లేవా??? అంటే “వాని దయాదాక్షిణ్యాల మీద మేము ఎదిగాము, మాకంటూ ప్రత్యేకమైన అస్థిత్వమేదీ లేదు!” అని వాని దురహంకార భావం. అదీ ఆ ఆధిపత్య, అహంకార ధోరణి గల ధూర్తునికి తెలుగు నేలపై ఒక ప్రాంతంపై, ఒక ప్రాంత ప్రజలపై ఉన్న చిన్నచూపు. ఇదీ వాని సమైక్య భావం! ఈ ఆధిపత్య, అహంకార ధోరణిని సహించలేకే కదా … తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఇలాంటి దురహంకారుల వల్లే కదా … మాలాంటి వాళ్ళు మానసిక క్షోభతో కరుడు గట్టిన తెలంగాణవాదులుగా మారింది.
ఇంకా ఆ మూర్ఖుని అహంకారాన్ని, అవివేకాన్ని చూడండి –
“కొన్ని వందల నైజాం నవాబుల కాలంలో జరిగిన చీకటి జీవితాన్ని మర్చిపోయి.. ఆంధ్రప్రదేశ్ లో కలిసిన తర్వాత నేర్చిన పలుకులు, చదువులు, విద్య, వైద్యం ఇన్ని సౌకర్యాలు కలిగిన తర్వాత చేసిన మేలుకి కనీసం కృతజ్ఞత తెలుప లేని సంస్కారానికి పరాకాష్టే ఈ రాతలు.. ”
ఇక ఆ అవివేకికి నా సమాధానం ఇది …

