నండూరి వారి జయంతి సభ

నండూరి వారి జయంతి సభ వివరాలు :

సాక్షి :

sakshi30414

 

 

 

 

 

 

 

 

నమస్తే తెలంగాణ :

nt30414

జంట నగరాలలోని సాహిత్యాభిమానులారా !

జంట నగరాలలోని సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం

– డా. ఆచార్య ఫణీంద్ర

y5

ఎన్ని కలలో … !

ఎప్పుడో … 1996లో ‘ఈనాడు ‘ దినపత్రికలో ప్రచురితమైన నా గేయకవిత ఇది. ఈ ఎన్నికల వేళ మళ్ళీ ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ennikalu

ennikalu 2

పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాను!

మా అబ్బాయి చి|| రోహిత్ గోవర్ధనం రూపొందించిన లఘుచిత్రాన్ని గురించి ‘ఈనాడు ‘ దినపత్రిక (15/04/2014) లో విశేషంగా పరిచయం చేయడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది.  పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

e3e1e2

రచయితలు తమ ముద్రిత గ్రంథాలను అమ్ముకోవడం ఎలా?

చాలా మంది రచయితలు, కవులు తాము పుస్తకాలు అచ్చు వేసుకొని నష్టపోయామని, తమ పుస్తకాలు అమ్ముడుపోక అటకలపై మూల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారికి ఉపయుక్తంగా ఉండే నా సూచనలు ఇవి.  

books 

 

1. మొదట ముద్రణకు ముందే రచయిత నిష్పక్షపాతంగా ఆ గ్రంథానికి ప్రచురణ అర్హత ఉందా? .. లేదా? … అని బేరీజు వేసుకోవాలి. రచనలో పటుత్వం ఉంది … నలుగురికీ నచ్చుతుంది … అనుకొంటేనే పెట్టుబడి పెట్టాలి.

ముద్రణ సమయంలో గ్రంథం కాస్ట్ ప్రైజ్ కన్న ధర నాలుగింతలు ఎక్కువగా  ముద్రించాలి. “గ్రంథం లభించే చోటు” అంటూ స్వీయవిలాసంతోబాటు కొన్ని వివిధ  నగరాల, జిల్లాలలోని ప్రసిద్ధ బుక్ షాపుల అనుమతితో, వారి వారి చిరునామాలను కూడా ఆ గ్రంథంలో ముద్రించాలి.

2. గ్రంథావిష్కరణ రోజు సగం ధరకేఅని ప్రకటించి, అమ్మడం వలన కొన్ని అమ్ముడు పోతాయి. లేదా “కొత్త పుస్తకం కొంటే  కొన్ని పాత పుస్తకాలు (అమ్ముడు పోనివి) ఉచితం” అని ప్రకటించడం మరొక పద్ధతి. ఇలా బోణీ కొట్టవచ్చు.

3. తరువాత సమీక్షలు వివిధ పత్రికలలో వచ్చాక, కనీసం ఒక పది ఊళ్ళ నుండి గ్రంథం పంపమని లేఖలు వస్తాయి. వారికి సగం ధరకు, ఇంకా  పోస్టేజ్ ఫ్రీగా పంపుతాము అని …డబ్బును ఎం.ఒ. చేయమని కార్డు ముక్క వ్రాయాలి. అలా కొంతమందికి అమ్మవచ్చు.

4. ఆ పైన తక్షణం డబ్బును ఆశించకుండా, గ్రంథంలో ముద్రించిన బుక్ షాపులలో 50 ప్రతుల చొప్పున ఉంచాలి. ఒక సంవత్సరం తరువాత తీరుబడిగా వెళ్ళి, అమ్ముడు పోయిన గ్రంథాల డబ్బును (ఆ షాపు వాళ్ళ కమీషను పోను మిగిలింది) తెచ్చుకోవచ్చు.

5. వివిధ నగరాల, జిల్లాల, గ్రామాల, విద్యాసంస్థల గ్రంథాలయాలకు వెళ్ళి కొన్ని ప్రతులను అమ్ముకోవచ్చు.(సాధారణంగా 40% డిస్కౌంటుతో)

6. కొన్ని కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపాళ్ళ అనుమతితో తెలుగు పండితులకు, ఉపాధ్యాయులకు, సాహిత్యాభిరుచి గల విద్యార్థులకు కొన్ని ప్రతులను అమ్ముకొంటే కొంత డబ్బు వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపాళ్ళకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ఇచ్చి ప్రసన్నం చేసుకొని, విద్యార్థులకు సగం ధరఅంటే చాలా డబ్బే మూటగట్టుకోవచ్చు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను సంస్థ సిబ్బంది మరుసటిరోజు పుస్తకం కొనుగోలుకై డబ్బు పట్టుక రావాలని శాసించిన సందర్భాలు కూడా లేకపోలేదు. 

7.  వివిధ సాహిత్య సభలలో, ఎగ్జిబిషన్లలో, బుక్ ఫేర్ లలో పెట్టే పుస్తక విక్రయం స్టాళ్ళలో వాళ్ళ కమీషన్ రేట్ల ప్రకారం ఒప్పుకొని ఉంచితే, కొంత డబ్బు వస్తుంది. 

8. వివిధ పురస్కారాల వివరాలు తెలుసుకొని పంపితే, బహుమతి లభించే స్థాయి ఉంటే, పెద్ద మొత్తమే చేతికందుతుంది. 

