“మైత్రి” అంతర్జాల మాస పత్రికలో…

 ఈ నెల “మైత్రి” అంతర్జాల మాస పత్రికలో “అట్లాంటా”(అమెరికా)లో నేను పాల్గొన్న సాహిత్య సభా వివరాలను అందించారు. అవలోకించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర

 http://www.atlantadesi.com/maitri/home.html

ph16                           ph13

‘చేరా’ గారి పీఠిక

మొన్న దివంగతులైన “చేకూరి రామారావు”(చేరా)గారు తెలుగు సాహిత్యరంగంలోని కొద్ది మంది గొప్ప విమర్శకులలో ఒకరు. వారి మృతి తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. ఆయన నా పద్యాన్ని చాల ప్రేమించేవారు. ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ … ఈ సందర్భంగా నా “మాస్కో స్మృతులు” గ్రంథానికి ఆ విమర్శక వరేణ్యులు వ్రాసిన ముందు మాటను, దానికి ఆ గ్రంథంలోనే నేను తెలిపిన కృతజ్ఞతా వాక్యాలతో కూడిన సమాధానాన్ని కూడా ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఆస్వాదించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర

chera1

chera2

 

cera3

chera4

 

??????????

 

chera5

 

 

“నాటా సాహిత్య వేదిక” పై నా కవితా గానం

అమెరికా(అట్లాంటా)లో “నాటా సాహిత్య వేదిక” పై నా కవితా గానాన్ని ఆస్వాదించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర

https://www.youtube.com/watch?v=CibON9ZNXvU&list=PLzZlXk4j_y0uqI2AkgUdnAWI56ItipUj1

 

ph16

‘అట్లాంటా’లో ‘నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA)’ సభలు విజయవంతం!

అష్టావధానంపు మృష్టాన్న భోజన
మందించినట్టి మహావధాని,
సంగీత సాగర సంగమ ఝరులట్లు
పద్యాల పాడు నవావధాని,
సినిమాల పాటల చిత్రమౌ పాట్లను
వివరించిన సినీ కవీశ్వరులను,
స్వీయ రచనలందు శేముషీ విభవమ్ము
తెలిపిన సాహితీ ధీమణులను,
నృత్య గానాది విషయా లనేకములను
కనుల విందొనర్చిన కళాకార తతిని -
ఒక్కచో నిల్పి అతి వైభవోన్నతముగ
సభల జరిపిన ‘నాటా’ కు జయము! జయము!!

ఇంతటి మహా సభల, నా
వంతు సుసాహిత్య పాటవము జూపగ,న
న్నెంతొ దయ బిలిచె ‘నాటా’!
సంతత మిక ధన్యవాద శతముల నిడెదన్!

- డా. ఆచార్య ఫణీంద్ర

ph

ph19ph2ph3ph5ph6ph7ph8ph9ph10ph11ph12ph13ph14ph15ph16ph17ph18ph4ph0

NATA వారి ఆహ్వానం!

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA) వారు 4 జూలై 2014 నుండి 6 జూలై 2014 వరకు ‘అట్లాంటా’లో నిర్వహించనున్న తెలుగు మహాసభలలో పాల్గొనవలసిందిగా నాకు ఆహ్వానం అందింది. జూన్ 30న  అమెరికాకు ప్రయాణమవుతున్నాను.

ఆహ్వానితుల వివరాలను ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి చూడవచ్చు.

http://www.nata2014.com/invitees.php

- డా. ఆచార్య ఫణీంద్ర

“నమో భరతమాత” – కవిసమ్మేళనం

9 జూన్ 2014 నాడు హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో “నమో భరతమాత” – కవిసమ్మేళనం జరిగింది.

ప్రముఖ కవి “సుధామ” గారి అధ్యక్షతన జరిగిన ఆ కవిసమ్మేళనంలో “డా. జె. బాపురెడ్డి”, “డా. ఉండేల మాలకొండారెడ్డి”, “డా. ముదిగొండ శివప్రసాద్”, “డా. సి.భవానీ దేవి”, “డా. వెనిగళ్ళ రాంబాబు” మొదలైన వారితోబాటు నేను పాల్గొన్నాను.

- డా. ఆచార్య ఫణీంద్ర

nt100614

ఆనాడు నేను వినిపించిన నా పద్య కవిత -

శక్తివంత భారతం

రచన: “కవి దిగ్గజ” డా. ఆచార్య ఫణీంద్ర

తలపై హిమాద్రి మకుటము;
గళమున హారములు పుణ్య గంగా, యమునల్;
జలధి త్రయ సంధి స్థలి
పలు వన్నెల పాదపీఠి – భారతి నీకౌ!

క్రొత్త దనము నిండె – క్రొంగొత్త కాషాయ
వర్ణశోభిత మయె భరతభూమి!
కడచి పోయిన కడగండ్లు – గతము గతః
స్వర్ణ యుగము లింక వరలు గాక!

నాడొక “నరేంద్రు” డుదయించి, నాటి విశ్వ
వేదిపై భారతీయ తాత్త్వికత చాటె!
నేడొక “నరేంద్రు” డుదయించె – నిలుపు గాక
భరత దేశమ్ము నుత్తుంగ పదము పైన!!

ఇరువ దెనిమిది రాష్ట్రాల కింక తోడు
కంటివి నవ శిశువు, “తెలంగాణ” పేర -
పచ్చి బాలెంతరాల! మా భరత మాత!
ప్రీతి లాలించి, పాలించి పెంచుమమ్మ!

అన్ని రాష్ట్రము లిక అభివృద్ధి పథములన్
తురగ వేగ గతిని పరుగు లిడుత!
అచిర కాల మందె అవనిపై భరతాంబ
అమిత శక్తివంత దేశ మగును గాక!

— &&&—

తెలుగు భాషానుబంధమ్ము

తెలుగు భాషానుబంధమ్ము

రచన : ‘కవి దిగ్గజ’ డా. ఆచార్య ఫణీంద్ర

andhra-telangana

ఆంధ్ర, తెలగాణ వేర్వడె, నైన నేమి?
తెలుగు భాషానుబంధమ్ము తెగునటయ్య?
నిండు జామకాయను కోసి, రెండు జేయ -
రూపు మారినన్, మారునా రుచియు, రంగు?

పులుగుకు రెండు రెక్క, లవి పూని ప్రపంచము చుట్టి వచ్చెడిన్ -
వెలుగుకు రెండు దిక్కు, లవి వెల్లడి జేయు ప్రదేశ మెల్లడన్ -
జలధికి రెండు నొడ్డు, లవి శాశ్వత లబ్ధి ప్రజాళి కిచ్చెడిన్ -
తెలుగుకు రెండు రాష్ట్రములు … దివ్యముగా అభివృద్ధి చెందెడిన్!

Previous Older Entries

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 33గురు చందాదార్లతో చేరండి