ఓ వోలేటి పండిత పుత్రా!
అంటే మేము నవాబుల కాలంలో చీకటి జీవితాన్ని అనుభవించాము. మీరు మిమ్మల్ని బానిసలుగా చేసి పాలించిన బ్రిటిషర్ల కాలంలో భోగ భాగ్యాలను అనుభవించారా? ఒకవేళ అలా అనుభవించిన వాళ్ళే అయితే, నీ సిద్ధాంతం ప్రకారమే, మీకు చదువులు, విద్య, వైద్యం … ఇలా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ వాళ్ళు చేసిన మేలుకి కనీసం కృతజ్ఞత లేకుండా, సంస్కారం లేకుండా ఎందుకు స్వాతంత్ర్య సమరానికి దిగారు? ఆంధ్ర దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సర్ ఆర్థర్ కాటన్ వంటి మహనీయులతో సహా, బ్రిటన్ నుండి వచ్చి పనిచేసిన కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలను, దూషణ భూషణాలను ఎదుర్కొని సేవలు చేసిన ఫలితాన్ని గుర్తించి కృతజ్ఞతతో పడి ఉండకుండా, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు ఇంకా ఎందరో ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు విషం కక్కినట్టేనా? సరే! వాళ్ళు విదేశీ పాలకులు! స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మీ ప్రాంతంలో, మీ ఉద్యోగాలలో చేరి, ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, రైల్వే ఉద్యోగులుగా తమిళులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలకు, దూషణ భూషణాలను ఎదుర్కొని, మీకు సేవలు చేసిన ఫలితాన్ని గుర్తించి కృతజ్ఞతతో పడి ఉండకుండా, వాళ్ళ మీద ఎందుకు విషం కక్కినట్టు?
అసలు విద్యలు నేర్వడానికి, సేవలు పొందడానికి – మరి, కలసి ఉండడానికి సంబంధం ఉందా?
జర్మనీకి చెందిన ’రైట్ బ్రదర్స్’ విమానాలను కనుగొన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఆ సేవలను పొందుతున్నాం. అందుకు కృతజ్ఞతగా మనం భారత దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ను జర్మనీలో కలుపవచ్చునా?
ఇప్పుడు అర్థమయిందా? నీవి ఎంత పరాకాష్టకు చేరిన అజ్ఞానపు వ్రాతలో?
ఓ మూర్ఖ శిఖామణీ!
ఇక నీ ఆధిపత్య అహంకార ధోరణికి నా సమాధానాలు విను –
మీరు మాకు ’పలుకులు’ నేర్పారా?
అసలు నీకు తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి తెలుసా?
తెలుగు భాష ఉమ్మడి ద్రావిడ భాషా కుటుంబంలో వేరుపడి పుట్టింది ’అశ్మక దేశంలో( ఇప్పటి మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతం). ఇప్పుడు నేను మీకు తెలుగు భాషను మేమే అందించామని అనవచ్చునా?
చరిత్రలో మొట్టమొదటి తెలుగు మహానగరం – ప్రతిష్ఠానపురం. దీనినే యూరోపియన్ చరిత్రకారులు ’పైఠాన్’ (ఇప్పటి నిజామాబాదు జిల్లాలోని ’బోధన్’) అన్నారు. ఇప్పుడు నేను మీకు తెలుగు నాగరికతను మేమే నేర్పించామని అనవచ్చునా?
చరిత్రలో మొట్టమొదటి తెలుగు రాజులు శాతవాహనుల రాజ్య పాలన ప్రారంభమయింది ఇప్పటి కరీంనగర్ జిల్లా ’కోటి లింగాల’లో. ఇప్పుడు మీకు పరిపాలన నేర్పింది మేమే అని విర్రవీగవచ్చునా?
ఆ శాతవాహనులే తరువాత రాజ్యాన్ని విస్తరించుకొని అమరావతిని కొత్త రాజధానిగా నిర్మించుకొన్నారు. ఇప్పుడు మేము … మీకు మొట్టమొదటి రాజధానిని నిర్మించి ఇచ్చింది మేమే … కృతజ్ఞతతో పడి ఉండండి … అని అహంకరించవచ్చునా?
అసలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మహాభారత కాలంలోనే – ’అంధక’దేశంగా, ’తెలింగ’ దేశంగా వేరుగా ఉన్నాయి. అప్పుడు అంధక దేశీయులు కౌరవుల పక్షాన, తెలింగ దేశీయులు పాండవుల పక్షాన పోరాడారు. ఇప్పుడు నేను మీరు మొదటి నుండి అధర్మం పక్షాన నిలిచారని దెప్పిపొడువవచ్చునా?
తెలుగు వారికి మొట్టమొదటగా దేశి ఛందస్సులను, జాను తెనుగును, విప్లవాత్మక భావాలను పరిచయం చేసిన పాల్కుర్కి సోమనాథుడు ఇప్పటి వరంగల్ జిల్లా ప్రాంతీయుడు …
తెలుగు వారికి మొట్టమొదటగా ఛందో మర్మాలను తెలియజేసిన అప్పకవి ఇప్పటి మెదక్ జిల్లా ప్రాంతీయుడు …
… ఇలా … వ్రాయాలంటే చరిత్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు భాష, సంస్కృతి, నాగరికత, వ్యాకరణం, పరిపాలన … అన్నీ నేర్పించింది మేమే అనవచ్చునా?
కాని, ఇలాంటి వ్యర్థ వాదనలకు నా సమయాన్ని వృథా చేసుకోలేక పోతున్నాను. మొదట ఈ వివరాలన్నీ తెలియజేస్తూ నా ఈ బ్లాగులో ఒక టపానే ప్రచురిద్దామనుకొన్నాను.
కాని నీకు, నీలాంటి దురహంకారుల మిడిమిడి జ్ఞానానికి అంత సీన్ లేదని ఈ వ్యాఖ్యతో ముగిస్తున్నాను.

