ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు …

నా పి.హెచ్.డి. అంశం- “19 వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత” పరిశోధనలో భాగంగా నాకు తారసపడిన తొలి క్రైస్తవ వాగ్గేయకారుడు -“పురుషోత్తమ చౌదరి”.
ఆయన త్యాగరాజుకు సమకాలికుడు కావడం విశేషం.

ఈ ’క్రిస్మస్’ పర్వదిన సందర్భంగా ఆ మహాకవిని గురించి లోగడ ఒక సంచికలో ప్రచురించబడిన నా ప్రత్యేక వ్యాసాన్ని సాహిత్యాభిమానుల కోసం ఇక్కడ అందిస్తున్నాను.

క్రైస్తవ సోదరులందరికీ “క్రిస్మస్” పర్వదిన శుభాకాంక్షలతో –

డా. ఆచార్య ఫణీంద్ర

pc1

pc2

pc3

‘ఆంధ్రామృతం’ వారి అభినందన

 chinta

ఇటీవల ఒక సాహిత్య సభలో ‘ఆంధ్రామృతం’ బ్లాగరు శ్రీ చింతా రామకృష్ణారావు గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా నా ‘వరాహ శతకం’ గ్రంథాన్ని ఆయనకు బహూకరించాను. ఆయన దానిని చదివి, ‘కంద – గీత – గర్భ చంపక మాల’ పద్యంతో కూడిన ఒక లేఖను నాకు మెయిల్ చేసినారు. ఆ లేఖను సాహిత్యాభిమానుల కోసం ఈ పోస్ట్ ద్వారా  అందిస్తునాను.

 

– డా. ఆచార్య ఫణీంద్ర    

——————————————————————————————————————

ప్రియ మిత్రులు ఆచార్య ఫణీంద్రులకు!
స్మిత పూర్వ భాషీ! శుభాభినందనలు.
మీరు రచించిన విలక్షణ సమన్వితమైన, సామాజిక ప్రయోజన బాహుళ్యమును సూచించే “వరాహ శతకము” ఆమూలాగ్రము చదివితిని.
మీ వరాహ శతకము సంఘ సంస్కరణా దృక్పథం కలిగి నేటి రచనలందు మేటియై ప్రముఖుల ప్రశంసార్హమైనది. మీ సామాజిక దృక్పథానికి, హృదయవైశాల్యానికి ఎంతో సంతోషిస్తూ, మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

కంద – గీత – గర్భ చంపక మాల:-

ప్రశమన జాతికిన్ మితి నివారణ జేసెడు మేలుగా ‘వరా
హశతకమే’. పఠించి వర ప్రార్థిత సత్ఫల సిద్ధి కోర గా
దశ కనఁజేయు. చేకొనగ తక్షణ మిచ్చును కోరినంత శాం
తి, శుభములన్. మహా మహిమ దేల్చును మీ కృతి. మాన్యతేజసా!

చంపక గర్భస్థ కందము:-

మన జాతికిన్ మితి నివా
రణ జేసెడు మేలుగా వరాహ శతకమే,
కనఁ జేయు, చేకొనగ త
క్షణ మిచ్చును కోరినంత శాంతి, శుభములన్.

చంపక గర్భస్థ గీతము:-

మితి నివారణ జేసెడు మేలు గావ.
చివర ప్రార్థిత సత్ఫల సిద్ధి కోర
కొనగ తక్షణ మిచ్చును కోరినంత.
మహిమ దేల్చును మీ కృతి మాన్యతేజ.

పునరభినందనలతో
బుధజన విధేయుఁడు,
మీ
చింతా రామ కృష్ణా రావు.
సెల్ నెంబర్. 9247238537.

