అందమైన తెలుగు తోటలో …

అందమైన తెలుగు తోటలో … (లలిత గీతం)

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అందమైన తెలుగు తోటలో

అక్షరాలు పూలు! భావాలు పరిమళాలు!!

కవులు కూర్చు కావ్యాలు –

మదిని దోచు పూమాలలు!

మదిని దోచు పూమాలలు!!                     ||అందమైన||

 

నన్నయ, పాల్కుర్కి, తిక్కన, ఎర్రన,

పోతన, శ్రీనాథ, పెద్దన, సూరన,

పొనగంటి తెలగన, కొరవి గోపన,

రామకృష్ణ, చేమకూర – తోటమాలు లెందరో!   ||అందమైన||

 

విహరించగ నీ తోటలో .. విందు జామ, సపోటలు –

అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు పాటలు!

గురజాడ, కందుకూరి, సురవరం, రాయప్రోలు

క్రొత్త నాట్లు వేసిరి! క్రొత్త చెట్లు పెంచిరి!!          ||అందమైన||

 

చెళ్ళపిళ్ళ, విశ్వనాథ, కృష్ణ శాస్త్రి, వానమామలై,

శ్రీశ్రీ, దాశరథి, సినారె, కాళోజీ

పులకలు రేపిరి! మొలకలు నాటిరి!!

నెలకొనె నీ తోటలో  నిత్య వసంతమే!!          ||అందమైన||

 

 

ఈ రోజే!

సాహిత్యాభిమానులందరూ ఈనాటి యువభారతి సమావేశానికి తప్పక విచ్చేసి జయప్రదం చేయగలరు.

– డా. ఆచార్య ఫణీంద్ర

అధ్యక్షులు, “యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ,
హైదరాబాద్.

ఆహ్వానం

జంట నగరాల సాహిత్యాభిమానులందరికీ ఇదే మా సాదరాహ్వానం.

– డా. ఆచార్య ఫణీంద్ర

అధ్యక్షులు, “యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ,
హైదరాబాద్.