—————————————————————-

శునక సూక్తి ముక్తావళి

శునక సూక్తి ముక్తావళి

రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర 

 dogs

 

” విశ్వాస హీనులై విర్రవీగ, మనము
మానవులము కాము – మరచి పోకు!
సాటి వారనిన ఈర్ష్యా ద్వేషముల్ గల్గ,
మానవులము కాము – మరచి పోకు!
ఐకమత్య మొకింత లేక కాట్లాడగా,
మానవులము కాము – మరచి పోకు!
యజమాని యెడ విధేయత వీడి వర్తింప,
మానవులము కాము – మరచి పోకు!

శునకమన – కాస్త ’శునకత్వము’ ను గలుగుచు,
సాటి శునకాల గౌరవించవలె – ” నంచు
పిల్ల కుక్కకు బోధించె పెద్ద కుక్క
శునక పరిభాషలో నీతి సూక్తులెన్నొ!

       ___ &&& ___

“ఆంధ్రజ్యోతి”లో భాగ్యనగర గాథ – నా అభిప్రాయ ప్రచురణ

ఈరోజు (17-11-2013) “ఆంధ్రజ్యోతి” దినపత్రిక, లోకల్ ఎడిషన్ లో ’భాగమతి’ గురించి, ’భాగ్యనగరం’ గురించి ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించారు. వ్యాస రచయితలు – భాగ్యనగర నిర్మాత ’మహ్మద్ కులీ కుతుబ్ షా’ కవితలను అనువదించిన కవిగా నాతో కూడ ఈ విషయంపై ఇంటర్వ్యూ చేసి, నా అభిప్రాయాన్ని ప్రచురించడం జరిగింది. ఆ వ్యాస భాగాలను ఆసక్తి గలవారి కోసం ఇక్కడ అందిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

aj1171113

aj2171113

17_11_2013_008_001

ఇప్పుడు ఎందుకు సీమాంధ్ర ‘ప్రజలు’ ముద్దాయిలు అవుతున్నారు?

