డా.ఆచార్య ఫణీంద్రకు ఉగాది పురస్కారం

picture3
అటు పద్యకవిగా రాణిస్తూ – ఇటు వచన, గేయ కవితలలో ప్రయోగాలతో అలరిస్తూ – ప్రముఖ కవిగా గుర్తింపు పొందడమే కాకుండా, “ఇన్నాళ్ళూ ’క్షీణ యుగం’గా పిలువబడుతున్న పందొమ్మిదవ శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఎంతో నవ్యత ఉందని, ఇరవయవ శతాబ్ది నవ్య కవిత్వపు బీజాలు పందొమ్మిదవ శతాబ్దిలోనే పడ్డాయి” అని తన సిద్ధాంత గ్రంథం ద్వారా నిరూపించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ’పి.హెచ్.డి’ పట్టా సాధించిన డా.ఆచార్య ఫణీంద్ర కృషికి గుర్తింపుగా ’విరోధి’ నామ సంవత్సరాది సందర్భంగా ’మానస ఆర్ట్ థియేటర్స్’, హైదరాబాదు వారు ఆయనను ’ఉగాది పురస్కారం’తో సత్కరించారు. ఆదివారం (29 – 03 – 2009) నాడు హైదరాబాదు (చిక్కడపల్లి)లోని నగర కేంద్ర గ్రంథాలయంలో ప్రముఖ చలన చిత్ర దర్శకులు శ్రీ గోపాలకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, సారస్వత మూర్తి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఫణీంద్రను సత్కరించారు. ఆచార్య ఫణీంద్రతో బాటు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ ’రఘుశ్రీ’ గారు – ప్రముఖ కథకులు శ్రీ ’అంబళ్ళ జనార్దన్’ (ముంబాయి) గారిని, ప్రముఖ రచయిత్రి శ్రీమతి ’జ్వలిత’ (ఖమ్మం) గారిని ’ఉగాది పురస్కారాలతో సత్కరించారు.
( ఫోటో ’ఈనాడు’ దిన పత్రిక సౌజన్యంతో… )

15 వ్యాఖ్యలు (+add yours?)

  1. padmarpita
    మార్చి 30, 2009 @ 23:14:17

    Congratulations Sir….

    స్పందించండి

  2. Satyanarayana
    మార్చి 30, 2009 @ 23:19:38

    ఆచార్య గారు,
    అభినందనలు.

    స్పందించండి

  3. సురేష్
    మార్చి 30, 2009 @ 23:57:09

    ఆచార్య ఫణీంద్ర గారు,

    మీకు నా హృదయపూర్వక అభినందనలు

    స్పందించండి

  4. Malakpet Rowdy
    మార్చి 31, 2009 @ 00:11:55

    Congratulations!

    స్పందించండి

  5. Madhuravani
    మార్చి 31, 2009 @ 00:34:12

    ఫణీంద్ర గారూ..
    అభినందనలు.!

    స్పందించండి

  6. కొత్తపాళీ
    మార్చి 31, 2009 @ 03:12:45

    అభినందనలు

    స్పందించండి

  7. Bhaskara Rami Reddy
    మార్చి 31, 2009 @ 05:10:21

    ఆచార్యుల వారికి పురస్కారం సందర్భంగా అభినందనలు.

    స్పందించండి

  8. జ్యోతి
    మార్చి 31, 2009 @ 06:13:10

    అభినందనలు ఆచార్యగారు..

    స్పందించండి

  9. సూర్యుడు
    మార్చి 31, 2009 @ 09:44:37

    Congratulations!!

    స్పందించండి

  10. chinta rama krishna rao
    మార్చి 31, 2009 @ 09:53:05

    ఫణీంద్రా శుభాభినందనలు.

    స్పందించండి

  11. Dr.Acharya Phaneendra
    మార్చి 31, 2009 @ 15:50:58

    ఆత్మీయ ’అంతర్జాల’ స్నేహితులు –
    పద్మార్పిత గారికి,
    సత్యనారాయణ గారికి,
    సురేశ్ గారికి,
    మలకపేట రౌడీ గారికి,
    మధుర వాణి గారికి,
    కొత్తపాళీ గారికి,
    భాస్కర రామిరెడ్డి గారికి,
    జ్యోతి గారికి,
    సూర్యుడు గారికి,
    చింతా రామకృష్ణారావు గారికి –
    మీ అపారమయిన ప్రేమాభిమానాలకు
    నా హృదయ పూర్వక ధన్యవాదాలను
    సమర్పించుకొంటున్నాను.
    – డా.ఆచార్య ఫణీంద్ర

    స్పందించండి

  12. mallina rao
    ఏప్రి 01, 2009 @ 06:32:33

    ఫణీంద్రగారూ
    హృదయపూర్వక అభినందనలు.

    స్పందించండి

  13. Dr.Acharya Phaneendra
    ఏప్రి 01, 2009 @ 17:24:18

    ’మల్లిన’ గారికి ధన్యవాదాలు
    – డా.ఆచార్య ఫణీంద్ర

    స్పందించండి

  14. Trackback: పొద్దు » Blog Archive » 2009 మార్చి బ్లాగువీక్షణం
  15. Dr.Acharya Phaneendra
    ఏప్రి 01, 2009 @ 23:43:45

    ’పొద్దు’ వారికి కృతజ్ఞతలు
    – డా.ఆచార్య ఫణీంద్ర

    స్పందించండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.