వరదా! ఉపసంహరించు వరదల నింకన్!

రచన : ‘పద్య కళాప్రవీణ ‘, ‘కవి దిగ్గజ ‘

డా. ఆచార్య ఫణీంద్ర

కరుణను జనులందరిపై
కురిపించుమటంచు కోరుకొందురు భక్తుల్!
కురిపింతు వేల వానలు,
బరి తెగి ప్రవహించి నీరు వరదలు గట్టన్?

తిరుపతిలో వరదలతో
చెరువులు, వంతెనలు తెగెను; చీకటి గ్రమ్మెన్!
ఉరుకులు పరుగులతో చిం
దరవందరయె జన జీవితంబులు నకటా!

తిరుమల వేంకట రమణా!
వరదా! ఉపసంహరించు వరదల నింకన్!
కరుణించు పురజనుల; నీ
దరిసెనమున కరుగుదెంచు ధర్మాత్ములనున్! #

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: