సీతా హృదయం – 2

సీతా హృదయం (గేయ కావ్యం)
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
picture
                                        2
ముగ్ధ మోహన రూపుడే!
ముద్దు గొలుపుచుండెనే!
మునివర్యుడు ముందు నడువ
అనుజుడు తన ననుసరింప
ముందుకేగుచుండెనే –
మోమిటు మరి త్రిప్పడే!                      //ముగ్ధ మోహన//
అందమైన మోముతో
మందహాస మొలికెనే –
చందన పరిమళముల తన
మేనిని వెదజల్లెనే –                             //ముగ్ధ మోహన//
విల్లంబులు చేత బూని
వీరత్వము చాటెనే –
అల్లన దూరాన నన్ను
ఓర కంట మీటెనే!                               //ముగ్ధ మోహన//
నీల మేఘ ఛాయతో
నిగనిగ లాడెనులే –
ఆజానుబాహుడై
వడివడిగా నడిచెనే –                           //ముగ్ధ మోహన//
కనులు మూసి తెరచినంత
మనసు దోచి సాగెనే –
కనుమరుగై పోక ముందె
తన నెవరైనా ఆపరే –                            //ముగ్ధ మోహన//
               — @@@ —

“సీతా హృదయం”

ఎనిమిదేళ్ళ క్రితం నేను రచించిన గేయ కావ్యం – “సీతా హృదయం”. అందరూ వ్రాసిన పద్ధతిలో కాకుండా, కొత్త పద్ధతిలో రామాయణం రచించాలన్న తపనలో పుట్టిన కృతి ఇది‌. ” సీతాయాశ్చరితం మహత్” అన్నాడు స్వయంగా వాల్మీకి – రామాయణం గురించి. అవును .. సీత కథే కదా రామాయణం!
రామాయణం లోని వరుస ఘట్టాలలో సీతా హృదయ స్పందనను ఆమె ముఖతః గీతాల రూపంలో వినిపించే ప్రయత్నం ఇది.
మొత్తం 27 గీతాల రూపంలో వెలసిన రామాయణం ఇది. ఒక్కొక్కటి వరుసగా అందిస్తాను. ఆస్వాదించి నన్ను ఆశీర్వదించండి. (ఈ గీతాలన్నిటికీ నా పరిధిలో నేను బాణీలను కూడ కట్టుకొన్నాను. కాని ప్రస్తుతానికి వ్రాత పూర్వకంగానే స్వీకరించండి.)
– డా. ఆచార్య ఫణీంద్ర

—————————————-

సీతా హృదయం (గేయ కావ్యం)

రచన : డా. ఆచార్య ఫణీంద్ర


సీతా హృదయం -1

img_20161217_052629

 

 

 

 

 

కూడుదమా అందర మీ వని –

ఆడుదమా కందుక కేళిని –

వేడుదమా అరవింద నేత్రుని –

పాడుదమా గోవిందు కీర్తిని –   || కూడుదమా ||

 

చెల్లీ ఊర్మిళ! చెండు నందుకో!

తల్లీ మాండవి! దాని పట్టుకో!

శ్రుత కీర్తీ! నీ చిన్ని చేతుల

ఇదిగో .. బం తిటువైపు విసరవే!      ||కూడుదుమా||

 

అదిగో బంతి – అద్దరి సాగెను –

అరెరే! దాని క్రిందికి చేరెను –

ఏమిటదే? శివ ధనువా?

ఆగుడు – దానిని ప్రక్కకు జరిపెద – ||కూడుదుమా||

 

జనని భూమికి పుట్టలేదొకొ?

జనక భూపతి పట్టి గానొకొ?

విల్లును జరుప ఒంటి చేతితో –

విస్మయమెందుకొ అంతగ మీకు?  ||కూడుదమా||

img_20161215_232128


 

“నవ్య సాహితీ పురస్కార” ప్రదాన సభా విశేషాలు

నాకు 13/12/2016 నాడు సాయంత్రం హైదరాబాద్ “త్యాగరాయ గానసభ” మెయిన్ హాల్లో “నవ్య సాహితీ సమితి” సంస్థ వారిచే “నవ్య సాహితీ పురస్కారం” ప్రదానం చేయబడింది. ప్రముఖ అంతర్జాల రచయిత్రి, ప్రచురణ కర్త – శ్రీమతి జ్యోతి వలబోజు గారికి; ప్రముఖ వైజ్ఞానికులు, పద్యకవి ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారికి కూడ ఈ “నవ్య సాహితీ పురస్కారం” ప్రదానం చేయబడింది.

బీహార్ హైకోర్ట్ పూర్వ ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ యల్. నరసింహారెడ్డి, ఊస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ ఆఫ్ ఆర్ట్స్ – ఆచార్య యస్.వి. రామారావు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి “అన్నమాచార్య ప్రాజెక్ట్” వ్యవస్థాపకులు – శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు, తదితర మహామహులు పాల్గొన్న ఈ సభలో  సుప్రసిద్ధ సాహితీమూర్తి డా.అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) గారికి ఈ సభలో “వేమరాజు నరసింహారావు స్మారక పురస్కార” ప్రదానం చేయబడింది.

వివిధ పత్రికలలో ప్రచురితమైన ఆ సభా విశేషాలు ఇలా ఉన్నాయి.

– డా. ఆచార్య ఫణీంద్ర

navya-sahithi-award

 

 

 

 

 

 

 

 

 

en141216

 

 

 

 

 

 

 

 

 

sk141216

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

sr141216

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ab141216

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

aj141216

నాకు “నవ్య సాహితీ పురస్కారం”

13 వ తేదీ నాడు నాకు త్యాగరాయ గానసభలో “నవ్య సాహితీ పురస్కారం” ప్రదానం చేయబడుతుంది. సోదరి – ప్రముఖ రచయిత్రి, ప్రచురణ కర్త – శ్రీమతి జ్యోతి వలబోజు గారికి; ప్రముఖ వైజ్ఞానికులు, పద్యకవి ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారికి కూడ ఈ “నవ్య సాహితీ పురస్కారం” ప్రదానం చేయబడుతుంది. సుప్రసిద్ధ సాహితీమూర్తి డా.అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) గారికి ఈ సభలో “వేమరాజు నరసింహారావు స్మారక పురస్కార” ప్రదానం చేయబడుతుంది. సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.

– డా. ఆచార్య ఫణీంద్ర

img_20161210_071356