“తిక్కన సోమయాజి”

“రసస్రువు”, “శివానంద మందహాసము” – ఇత్యాది మహా ప్రబంధాల కర్త, “ప్రౌఢ పద్య కళానిధి” బిరుదాంచితులు ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన ” V.L.S. Scientific & Literary Foundation ” యొక్క కార్యవర్గంలో కొన్నేళ్ళ క్రితం నన్ను “సాహిత్య సలహాదారు” పదవిలో నియమించారు. ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో ప్రధానమైనది – భీమశంకరం గారి దివంగత సతీమణి “శ్రీమతి వేము అన్నపూర్ణమ్మ” స్మారక పద్య కవితా పురస్కార ప్రదానం.

గత సంవత్సరం ఈ పురస్కారం ప్రముఖ పద్య కవయిత్రి “శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ” గారికి అందించడం జరిగింది.

ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ప్రముఖ పద్యకవి “శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి” గారు ఎంపిక చేయబడ్డారు. వచ్చే నెల ( జులై 2013 ) లో నిర్వహింపబడనున్న ఈ పురస్కార ప్రదాన సభలో పురస్కృత కవికి సమర్పించనున్న సన్మాన పత్రాన్ని రచించమని భీమశంకరం గారు నన్ను కోరారు. 

సాహిత్యాభిమానుల పఠనార్థం ఆ ప్రశంసా పద్యాలను ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

puvvada2

         ప్రముఖ పద్య కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారికి                 

శ్రీమతి వేము అన్నపూర్ణ” జ్ఞాపక పద్య కవితా పురస్కార ప్రదాన

             సందర్భంగా సమర్పించు సన్మాన పత్రము 

             అభినందన మందార మాల

     నాటి మహా కవీంద్రులగు నన్నయ, తిక్కన, ఎర్రనాదులన్

     మేటిగ నిల్చు తిక్కనకు మిక్కిలి కోరిక గల్గెనేమొ తాన్

     నేటి సమాజమందు నవనిన్ జనియింప మరొక్కమారు – మా                                              

     బోటుల భాగ్యమై మరల బుట్టెను తిక్కన సోమయాజిగాన్!

           

              ‘పువ్వాడ శేషగిరి కవి

               పువ్వులటు కవితల నాడు పూచెన్! సుతుడౌ 

              ‘పువ్వాడ తిక్కనఇపుడు!

              ‘పువ్వాడకులమున తెలుగు పువు వాడదహో!

 

              కమ్మని ధార, రసమ్ముల 

              జిమ్మెడి భావము, పదాల చేరిక మరియున్ 

              తమ్ముల కోమలతను ప 

              ద్యమ్ముల నిలిపెదవు తిక్కనార్యా‘! సుకవీ!

 

              ‘తెనుగు తోటలో ఆమ్రపాలిని విహరణ 

              సలుపజేతు; ‘వక్షర ధామముజిగీష

              తోడ దుందుభిమ్రోయజేతువు;’సువర్ణ

              సౌరభమువ్యాప్తి జేతువు సార్థకాఖ్య!

 

              నీదు ప్రతిభ మెచ్చి, నీరాజనములిచ్చి,

              ‘వేము అన్నపూర్ణపేర నున్న 

              పద్య సుకవితానవద్య పురస్కృతి 

              నిత్తు మిదియె! స్వీకరింపుడయ్య! 

 

                       —  @@@ —

ప్రకటనలు

మా గురువు గారి గ్రంథానికి నేను వ్రాసిన పీఠిక

tara2

              1948 లో రచించబడిన మా గురువు గారి గ్రంథం “తారా తోరణం” వారికి తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరస్థాయి కీర్తిని ఆర్జించి పెట్టింది. వారికి ఎనలేని ప్రఖ్యాతిని తెచ్చిపెట్టిన వారి రచన – “శీర్ణ మేఖల” ఆ గ్రంథంలోనిదే. మా గురువు గారి 80 వ జన్మదినోత్సవ సందర్భంగా ఆ గ్రంథాన్ని నాలుగవ ముద్రణగా పునర్ముద్రించడం జరిగింది. 

