పూల లోని పుప్పొడి వలె …

పూల లోని పుప్పొడి వలె … (లలిత గీతం)
రచన : ‘కవి దిగ్గజ’ డా. ఆచార్య ఫణీంద్ర

Flower

 

 

 

 

 

 

 

పూల లోని పుప్పొడి వలె
నీవు నన్ను పరిమళమై –
పలుకరింతువే !
పులకరింప జేయుదువే !! ||పూల లోని||

శిశిర కాల జీవితమున
శిథిలమైన నా హృదికి –
రసగీతిగ వచ్చెదవే !
వసంతమే తెచ్చెదవే !! ||పూల లోని||

బండరాయి వంటి నాదు
గుండెలోన నీవు –
మన్మథాస్త్రమై గ్రుచ్చెదవే !
మరులు నాలో విచ్చెదవే !! ||పూల లోని||

పూవు నుండి పరిమళమును
వేరు చేయలేములే !
నా నుండి నీవింక –
వేరు కాలేవులే !! ||పూల లోని||
__ @@@ __