“తెలంగాణ మహోదయం” గ్రంథ ముద్రణ పూర్తి!

“తెలంగాణ మహోదయం” గ్రంథ ముద్రణ పూర్తి అయింది. పుస్తకాలు చేతికందాయి –

ఇక ముందున్నది

“ఆవిష్కరణ” పండుగ !

– డా. ఆచార్య ఫణీంద్ర

కాంచన లోహాభరణము

కాంచన లోహాభరణము
—————————–
రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
———————————————–

 

 

 

 

 

 

 

 

 

 

సౌందర్య భావానుసంధానమౌ స్త్రీలు
నిర్మాణ కౌశల నిరతి గాంచు –
వస్తు ప్రధాన భావాశ్రిత హృదయులు
స్వచ్ఛత, భారాల సంగతి గను –
ద్రవ్య వినిమయ చిత్తావేశ వర్తకుల్
ధన రూపమున దాని గణన సేయు –
తస్కరణాశయ దారిద్ర్య బుద్ధులు
దొంగిలించుట యెట్లొ తొంగిజూచు –

కాంచనాభరణంబును గాంచినంత,
ఈ సమాజములో గల యెల్ల జనులు
వారి వారి మనోవృత్తి పథమునందు
వేరు వేరు భావాలతో వెలయుచుంద్రు!

కాని …

కాంచన లోహాభరణము
గాంచిన యంతటనె నాకు కలుగును మదిలో
అంచిత భావన మదియే
యెంచగ “శ్రీలక్ష్మి” రూపమేయను రీతిన్!

“తెలంగాణ సాహిత్య అకాడమి” అధ్యక్షులు అందించిన పీఠిక

నా “తెలంగాణ మహోదయం” కావ్యానికి

“తెలంగాణ సాహిత్య అకాడమి” అధ్యక్షులు

డా. నందిని సిధారెడ్డి గారు అందించిన పీఠికను చదువండి.

– డా. ఆచార్య ఫణీంద్ర