విశ్వాసము
“”””””””””””””””’
రచన : డా. ఆచార్య ఫణీంద్ర~~~~~~~~~~~~~~~~~
ఉద్యోగ మాశించి ఉద్యమించిన వాని
గుండెలో బుల్లెట్టు గ్రుచ్చు వాడు
ఉద్యోగియే! అది ఉద్యోగ ధర్మమే!
ఉద్యోగమే మధ్య నున్న గీత!
ఒకడు గీత కిటువై పుండె – నా గీత కిం
కొక్కండు నటువైపు నుండె గాదె!
ఎవరు చేసిన తప్పు? ఎవరి కాయెను ముప్పు?
తుదకు ప్రాణ మొకటి తొలగె భువిని!

అమలు చేయు ముందు నా నిర్ణయము గూర్చి
విషయ వివరణమ్ము వెళ్ళబుచ్చి
విధిగ, దేశ జనుల విశ్వాసమును పొందు
పద్ధ తెరుగనట్టి ప్రభుత వచ్చె!
మొదట “నోట్ల రద్దు”; పిదప “రైతుల చట్ట”;
మటులె యిపుడు యువత “కగ్ని పథము”!
ప్రజలలో అశాంతి ప్రజ్వరిల్లగ జేసె!
తప్పు మీద తప్పు … తప్పు గాదె? #