 9. రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయాల కొనుగోళ్ళ ప్రకటన ఎప్పుడు వచ్చేది కాస్త గమనించి, అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా మంచి మొత్తమే లభిస్తుంది.

10. చివరగా .. బంగారు కోడిపెట్ట వంటిది రాజా రామమోహనరాయ్ ఫౌండేషన్వారి ప్రకటన! అది ఎప్పుడు వెలువడేది గమనించి అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా చాల పెద్ద మొత్తమే మన అకౌంటులో వచ్చి పడుతుంది.  

11.  ఈ మధ్య కినిగె వంటి సంస్థలు ఇంటర్నెట్ ద్వారా కూడా పుస్తకాలు విక్రయిస్తున్నారు. వారిని కూడా సంప్రదించవచ్చు. కొంత లాభం ఉండవచ్చు. 

12.  అయితే, వీటన్నిటి కన్న ఉత్తమమైన పద్ధతి ఒకటుంది. అది పుస్తక ముద్రణకు ముందే సాహిత్యాభిమానం గల దాతలను వెదుక్కొని స్పాన్సర్ చేయించుకోవడం. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని కొంచం కష్టపడితే కొన్ని వ్యాపార సంస్థల నుండి లేదా ప్రభుత్వ సంస్థల నుండి 2,3,4 కవర్ పేజీలకు అడ్వర్టైజ్మెంట్స్ సంపాదించుకొంటే పెట్టుబడి లేకుండా (లేదా స్వల్పమైన పెట్టుబడితో) పుస్తకాలు అచ్చు వేసుకోవచ్చు.

అయితే ఈ  సూచనలన్నిటిలోకి ప్రధానమయినది నా 1వ సూచనే!

పటుత్వ రచనను ముద్రించిన ఏ రచయిత కూడా లాభం పొందినా .. పొందకపోయినా…, నష్టపోడని మాత్రం కచ్చితంగా చెప్పగలను.

 నేను పైన చెప్పిన వాటిలో అందరూ అన్ని పాయింట్లను పాటించాలని లేదు. పుస్తకం ధర కాష్ట్ ప్రైజ్కి నాలుగింతలు పెట్టుకొన్నాక, నేను చెప్పిన వాటిలో కొన్ని పాటించి, కేవలం1/4 వంతు పుస్తకాలను అమ్ముకొన్నా మన పెట్టుబడి మనకు వస్తుంది కదా! నష్టం ఉండదు. చాలదా?

ఇక లాభమంటారా? 3/4 వంతు పుస్తకాలను ఉచితంగా పంచే వెసులుబాటు .. దానికేం విలువ కడుతారు? వెయ్యి పుస్తకాలు వేస్తే, కనీసం వందలాది మంది చదివి బాగుంటే ప్రశంసిస్తారు. అది విని కలిగే ఆనందానికి ఏం విలువ కడుతారు? నా స్వీయానుభవాన్ని చెప్పుతాను… వినండి. ఎప్పుడూ వెళ్ళని ఊళ్ళకు మొదటిసారిగా వెళ్ళినప్పుడు ముఖపరిచయం లేనివాళ్ళు కూడా ఆదరంగా వచ్చి కలిసి “మీరేనా ఆచార్య ఫణీంద్ర? మీ పుస్తకాలు మేం చదివామండి” అంటూ అందులోని విషయాలను ఉటంకిస్తుంటే … కవిగా నా జన్మ సార్థకం అయిందనిపిస్తుంది. ఆ మధురానుభూతికి ఏం విలువ కడుతారు? డబ్బేనా? ఇవన్నీ లాభాలు కావా?  

  – డా. ఆచార్య ఫణీంద్ర

                                 — &&& —       

       

 

       

ఈ నెల ‘మూసీ’ మాసపత్రికలో…

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును పురస్కరించుకొని నేను రచించిన “తెలంగాణ మహోదయం” పద్యకవిత ఈ నెల ‘మూసీ’ మాసపత్రికలో ప్రచురితమయింది. ఆ ముద్రత కవిత ఇదిగొ.. ఇక్కడ… మీ కోసం…..

– డా. ఆచార్య ఫణీంద్ర

y6

y5

“ఏక పద్య రామాయణం”

shree-ram

“ఏక శ్లోకి రామాయణం” గురించి విన్నాం. ఇది నేను రచించిన “ఏక పద్య రామాయణం”. ఈ “శ్రీ రామ నవమి” పర్వదిన సందర్భంగా అందిస్తున్న నా ఈ పద్యాన్ని చదివిన వారికి, విన్న వారికి, పారాయణం చేసిన వారికి – లోకాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుడు అన్ని ఆపదలను తొలగించి, సకలైశ్వర్య సంప్రాప్తిగా దీవించు గాక! 

అందరికీ “శ్రీ రామ నవమి” పర్వదిన శుభాకాంక్షలతో – 

– డా.ఆచార్య ఫణీంద్ర

“యాగ ఫలంబుగా జననమంది, మహాస్త్ర కళా విదుండునై,
యాగము గావగా జని, శివాంకిత చాపము ద్రుంచి, జానకిన్
తా గొని పత్నిగా, పిదప – తండ్రి వచః పరిపాలనన్ వనం
బేగి, దశాననున్ దునిమి, ఏలికయౌ రఘురాము మ్రొక్కెదన్!”

Previous Older Entries