——————————————————————————————————————

ఆహ్వానం అందింది.

wtc

“ప్రపంచ తెలుగు మహాసభలు – 2012” లో భాగంగా 29 డిసెంబర్ 2012 నాడు మధ్యాహ్నం 3 గం||లకు నిర్వహించబడుతున్న ’పద్యకవి సమ్మేళనం’లో పాల్గొనవలసిందిగా కోరుతూ నిర్వాహకుల నుండి ఈ రోజు నాకు ఆహ్వాన పత్రం అందింది. 27,28,29 తేదీలలో మూడు రోజుల పాటు సభలలో పాల్గొనేందుకు నేను 26 వ తేదీ సాయంత్రం తిరుపతికి బయలుదేరుతున్నాను.
1975 లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో నేను 14 ఏళ్ళ బాలుణ్ణి. ఆ తరువాత రెండు సార్లు సభలు విదేశాలలో [మలేషియా(1981); మారిషస్(1990)] జరిగాయి. అప్పటికి కవిగా నా కంత గుర్తింపు లేదు. 22 ఏళ్ళ తరువాత ఇప్పుడు కాస్త గుర్తింపు పొందిన కవిగా ఈ ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉంది. సభలలో పాల్గొని వచ్చాక నా అనుభూతులను తరువాతి పోస్టులలో వివరించే ప్రయత్నం చేస్తాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

బులుసు వేంకటేశ్వర్లు గారి “మన కవులు” గ్రంథంలో …

ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు – ’రామరాజ భూషణుడు’, ’ధూర్జటి’, ’తెనాలిరామకృష్ణుడు’ వంటి ప్రాచీన కవుల నుండి మొదలుకొని, ’విశ్వనాథ సత్యనారాయణ’, ’నండూరి రామకృష్ణమాచార్య’, ’గుంటూరు శేషేంద్ర శర్మ’, ’వేముగంటి నరసింహాచార్యులు’ వంటి దివంగత ఆధునిక కవులతోబాటు; ’అనుమాండ్ల భూమయ్య’, ’దుగ్గిరాల రామారావు’, ఇంకా నా వంటి సమకాలీన కవుల వరకు 50 మంది కవులు రచించిన అనేక విశిష్ట పద్యాలను హృద్యంగా విశ్లేషిస్తూ రచించిన చక్కని విమర్శన గ్రంథం – “మన కవులు”.అందులో ఉన్న నా “మాస్కో స్మృతులు” కావ్య పరిచయం – సాహిత్యాభిమానుల కోసం …

 

– డా. ఆచార్య ఫణీంద్ర

mk1

mk5

mk6

Share this:

 

కార్తీక స్నానం

ఈ కార్తీక మాసంలో ’భీమా’ నదిలో స్నానమాచరించి, ’పండరిపురం’ పాండురంగ విభుని దర్శనం చేసుకొందామన్న మా ఆవిడ కోరికపై పదిరోజుల క్రితం కారులో తీర్థయాత్రకు బయలుదేరాం.

IMAG0374

మధ్యలో ’బీదర్’ లో నరసింహస్వామి దర్శనం చేసుకొన్నాం.

IMAG0369

ఆ తరువాత ’సోలాపూర్’ మీదుగా పండరిపురం చేరుకొన్నాం.

IMAG0373

DSC02186

భీమానది ఒడ్డు దగ్గర అంతా బురదగా ఉండడం వలన పడవలో నది మధ్యలోకి వెళ్ళి స్నానాలు చేసి, కార్తీక దీపాలను నదిలో వదిలాం.

DSC02187

DSC02185

DSC02177

ఒక కళాకారుడు మా కారు అద్దంపై విఠ్ఠలేశ్వరుని, రుక్మిణీ మాతను చిత్రించాడు.

DSC02209

గుడి వద్ద కెమెరాకు అనుమతి లేదు.

“జయ పాండురంగ ప్రభో విఠ్ఠలా! జగదాధారా! జయ విఠ్ఠలా!
పాండురంగ విఠ్ఠలా! పండరినాథ విఠ్ఠలా!”

– డా. ఆచార్య ఫణీంద్ర

’కరుణశ్రీ’ గురించి ’నండూరి’ వారు …

దాదాపు ఒక పుష్కర కాలం పూర్వం మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు గారు జీవించి ఉండగా ’సాహితీ కౌముది’ పత్రిక కోసం – వారితో వారి ప్రియ మిత్రులు ’కరుణశ్రీ’ గారి గురించి నేను జరిపిన ముఖాముఖి పాఠాన్ని ఒక సాహితీ మిత్రుడు నిన్న అడిగి తీసుకొన్నారు. ఇదే అవకాశంగా దానిని అంతర్జాల పాఠకులకు అందిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ks1

ks2

ks3

ks4

నా రచనలు …


ms2

krs

pp

vv

mg

vr

msl

vs

ssd