states

పదమూడేళ్ళుగా జరుగుతున్న ’తెలంగాణ ఉద్యమం’లో తెలంగాణ ప్రజలు, తమకు జరిగిన అన్యాయాలకు తిరుగుబాటుగా జరిగే వర్గ పోరాటంలో – తమను (తెలంగాణ నాయకులను మినహాయించి) పీడిత వర్గంగా, సీమాంధ్ర నాయకులను/ వ్యాపారులను ( సీమాంధ్రలో వీరు టూ-ఇన్-వన్ ) పీడక వర్గంగా ( సీమాంధ్ర ప్రజలను కాదు ) భావించి ఉధృతంగా ఉద్యమించారు. ప్రాణ త్యాగాలు చేసారు. పట్టు విడువకుండా పోరాడి – దశాబ్దాలుగా రెండు వర్గాల వాదనలను వింటూ ఉన్న మధ్యవర్తి, పెద్ద అయిన కేంద్ర ప్రభుత్వం నుండి తమ న్యాయబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన ఆకాంక్షకు ఒకటి కాదు … రెండు సార్లు అనుకూలంగా ప్రకటనను సాధించుకొన్నారు. ( న్యాయబద్ధమని, ప్రజాస్వామ్యబద్ధమని కేవలం తెలంగాణ ప్రజలు అనుకోవడం కాదు. సీమాంధ్ర మేధావులు అంగీకరించారు. సీమాంధ్రకు చెందిన ఎందరో కవులు ధర్మదీక్షతో సంఘీభావాన్ని తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని జాతీయ పార్టీలు అంగీకరించాయి. అంగీకరించని ఒకటి రెండు పార్టీలు కూడ ఆ ప్రభావం తమ రాష్ట్రాల మీద పడకూడదని మౌనంగా ఉన్నాయి. అందులో కూడా శరత్ పవార్ పార్టీ న్యాయాన్యాయ విచక్షణతో, ఊగిసలాట వదలి ఆమోదాన్ని తెలిపింది. ఇక మన రాష్ట్రంలో అన్ని పార్టీలు డొంక తిరుగుడు మాటలు మాటాడినా, బహిరంగంగా న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య కాంక్షను కాదనలేవు కాబట్టి అంగీకరించక తప్పలేదు.) మొదటిసారి ప్రకటన (2009లో) తరువాత సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించినా, తెలంగాణ ప్రజలు వారిని ముద్దాయిలుగా చూడలేదు. ఎందుకంటే అప్పుడు వారిని పీడక వర్గం ( సీమాంధ్ర రాజకీయ నాయకులు ) ఉసిగొల్పినట్లుగా ప్రస్ఫుటంగా కనిపించింది. కాని రెండవ సారి ప్రకటన (2013) వచ్చిన తరువాత, సీమాంధ్ర రాజకీయ నాయకులలో అత్యధికులు ఇక గత్యంతరం లేదని నిర్ధారణకు వచ్చారు. ఏ ఉద్యమంలోనైనా అది సహజ పరిణామమే! నిజానికి ఏ ఉద్యమానికైనా ఆ సహజ పరిణామమే చరమ దశ! ఆ దశలోనే ఉద్యమాలు విజయం సాధిస్తుంటాయి. ఆ దశలో సీమాంధ్ర ప్రజలు హుందాగా వ్యవహరించి ఉంటే సుహృద్భావ వాతావరణం నెలకొని ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోబాటు తమ సీమాంధ్ర రాష్ట్రాభివృద్ధికి కావలసిన అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశాన్ని వారి నాయకులకు ఇవ్వవలసింది. కాని దురదృష్టం! ఆ దశలో సీమాంధ్ర ప్రజలు వారి నాయకులను కూడ ప్రక్కకు నెట్టి, ధర్మానికి, న్యాయానికి విరుద్ధంగా డైరెక్టుగా రంగ ప్రవేశం చేసి, ’సమైక్యాంధ్ర’ అంటూ ఉద్యమించడం ప్రారంభించారు. అప్పుడు తెలంగాణ ప్రజలలో ఆలోచన బయలుదేరింది … “అసలు పీడక వర్గం సీమాంధ్ర నాయకులా? లేక సీమాంధ్ర ప్రజలా?” అని. సీమాంధ్ర ప్రజలు ముద్దాయిలుగా నిలిచారు. బహుశ: ప్రపంచ చరిత్రలోనే ప్రజలు ముద్దాయిలుగా నిలిచిన ఘటన ఇదేనేమో! ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా ఉద్యమం విజయవంతం అవుతున్న తరుణంలో కౌంటర్ ఉద్యమం ప్రారంభమైన దాఖలాలు లేవు. అదీ … తోటి సోదరులు తమను తాము తగులబెట్టుకొని కాలిపోతూ ఇన్నేళ్ళుగా తీవ్ర ఉద్యమం చేస్తుంటే కనీస సానుభూతి లేకుండా చలనం లేకుండా ఉన్నవారు, ప్రకటనలు రాగానే రోడ్లపైకి వచ్చి ఉద్యమించడం నిజంగా అమానుషం! పోనీ – ఆ ప్రకటన ఏదో ఒక్క రోజులో వచ్చిందా? దశాబ్దాలుగా అన్ని వాదనలు విని, ఏ ఉద్యమంలో జరుగనంత చర్చ జరిగి, అన్ని పక్షాలు మద్దతు ప్రకటించాక, చిట్టచివరగా నిర్ణయం ప్రకటించవలసిన కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టి బాగా ఆలోచించి ఇచ్చిన తీర్పు. అలాంటి తీర్పుపై కౌంటర్ ఉద్యమం చేయడం ఎంత అవివేకం? ఇలా కౌంటర్ ఉద్యమాలు చేస్తే – ప్రపంచంలో ఏ ఉద్యమానికి, ఏ పీడిత వర్గానికి న్యాయం జరుగదు.
ఆడవాళ్ళ రక్షణకు చట్టాలను చేస్తే, మగవాళ్ళు కౌంటర్ ఉద్యమం చేస్తే – న్యాయం జరుగుతుందా?
పేదలకు సహాయ పథకాలను అమలు చేస్తే, ధనికులు కౌంటర్ ఉద్యమం చేస్తే – న్యాయం జరుగుతుందా?
దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తే, అగ్ర వర్ణాలవాళ్ళు కౌంటర్ ఉద్యమం చేస్తే – న్యాయం జరుగుతుందా?
ఇలా తొలిసారి కౌంటర్ ఉద్యమం చేసి సీమాంధ్ర ప్రజలు తమకు తాముగా ప్రపంచానికి తప్పుడు సంకేతాలను పంపుకొన్నారు. ఇన్నేళ్ళ సమైక్య రాష్ట్రంలో పీడక వర్గంగా ఉన్న సీమాంధ్ర నాయకులు తమ ఆకాంక్షల మేరకే అలా వ్యవహరించారని, ఇప్పుడు వారు ఆ బాధ్యతల నుండి తప్పుకొంటున్నారు కాబట్టి, మేమే డైరెక్టుగా రంగంలోకి దూకామని సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు … వెరసి యావత్ సీమాంధ్ర ప్రజలు చెప్పకనే చెప్పుకొన్నట్టయింది. అంటే … తమకు తాముగా పీడక వర్గంగా ప్రకటించుకొని ముద్దాయిలుగా నిలుచున్నారు. అందుకే వంద రోజులకు పైగా ఉద్యమిస్తున్నా, దేశంలో ఎక్కడా, ఏ మూల నుండి కూడా కనీస మద్దతు లభించడం లేదు. మానవతా దృక్పథంతో వాళ్ళ అనుమానాలను, ఆందోళనలు నివృత్తి చేయమంటున్నారు గాని, వారి ఆకాంక్ష మరియు ఉద్యమిస్తున్న ’సమైక్యాంధ్ర’ లక్ష్యానికి కనీస సానుభూతి కూడ లభించడం లేదు. సీమాంధ్ర ప్రజలు తామేం తప్పు చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలోనే అటు తప్పొప్పులను వివరించి, ఇటు ప్రజలను నియంత్రించగలిగే మేధావి కావాలి.
కే.సి.ఆర్. సంధించిన ప్రశ్న అదే – “సీమాంధ్రలో ఒక్క మేధావి లేడా?” అని.
ఏది ఏమైనా – రాష్ట్ర విభజన జరుగక తప్పదు.
రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఈ విభేదాలన్నీ సమసిపోతాయని నా ఆశ! అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలు స్వతంత్రంగా ఉంటూనే, సుహృద్భావంతో ఒకరికొకరు సహకరించుకొంటూ సమాంతరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోవాలని నా ఆకాంక్ష!!

