అమెరికా నుండి 12 జూన్ 2022 నాడు వచ్చాక .. జూలై మాసాంతం వరకు వివిధ సాహిత్య కార్యక్రమాలతో బిజీబిజీగా గడచి కాలం చాల ఆనందంగా సాగింది.
ముందుగా జూన్ 25 నాటి సాయంత్రమ్ తి.తి.దే. అన్నమాచార్య ప్రాజెక్ట్ వ్యవస్థాపక సంచాలకులు –
స్వర్గీయ కామిశెట్టి శ్రీనివాసులు గారి జయంతి ఉత్సవ సభలో ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించాను.


27 జూన్ నాడు మా గురువు గారు స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాల పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని విలేకరులకు వివరాలను వివరించడం జరిగింది.

జూన్ 28, 29, 30 తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన చి. గన్నవరం లలితాదిత్య శతావధానంలో “నిషిద్ధాక్షరి” అంశంలో పృచ్ఛకునిగా వ్యవహరించాను.



అట్లా జూన్ చివరి వారమంతా బిజీగా ఆనందంగా సాగింది. ఇక జూలై మాసం మరింత బిజీగా మహానందంగా సాగింది. ఆ వివరాలను తరువాతి పోస్టులలో తెలియజేస్తాను.