కావ్యావిష్కరణ సభ

ఈ నెల 21న హైదరాబాదులోని ‘త్యాగరాయ గానసభ’ మినిహాల్లో నిర్వహించబడిన ప్రముఖ కవి, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులు  ‘ఆచార్య మసన చెన్నప్ప’ రచించిన ‘శుకోపనిషత్తు’  కావ్యావిష్కరణ సభలో నేను గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాను. ఆ కార్యక్రమ వివరాలతో ప్రచురించబడిన వివిధ పత్రికల సమాచారాన్ని పాఠకులకు అందిస్తున్నాను.  

– డా. ఆచార్య ఫణీంద్ర 

నమస్తే తెలంగాణ :

nt22214

ఆంధ్రజ్యోతి :

aj22214

ఆంధ్రభూమి : 

ab22214

సాక్షి : 

sk22214

                                                                       — &&& —

తెలుగు భాష వారధులం!

ఎవరి పంట వారిది!
ఎవరి వంట వారిది!
ఎవరి తిండి వారిది!
ఎవరి కండ వారిది!
ఇక తగాదాలు లేవు –
ఇక విభేదాలు లేవు –
ఇక వివాదాలు లేవు –
ప్రాంతాలుగ విడిపోయాం –
ప్రజలుగా కలిసుందాం!
రాష్ట్రాలుగ విడిపోయాం –
రక్తబంధమనుకొందాం!
మనమంతా సోదరులం!
తెలుగు భాష వారధులం!
‘తెలంగాణ’, ‘సీమాంధ్ర’
రథద్వయం సారథులం!
ఒకరి నొకరు గౌరవించి,
ఒకరి కొకరు సహకరించి,
పరస్పరం పోటీ పడి
ప్రగతి పథా లేలుదాం!
భారతదేశ పటంలో
ప్రకాశిస్తూ సాగుదాం!!
ప్రపంచం కనుగవలో
రత్నాలుగ భాసిలుదాం!!!

– డా. ఆచార్య ఫణీంద్ర

   తెలుగు కవి

2

జయహో తెలంగాణ!

First they ignore you …

Then, they insult you …

Then they fight with you …

Finally, you win …!

                            – Mahatma Gandhi

జయహో తెలంగాణ!

jt

ఎవరు తెలబానులు?


india

రాజ్యాంగ పరిధి మేరకు తమకంటూ ఒక రాష్ట్రాన్ని కోరుకొని పోరాడిన తెలంగాణ ప్రజలను (ఒకప్పుడు సీమాంధ్రులు అలా పోరాడి సాధించుకొన్న వారే సుమా!) దేశ ద్రోహులుగా చిత్రిస్తూ, ‘తాలిబాన్’లతో పోలుస్తూ ‘తెలబాన్లు’ అని పదమూడేళ్ళుగా సీమాంధ్రులు (అందరూ కాదు) నోరు పారేసుకొన్నారు.

ఇప్పుడు అసలు రంగులు బయటపడ్డాయి.

తెలంగాణను ఇస్తే, కొందరు సీమాంధ్రులు పార్లమెంటును బాంబులతో పేలుస్తామంటున్నారు. కొందరు సీమాంధ్ర ఎం.పి.లు కత్తులతో, పెప్పర్ స్ప్రేలతో ప్రవేశించి ‘అఫ్జల్ గురు’ వారసులలాగా పార్లమెంటుపై దాడి చేసారు. కొందరు ఆ దుర్మార్గ దుష్ట నికృష్ట ఎం.పి.లను ‘భగత్ సింగ్’తో పోల్చారు.(మన్నించు షహీద్! ఆ నీచులు మా తెలుగు వాళ్ళయినందుకు సిగ్గుతో తల దించుకొంటున్నాను.) ఇంకొందరు కాంగ్రెస్ ప్రభుత్వం కశ్మీర్, పంజాబ్ లలోలాగా దక్షిణాది రాష్ట్రంలో కూడా చిచ్చు పెట్టిందని అంటూ తమను తాము కశ్మీరీ మిలిటెంట్లకు, ఖలిస్తాన్ తీవ్రవాదులకు వారసులుగా ప్రకటించుకొంటున్నారు. కొందరు సీమాంధ్రను వేరే దేశం చేయాలంటున్నారు. మరికొందరు ఉత్తర భారత దేశం నుండి దక్షిణ భారత దేశాన్ని విడదీయాలంటున్నారు. 

సిగ్గు, లజ్జ ఉంటే … సీమాంధ్రులు (అందరినీ అనడం లేదు!) గుండెల మీద చేయి వేసుకొని ఇప్పుడు చెప్పాలి –

ఎవరు దేశ ద్రోహులు?  ఎవరు తెలబానులు?

స్వచ్ఛమైన దేశభక్తి నిండిన భారతీయ హృదయం గల తెలంగాణవాదిగా

– డా. ఆచార్య ఫణీంద్ర

Shame on Seemandhra M.P.’s part

black

బొమ్మ

తెలంగాణ మహోదయం!!!

తెలంగాణ మహోదయం!!!

రచన : ‘కవి దిగ్గజ’ డా. ఆచార్య ఫణీంద్ర

Telangana Bill in Parlement

“అలిగిన ‘తెలగాణ’ అలుక కారణ మేమి?”
అనుచు నెరిగి తీర్చరయ్యె నాడు!
“జరిగిన తప్పుల చక్కదిద్దెద” మంచు
నాశ్వాస మందించరయ్యె నాడు!
ఉవ్వెత్తు నెగసిన ఉద్యమమ్మును జూచి
ఊరక నిర్లక్ష్యమూని నాడు –
అవహేళనలు సల్పి, అవమానములు సేసి,
“అణచివేతు” మని అహంకరించి,

ఇప్పు డొక ప్రాంతము “సమైక్యమే!” యటంచు
ఒంటి చేయితో చప్పట్ల నూపుటన్న
చేతులే కాలి, ఆకుల చేత బూను
మూర్ఖులటు గాదె ‘సీమాంధ్ర’ ముఖ్యు లింక!

“నాకు స్వేచ్ఛ వలయు” – కేక బెట్టుచు నిట్లు
ఉద్యమములు చరిత నుండె గాని …
“వాని కిడకు స్వేచ్ఛ– వల” దంచు పోరాడు

వింత ఉద్యమమ్ము వెలసె నేడు!

కాకి లెక్కలు మీవంచు కసరె వారు!
దొంగ లెక్కలు మీవంచు దూఱె వీరు!
ఇంత విద్వేషముల కన్న, ఎవరి లెక్క
వారు చూచుకొనుటయే శుభస్కరమ్ము!!!

ధర్మాగ్రహమ్ముతో ధాటి నుద్యమ మూని
కాంచె సిద్ధి ‘తెలంగాణ’ తుదకు –
లాభ నష్టాల లౌల్యంపు టుద్యమ మూని
అడ్డుపడె నయొ సీమాంధ్ర మరల –
నిన్న మొన్న వరకు నేతలు ‘సరె’ యని
మాట మార్చుట మంచి బాట యగునె?
నిన్న మొన్నటి దాక మిన్నకుండిన ప్రజ
లుద్యమం బూనుట ఉచిత మగునె?

“లాభ, నష్టము” లన – లోభ వ్యాపారమా?
ఉద్యమమున ధర్మముండ వలయు!
ఎవ్వ రెన్ని జిత్తు లెత్తులు వేసినన్ –
దక్కు తుది జయమ్ము ధర్మమునకె!!!

అక్కట! ‘ఆంధ్ర’, ‘సీమ’ లొకటౌచు మహోద్యమ మెంత సల్పినన్ –
ఎక్కడ విశ్వమందు కనిపించదు మద్దతొకింత! కాని, ము
న్నొక్కడు లేవనెత్తు బలముబ్బిన ప్రశ్నల కెల్ల విశ్వమున్
మిక్కిలి మద్దతిచ్చె! భువి మీద అధర్మము రాణ కెక్కునే?

త్రాడు పైకి, క్రిందికిని కేంద్రమ్ము లాగు –
నిలువరింప సీమాంధ్రులు నీళ్ళు జల్లు –
గట్టి దీక్షతో ఓ తెలంగాణ వీర!
ఎగిరి తెలగాణ ‘ఉట్టి ‘ సాధించుమోయి!!!

శ్రీలంగూర్చగ ‘భద్రశైల’ శిఖపై సీతమ్మగా ‘లక్ష్మి’యున్ –
ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ ‘బాసర’న్ ‘వాణి’యున్ –
‘ఆలంపూరు’న జోగులాంబగ శుభాలందింపగా ‘గౌరి’యున్ –
మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలున్ బ్రోచున్ తెలంగాణమున్!

— &&& —

చెన్నప్ప గారి గ్రంథానికి నా ముందుమాట!

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రముఖ కవి ఆచార్య మసన చెన్నప్ప గారు తాను రచించిన సరిక్రొత్త గ్రంథానికి నన్ను ముందుమాట వ్రాయమని కోరారు. ఆయన రచించిన ఆ (శుకోపనిషత్తు) గ్రంథానికి నేను వ్రాసిన పీఠికను ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

s1

s4

s5

s7

s8

s2

Previous Older Entries