– డా. ఆచార్య ఫణీంద్ర

అరవయ్యేళ్ళ సమైక్యాంధ్ర చరిత్ర … నాలుగు పంక్తులలో!

అభ్యుదయ కవిత్వంలో పీడితుల ఆర్తి, కవిత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తమకు జరిగిన అన్యాయాలను సహించలేక దాదాపు పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు విభజనవాదులై ఉద్యమిస్తూ విజృంభించారు. ముఖ్యంగా గత దశాబ్దకాలంనుండి తెలంగాణ ఉద్యమంపై హృదయాలకు హత్తుకొనే చక్కని కవిత్వం అనేక కలాల నుండి అమితంగానే జాలువారింది. ఉద్యమ కారణాలుగా నిలిచిన అనేక అంశాలను చాల మంది కవులు చాల ప్రతిభావంతంగా కవిత్వీకరించి పాటలుగా, పద్యాలుగా, వచన కవితలుగా రచించి, ఉద్యమానికి ఎంతో బలాన్ని చేకూర్చారు. అందులో కొందరు సీమాంధ్ర కవులు కూడ ఉండడం విశేషం. ఈ కవిత్వమంతా తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని శాశ్వతంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు.

telangana

మరో వందేళ్ళకైనా … తెలంగాణ ఎందుకు విడిపోయిందో తెలుసుకోవాలంటే – ఈనాటి సీమాంధ్ర ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా కల్పనలు, కథనాలు చదువనక్కర లేదు. లేదా తెలంగాణవాదుల ఉపన్యాసాలు, వ్యాసాలు చదువనక్కర లేదు. ప్రతిభావంతంగా పదునెక్కిన పంక్తులతో గుండెలలోకి సూటిగా దూసుకుపోయే ఈ ఉద్యమ కవిత్వం చదివితే చాలు – సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే … ఆ కవిత్వం వాస్తవికతను నలుగురిలో నగ్నంగా నిలబెట్టి చూపింది. ఎందుకంటే … ఆ కవిత్వంలో నీతి, న్యాయాలను పాతరవేసారన్న ఆవేదన ఉంది. ఎందుకంటే … ఆ కవిత్వంలో నిగ్గదీసి అడిగే నిజాయితీ ఉంది.
అదిగో … అలాంటి కవిత్వంలోని ఒక నాలుగు పంక్తులను నిన్న నేను చదువడం తటస్థించింది. చదివినప్పటి నుండి ఆ పంక్తులు నా మస్తిష్కంలో సుడిగుండంలోని వలయాలుగా పరిభ్రమిస్తూనే ఉన్నాయి.

నిజమే! ఈ అరవయ్యేళ్ళ సమైక్య రాష్ట్రంలో మేము వాళ్ళ ప్రాంతానికి వలసలు పోకపోయినా, సీమాంధ్ర అంతా పర్యటించాం. సీమాంధ్రలోని పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొన్నాం. వాళ్ళ చరిత్ర, సంస్కృతిని గురించి ఘంటాపథంగా చెప్పగలం. మేము వాళ్ళతో ఎంతగా కలసిపోయామంటే – చివరికి మా అస్థిత్వాన్ని మేమే మరచిపోయి, తిరిగి నాలుక కరుచుకొని మళ్ళీ నిలుపుకొనేందుకు పోరాడవలసి వచ్చేంతవరకు.

మరి సీమాంధ్రులో … ! మా ప్రాంతానికి వలసలు వచ్చారు. మా నీళ్ళను, నిధులను, ఉద్యోగాలను స్వీకరించారు. కాని మా చరిత్రలో కనీసం ఒక పుటను మించి స్వీకరించలేకపోయారు. మా సంస్కృతిని తమ సంస్కృతిగా అంగీకరించలేకపోయారు. కనీసం మా ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పుణ్యక్షేత్రం ఉందో గట్టిగా చెప్పలేరు.

వారి వ్యావహారిక భాష మాకు ప్రామాణిక భాష అయింది. మా వ్యావహారిక భాష వారి ఈసడింపులకు గురయింది. వారి ప్రాజెక్టులు చాల పూర్తయి పరవళ్ళు తొక్కాయి. మా ప్రాజెక్టులు ఒకటి రెండు తప్ప, అన్నీ పునాదిరాళ్ళుగానే మిగిలాయి.

తుదకు ’విశాలాంధ్ర’ ఒక సమ్మేళనం కాలేకపోయింది. ప్రజాస్వామ్యం ముసుగులో ఒక సామ్రాజ్య విస్తరణగా నిలిచింది.

ఇదే భావాన్ని కేవలం నాలుగయిదు పంక్తుల్లో నిక్షిప్తం చేసారా కవి.

ఆ కవి పేరు ’వడ్డెబోయిన శ్రీనివాస్’.

ఆ పంక్తులు …

” నేను గోదావరి పాయలా బయలుదేరి
సముద్రమై నీతో కలసిపోవాలనుకొన్నాను!
నీవు సముద్రంలా బయలుదేరి
‘నాగార్జున సాగర్’ ఎడమ కాలువ కూడ కాలేకపోయావు!! “

– డా. ఆచార్య ఫణీంద్ర

Previous Older Entries