             ప్రథమ ముద్రణకు డా. కట్టమంచి రామలింగారెడ్డి గారు పీఠికను సంతరించారు. 4 వ ముద్రణకు ఆ సమయంలో ఎవరైనా మహాకవితో పీఠికను వ్రాయిద్దామని నేనన్నాను. కాని మా గురువు గారు “వద్దు – నువ్వే వ్రాయి” అని ఆదేశించారు. “నేనా? …” అన్నాను ఆశ్చర్యంగా.. ఆనందంతో… ! “అవును – నువ్వే!” అని శాసించారు గురువు గారు. అలా ఆ గ్రంథం నా ‘ముందుమాట’తో వెలువడింది. 

               నాకు తెలిసి – సాహిత్య లోకంలో గురువు గారు జీవించి ఉండగానే వారి ఆదేశంపై ఇలాంటి సౌభాగ్యం దక్కిన శిష్యులు కేవలం ఇద్దరే! ఒకరు డా.సి.నారాయణ రెడ్డి గారి గ్రంథానికి పీఠికను వ్రాసిన ప్రముఖ కవి డా. ఎన్. గోపి గారు. రెండవ వాణ్ణి నేనే.

                                                 – డా. ఆచార్య ఫణీంద్ర 

tara

ఏబది వేల చూపుల పండుగ

50000

శ్రీ బహుళాంధ్ర వాజ్ఞ్మయ ప్రసిద్ధ మహాంతరజాలమందు నా
ఈ బహు రామణీయక సహేతుక వాగ్రచనా ప్రయుక్తమౌ
“గ్లోబలు బ్లాగు” నేర్పరచి, కొంచ మటున్నిటు పంచ వర్షముల్!
ఏబది వేల వీక్షణము లేర్పడ నేడు ముదంబు పొంగెడిన్!

                                                        –  డా. ఆచార్య ఫణీంద్ర

“మా నాన్న”

naanna3

“Father’s Day”

ఇలా ఒక తంతులా ఒక రోజును జరుపుకోడం పాశ్చాత్య సంస్కృతి అయినా ప్రొద్దుటి నుండి పత్రికలలో, చానళ్ళలో “నాన్న” అన్న పదం కనిపించగానే, వినిపించగానే మా నాన్న గారే స్మృతిపథంలో మెదులుతూ నయనాలు ఆర్ద్రమవుతున్నాయి. మా నాన్న గురించి, లోకంలో “నాన్న” మహత్త్వం గురించి లోగడ ఒక యువకవి గ్రంథానికి పీఠికను వ్రాస్తూ నేను వ్రాసిన వాక్యాలు వలయాలై నా మస్తిష్కం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ పీఠికలోని ఆ భాగాన్ని ఇక్కడ ప్రచురిస్తూ, మా నాన్న గారి సంస్మరణలో చరితార్థమవుతున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

naanna1

naanna2

మరో ‘బాపు’

మా ‘ఏ.ఎస్.రావు నగర్’ లో నివసించే శ్రీ కె. వి. భీమారావు గారు సుప్రసిద్ధులైన చిత్రకారులు.

kvb1

బాపు గారి శైలిలో కడు రమ్యంగా చిత్రాలను రచించే భీమారావు గారు “మరో బాపు” గా ప్రఖ్యాతి వహించారు.

విష్ణు సహస్ర నామావళిలోని ప్రతి నామానికి ఒక బొమ్మ చొప్పున ఈయన గీసిన వేయి బొమ్మలతో రూపొందిన గ్రంథం విశేషంగా ప్రాచుర్యం పొందింది. అలాగే, “హనుమాన్ చాలీసా”, “భజ గోవిందం” వంటి స్తోత్రాలకు కమనీయమైన చిత్రాలను వేసారు. నాటి రామాయణం నుండి నేటి ఆధునిక రచనల వరకు గల అనేక గ్రంథాలకు రమణీయమైన చిత్రాలను రచించి స్వయంగా బాపు గారి మెప్పును కూడ పొందారు. మంచి భావుకులు అయిన ఈయన గీసే బొమ్మల లోని పాత్రల ముఖాలలో చక్కని భావాలను పలికిస్తారు. 

నేను రచించిన “సీతా హృదయం” గేయ కావ్యానికి బొమ్మలు గీయడానికి భీమారావు గారు అంగీకరించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నేత్ర పర్వంగా ఉన్న భీమారావు గారి చిత్ర కళా ఖండాలను కొన్నింటిని తిలకించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

kvb2

shivakasava

kvb4

kvb5

kvb6

kvb11

kvb10

kvb12

kvb14

kvb15

kvb16

kvb17

kvb26

kvb27

kvb18

kvb25

kvb19

kvb21

kvb22kvb24

kvb23