అమలిన “కీర్తి” పురస్కృతి

అమలిన “కీర్తి” పురస్కృతి –

కమనీయము నాదు “పద్య కవిత” ని, నాకున్

“రమణీయ” “శివ” సభ నొసగె

విమల స్తుత “తెలుగు విశ్వవిద్యాలయమే!

 

– డా. ఆచార్య ఫణీంద్ర

 

(రమణీయ* శివ** సభ = సుందరమైన శుభకరమైన సభ

* రమణ = కె.వి.రమణాచారి గారు .. నాకందించిన పురస్కారాన్ని విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన వారు.

** శివ = ఎల్లూరి శివారెడ్డి గారు .. విశ్వవిద్యాలయ ఉపకులపతి.)

http://www.youtube.com/watch?v=6nKYIl2YkZM&sns=em

ప్రకటనలు

ఆహ్వానం


27/10/2015 నాడు నాకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని ప్రదానం చేయబోతుంది. ఆ సమావేశం ఆహ్వాన పత్రిక మీ కోసం …

– డా. ఆచార్య ఫణీంద్ర

LL7NWBTrbdhATrUH4H6XH5Qa

2JB4f9Y0Kg2W514QBXV66B4E

8d0XK1ehBFd3V98D2Kb01Wra

శుభమగు గాక !

శుభమగు గాక ! ఆంధ్ర పద సోదరులార ! వెలుంగు గాక – సౌ

రభముల పూలతోటలును, రంగుల హంగులతో దుకాణముల్,

నభమును దాకు పెద్ద భవనాల్, సువిశాలపు రోడ్లు, కొల్వుకు

న్నభయ మిడన్ పరిశ్రమలు నా ‘యమరావతి’ రాజధానిలో!

– డా. ఆచార్య ఫణీంద్ర

_20151022_072736

పురస్కారం – తిరస్కారం !!!

Sahitya-Akademi-award

             దేశంలో జరుగకూడని ఒక సంఘటన జరిగితే లబ్ధ ప్రతిష్ఠులైన కవులు, రచయితలు తమ కలంతో దాన్ని తూర్పారబట్టి, ప్రజలలో చైతన్యం రేపి, చైతన్యంతో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమించి పాలకుల మెడలు వంచేట్టు చేయాలె.

            అట్లా చేయగలమన్న ఆత్మవిశ్వాసం కరువైన ఒక రచయిత తనకు దక్కిన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరస్కరించి, ఇటీవల నిరసనను తెలిపినాడు. అదేదో ఘనకార్యమైనట్టు మరికొందరు అదే బాట పట్టినారు.

కత్తి కన్న కలం గొప్పదని నాటి కవులు, రచయితలు చాటితే .. తమ కలంపై (లేక) తాము చెప్పుతున్న అంశంపై .. తమకే నమ్మకం సడలి బెదిరింపులకు దిగుతున్నారు నేటి రచయితలు. వీరి కవితాశక్తి కన్న వీరి రాజకీయోద్దేశ్యాలే ఇక్కడ ప్రస్ఫుటంగా గోచరిస్తున్నవి.  

దేశం శాశ్వతమైనది. పాలకులు నిమిత్త మాత్రులు. దేశం పూజనీయం. దేశంపై ప్రతి పౌరుడు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలె. కాని పాలకులలోమంచి వారుంటే .. గౌరవిస్తాం; చెడ్డవాళ్ళుంటే .. దూషిస్తాం. మళ్ళీ ఎన్నికలలో చెడ్డవాళ్ళు అనుకొన్నవాళ్ళను ఓడిస్తాం. అదే ప్రజాస్వామ్యం మనకిచ్చిన ఆయుధం.

సాహిత్య అకాడమీ అవార్డు పాలకుడూ తన జేబులోనుండి ఇచ్చేది కాదు. అది దేశం దేశ కవులకు, రచయితలకు ఇచ్చే విశిష్ట గౌరవం.

పాలకులు తప్పు చేస్తే ప్రజాస్వామ్యం ఇచ్చిన బలంతో వారిని తమ రచనల ద్వారా దుమ్మెత్తి పోయాలె. అంతే కాని, పాలకులు తప్పు చేస్తే .. దేశం ఇచ్చిన పురస్కారాన్ని తిరస్కరించి ధిక్కార స్వరంతో దేశాన్ని అవమానించడం మూర్ఖత్వం. నైచ్యం.

రేపు పాలకులు దిగిపోవచ్చు. కవులు, రచయితల  భావ జాలానికి అనుకూలమైన పాలకులు రావచ్చు. అప్పుడు మళ్ళీ అవార్డులను స్వీకరిస్తారాఅట్లాగయితే .. కవులు, రచయితలు అవార్డులను సర్వజనామోదంతో కాకుండా, తమ భావజాలానికి అనుకూలమైన పాలకుల పైరవీలతో పొందినట్టుగా అంగీకరించినట్టే!

సామ్రాజ్యవాద శక్తిగా మన దేశాన్ని పాలించిన విదేశం -‘బ్రిటన్అందించినసర్బిరుదును తిరస్కరించడం .. సర్వ సత్తాక స్వతంత్ర గణతంత్రం – మన మాతృదేశం అందించిన పురస్కారాన్ని తిరస్కరించడం .. రెండూ ఒకటేనా?

ఇక్కడ ఉత్పన్నమయే ప్రశ్నదేశానికి, పాలకులకు మధ్య గల భేదానికి సంబంధించి .. కవులు, పండితులకే లోపించిన అవగాహన గురించి! దేశం పట్ల నిరసనకు, పాలకుల పట్ల నిరసనకు గల వ్యత్యాసాన్ని మేధావులే గుర్తించలేకపోవడం గురించి!!

– డా. ఆచార్య ఫణీంద్ర