ఘనంగా జాషువా జయంతి ఉత్సవాలు …

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం – “తెలుగు అకాడమి”, “పద్మభూషణ్ డా. గుర్రం జాషువా పరిశోధన కేంద్రం” ఆధ్వర్యంలో జాషువా మహా కవి 118 వ జయంతి ఉత్సవాలను హైదరాబాదు జూబిలీ హాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. మొదటి రోజు జరిగిన “శత కవితా వసంతం” కవి సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం అందుకొని, నేను జాషువా కవీంద్రునిపై నా కవితను వినిపించాను. ఆ కవితను, ఇతర వివరాలను సాహిత్యాభిమానుల కోసం అందిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

j1

ఓ మహా కవీ … !

రచన : ’కవి దిగ్గజ’ డా. ఆచార్య ఫణీంద్ర

j2

నీ కవితా వధూటి రమణీయ ముఖాంబుజ దివ్య రూప రే
ఖా కమనీయ వైఖరుల గాంచి, “భళీ, భళి” యన్న వారె నీ
దే కులమన్న ప్రశ్న వెలయిం చవమానము సల్పుటన్ – వినన్
బాకున గ్రుమ్మినట్లగును! వారి నొకింత క్షమించు జాషువా!

బ్రదికిన యన్ని నాళ్ళు కుల బాధిత సంఘమునన్ కలమ్ముతో
వదలక పోరు సల్పుచును – వర్ణ వివక్షను జూపు వారికిన్
హృదయములో కళుక్కుమను నేదొ వివేచన గల్గ జేయగా
కదిలితి వీవె – అభ్యుదయ కావ్య రసైక విధాత! జాషువా!

ఒక్కడ వీవె జాషువ! మహోన్నత నవ్య పథంబు జూపుచున్
దిక్కులు మార్చి అభ్యుదయ దీప్తుల నిల్పితి తెల్గు పద్యమున్!
తక్కిన వారలెల్ల నదె తాతల నాటి పురాణ వీధులన్
స్రుక్కిరి గాదె! నీ విటుల చూపిన బాటను సాగి పోయెదన్!

పద్యము ప్రాతదౌ ననక ప్రక్రియలందు వివక్ష యేలటన్,
పద్య కవిత్వమందె నవ పద్ధతి నభ్యుదయాత్మకంబుగా
హృద్య కృతుల్ రచించి, గణనీయ ప్రశస్తిని పొందినట్టి ఓ
అద్యత నాంధ్ర పండిత మహా కవి జాషువ! నీకు మ్రొక్కెదన్!

పచ్చి బాలెంతరాలు మా భరత మాత
ముచ్చటన్ కని పెంచిన ముద్దు బిడ్డ!
సుకవి జీవించు ప్రజల నాలుకల పైన!
నీవు జీవింతు వట్టులే నిక్క మెపుడు!

— *** —

కవి సమ్మేళనంలో ప్రాతినిధ్యం వహించిన నాకు బహూకరించిన జ్ఞాపిక :

j3

ప్రకటనలు

గోలకొండ కవుల సంచికలో…

1930 ల కాలంలో ఒకానొక సీమాంధ్ర కవి దురహంకారంతో “నిజాం రాష్ట్రములో తెలుగు కవులు పూజ్యము” అని ఒక వ్యాసంలో పేర్కొన్నప్పుడు – తెలంగాణ వైతాళికులు, సుప్రసిద్ధ సాహితీమూర్తి కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి గారు ఎంతో బాధపడి, సుమారు 400 మంది ఆనాటి తెలంగాణ కవుల వివరాలు, కవితలను సేకరించి తమ సంపాదకత్వంలో “గోలకొండ కవుల సంచిక” పేరిట ఒక అమూల్యమైన గ్రంథాన్ని రూపొందించి, ప్రచురించి, తగిన సమాధానాన్ని క్రియా రూపంగా ఇచ్చారు. 

gk1

gk8

మాది పండిత కుటుంబం. మా మాతామహుల(మా అమ్మకు నాన్నగారు), పితామహుల(మా నాన్నగారి నాన్నగారు) వివరాలు మరియు వారి కవితలు ఆ సంచికలో విశేషంగా ప్రచురించబడినవి. ఆ సంచికలోని ఆ వివరాలను ఈ క్రింద పొందుపరచినాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

మా పితామహుల వివరాలు, వారి కవిత: 

gk2

gk5

 మా మాతామహుల వివరాలు, వారి కవిత: 

gk4

gk6

gk7

శ్రీ ఆచి రాఘవాచార్య శాస్త్రులు గారు మా అమ్మకు తాతగారు. వారి వివరాలు:

gk3

తెలంగాణ శిష్ట వ్యావహారికం – చర్చ

2007 జూన్ మాసంలో ’మూసీ’ మాస పత్రికలో ప్రచురితమైన “తెలంగాణ మాండలికంలో శిష్ట వ్యావహారికం లేదా?” అన్న నా వ్యాసం పై, ఆ తరువాత వచ్చిన జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల సంచికలలో విశేషమైన చర్చ జరిగింది. కొన్ని లేఖలలో సీమాంధ్రుల ఆక్రోషం, ఉక్రోషం తప్ప వస్తువులో సత్తువ కనిపించలేదు. వాటిని వదిలేసి, పండితులైన శ్రీ  పాణ్యం శేషశాస్త్రి గారి లేఖను, జగత్ప్రసిద్ధులైన కీ.శే. ఓగేటి అచ్యుత రామశాస్త్రి గారి కుమార్తె డా. ఓగేటి ఇందిరాదేవి (నాలుగయిదేళ్ళ క్రితం పరమపదించారు) గారి లేఖను, వాటికి నేనిచ్చిన సమాధానాన్ని ఈ టపాలో ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

tm1

tm2

tm3

ఎన్నో అచ్చ తెనుగు పదాలను కాపాడుకొంటూ వస్తున్న తెలంగాణ మాండలిక భాష!

రెండు మూడు రోజుల క్రితం ఒకటి రెండు బ్లాగులలో తెలంగాణ తెలుగు(మాండలిక) భాషపై వ్యాసం, ఖండన చూసాక – 2007 లో “మూసీ” సాహిత్య మాస పత్రికలో నేను వ్రాసిన వ్యాసం గుర్తుకు వచ్చింది. ఆ వ్యాసాన్ని సాహిత్యాభిమానుల కొరకు ఈ బ్లాగు ద్వారా పునః ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

tm1

tm2 tm3

tm4

శ్రీ రామోజు లక్ష్మీ రాజయ్య గారి లఘు కవితల సంపుటి “సీమ రేగుపండ్లు” గ్రంథానికి నేనందించిన ముందుమాట …

srp2srp3srp4

srp5

srp6srp7srp8srp9srp1

’చేతన’ మాస పత్రికలో…

’చేతన’ మాస పత్రికలో నా కవిత “టెలిగ్రాం ఒక సింహం!” ప్రచురించబడింది. 

చదవండి.

– డా. ఆచార్య ఫణీంద్రch2

ch1