నాకు పరిచయం లేని ఒక సహృదయ సాహితీవేత్త వ్రాసిన వ్యాసం

ఈ రోజు అనుకోకుండా ఒకానొక వాట్సాప్ గ్రూపులో నా గురించి నాకు పరిచయం లేని ఒక సహృదయ సాహితీవేత్త వ్రాసిన వ్యాసం దర్శనమిచ్చింది. పులకిత హృదయుడనై ఆ వ్యాస రచయితకు, వ్యాసాన్ని ప్రచురించిన సహృదయవరునికి ధన్యవాదాలు తెలుపుతూ … ఇక్కడ ప్రచురిస్తున్నాను.
\/
———————————————-
రసవత్తర పద్య రచనాచార్యఫణీంద్రుడు
అలనాటి శ్రీనాథునిలాగా ఇష్టసఖీ అధరారుణిమలో జుంటితేనియలను కనువిందు
చేసినవాడు, నిన్నమొన్నటి శ్రీశ్రీలాగా నికృష్టజీవుల రుధిరజ్యోతులలో
విలాపవిపంచికలను మ్రోగించినవాడు, కష్టసుఖాల కాలప్రవాహినిని తన కలమ్ములో
సిరాగా మార్చి కదలికలెరుగని కఱుకుగుండియలను కరిగించి
సరసహృదయరసనేంద్రియాలకు తన కవనరసగుళికలను రుచి చూపించినవాడు. ఆచార్య
ఫణీంద్ర. గోవర్ధనం ఇందిరాదేవి, గోవర్ధనం దేశీకాచార్య పుణ్యదంపతులకు జులై
27వతేదీ, 1961 వ్యాసపూర్ణిమనాడు, నిజామాబాదులో జన్మించాడు. ప్రాథమికంగా
పద్యకవిగా తన రచనావ్యాసంగాన్ని ప్రారంభించిన ఆచార్య ఫణీంద్ర పూర్తి పేరు
గోవర్ధనం వేంకట ఫణీంద్రశయన ఆచార్య. వంశానుగతంగా వచ్చిన ‘ఆచార్య’ శబ్దం,
తన పేరులోని వ్యవహారనామంలోని ‘ఫణీంద్ర’ శబ్దం వెరసి ఆచార్య ఫణీంద్రగా
వినుతికెక్కాడు.
మలయాళ దేశాధీశ్వరుడైన కులశేఖర మహారాజు సంస్కృతంలో రచించిన ‘ముకుందమాల’
స్తోత్రపుష్పాలను 1993లో ‘ముకుంద శతకంగా’ తెనిగించాడు. పదాల పొందిక,
భావాల అమరిక తెలిసిన కవిగా ఆయనకు పేరు. సందర్భానుగుణంగా పద్యకవిత్వాన్ని,
కాలానుగుణంగా వచనరచనా ప్రక్రియలను మీటుకుంటూ తన కవితాగానాన్ని
వినిపిస్తున్న కవీంద్రుడు, ఆచార్యఫణీంద్రుడు. సాధారణంగా తెలుగు
సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవారే కవిత్వమో, వ్యాసమో, కథలో,
నవలలో రాస్తుంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఆచార్య ఫణీంద్ర
చదువుకున్నది ఏ.ఎం.ఐ.ఇ.(మెకానికల్ ఇంజనీరింగ్) ఐనా తెలుగు సాహిత్యాంలో
వందలాది పద్యాలు, కవితలు, వ్యాసాలు, ఇతర ప్రక్రియలలో చేయి తిరిగిన
వ్రాతగాడిగా ఆచార్య సి.నా.రె., ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, ఆచార్య
తిరుమలలాంటి సాహితీమూర్తుల మెప్పుపొందాడు. ఆయన రచనాకిరణాలు సోకని
తెలుగుదిన, వార, మాస పత్రికలు లేవంటే అతిశయోక్తికాదు. రాష్ట్రంలోని ఎన్నో
వేదికలలో ఎంతోమంది కవివరేణ్యుల కవనసమ్మేళనాలకు ప్రాతినిధ్యం వహించి
వేదికలకే వన్నె తెచ్చినవాడు. ఆంధ్ర పద్యకవితా సదస్సు కార్యదర్శిగా,
యువభారతి సంయుక్త కార్యదర్శిగా ఒదిగి, నేడు అదే సంస్థ గౌరవ అధ్యక్ష
స్థాయికి ఎదిగినవాడు. (నా డిగ్రీ రోజుల్లో(2000) చదివి దాచుకొన్న కవితా
రస గుళికలు ఈ రోజు అలమార సర్దుతుంటే దొరికాయి.) -డాక్టర్.బి.బాలకృష్ణ,
తెలుగు విభాగం, ట్రిపుల్ ఐటీ బాసర. 9948997983.

ప్రకటనలు

“ఆంధ్రజ్యీతి” దినపత్రికలో …

9 జనవరి 2019 నాడు “ఆంధ్రజ్యీతి” దినపత్రికలో మా అబ్బాయి చి. రోహిత్ గోవర్ధనం గురించి ప్రచురితమైన ఆర్టికల్ చదివి, మా అబ్బాయిని ఆశీర్వదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర