భాగ్యనగరం బ్లాగు మిత్రులకు ఇదే నా ఆహ్వానం

భాగ్యనగరం బ్లాగు మిత్రులకు ఇదే నా ఆహ్వానం

14వ శతాబ్దికి చెందిన ఆలంకారికుడు ’ విశ్వనాథుడు ’ ప్రతిపాదించిన ” వాక్యం రసాత్మకం కావ్యం ” అన్న సూత్ర స్ఫూర్తితో ’ వాక్యం రసాత్మకం ’ పేరిట నేను తొలిసారి కొత్త ప్రయోగంగా, ’ ఏక వాక్య కవితల ’ సంపుటిని రచించినట్లు లోగడ తెలియజేసాను.   ( అందులోని కొన్ని ఏక వాక్య కవితలను ఈ బ్లాగులో ధారావాహికంగా ప్రచురించడం కూడా జరిగింది. అప్పుడు కొన్ని వాదోపవాదాలు కూడా జరిగాయని కూడా మీకు గుర్తుండి ఉంటుంది. ) అయితే అది అంతకు ముందే ఒక గ్రంథంగా 2004వ సంవత్సరంలో ప్రచురింపబడి పలువురి మన్ననలనందుకొంది. పలు తెలుగు, ఆంగ్ల పత్రికలలో దానిపై మంచి సమీక్షలు కూడా వచ్చాయి.


Image0669

ఇప్పుడా ఏక వాక్య కవితల సంపుటి ఆంగ్లంలోకి అనువదించబడింది. Former Registrar, Central Institute of English & Foreign languages ( ఇప్పుడు దీనిని The English and Foreign languages University గా మార్చారు. ) మరియు ’ త్రివేణి ’ ఆంగ్ల పత్రికా సంపాదకులు ఆచార్య ఐ.వి.చలపతిరావు;  ఇంకా, Former Director of Translations, Govt. of A.P. శ్రీ గోవిందరాజుల రామకృష్ణారావు కలసి సంయుక్తంగా దానిని ఆంగ్లంలోకి అనువదించారు . ఆ గ్రంథం ఆవిష్కరణ సభ ఈ నెల 13వ తేది సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో నారాయణగూడలోని YMCA హాలులో నిర్వహించబడుతుంది.

Image0670

ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి అధ్యక్షత వహించే ఈ సభలో ’ అణు ఇంధన సంస్థ ’ జనరల్ మానేజర్ శ్రీ పి.కె. బెనర్జీ ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆ గ్రంథాన్ని ప్రముఖ రచయిత, వివిధ సాహితీ సాంస్కృతిక సంస్థల సారథి కీ.శే. వేమరాజు నరసింహారావుకు అంకితం చేయబడుతుంది. డా. ఐ. సత్యశ్రీ ;  శ్రీమతి. యు.వి.ఎల్. ఆనంద గ్రంథ పరిచయం చేస్తారు.

Image0674

నా బ్లాగు మిత్రులు, ఇతర మిత్రులు, సాహితీ ప్రియులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ సభకు విచ్చేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

– డా.ఆచార్య ఫణీంద్ర

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. Sarath 'Kaalam'
    ఆగ 11, 2009 @ 23:43:03

    సంతోషం. నేను హైదరాబాదులో వున్నట్లయితే తప్పక వచ్చేవాడిని.

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    ఆగ 12, 2009 @ 06:25:16

    శరత్ గారు !
    కృతజ్ఞతలు !

    స్పందించండి

Leave a reply to Dr.Acharya Phaneendra స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.