ప్రపంచ తెలుగు మహాసభలు -2017 లో …

ప్రపంచ తెలుగు మహాసభలలో నేను
పద్య కవిసమ్మేళనం సభాధ్యక్షునిగా ప్రసంగం చేస్తూ ..
ఆ పైన పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోద్ గారిచే సత్కారం పొందుతూ …

– డా. ఆచార్య ఫణీంద్ర

మేరీ .. యేసు .. సిలువ .. చర్చ్ ..

దత్తపది

మేరీ .. యేసు .. సిలువ .. చర్చ్ .. పదాలను ఉపయోగించి శ్రీ కృష్ణ స్తుతి కంద పద్యంలో –

తామే రీతిని గొలిచిన

భూమిని గల యే సుభక్త పుంగవులైనన్

క్షేమముగ భాసిలు వరము

స్వామి ముకుందు డిడు; నేల చర్చింపంగన్?

పూరణ : డా. ఆచార్య ఫణీంద్ర

(క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో …)

“నమస్తే తెలంగాణ” దినపత్రిక మెయిన్ పేపర్లో …

“నమస్తే తెలంగాణ” దినపత్రిక మెయిన్ పేపర్లో ఈ రోజు … “తెలంగాణ – తెలుగు భాష” అన్న నా వ్యాసం ప్రచురించబడింది. సాహిత్యాభిమానుల కోసం ఆ వ్యాసం లింక్ ఈ క్రింద ఇస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

http://webpcache.epapr.in/index.php?in=http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/1471369/0312f636-a78d-44ae-84ab-7d06751dc9f2

“ప్రపంచ తెలుగు మహా సభలు – 2017″లో …

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రపంచ తెలుగు మహా సభలు – 2017″లో భాగంగా 16 డిసంబర్ 2017 నాడు “రవీంద్ర భారతి”లో ఏర్పాటు చేయబడిన “పద్య కవి సమ్మేళనం”లో రెండవ సమావేశానికి సభాధ్యక్షత వహించవలసిందిగా నన్ను ఆహ్వానించారు. ఆ కరపత్ర వివరాలు మీ కోసం …

– డా. ఆచార్య ఫణీంద్ర