“బీ నెగెటివ్” (పద్య కవిత)

“బీ నెగెటివ్” (పద్య కవిత)

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

పరిసరాలెంతగా పరిశుభ్రమైనను –

       “మాస్కు” ధరించుట మానలేము!

వీధులు ఖాళిగా వెలవెలబోయినన్ – 

       వీధికెక్కి ఎటకు వెళ్ళలేము!

సమయ మెంతగ వీలు చాలియున్నను గాని – 

       కలిసి ఎవరితోడ గడుపలేము!

చేతులు శుభ్రము చేసుకొందురు గాని – 

       చేయలే మెవరితో  “షేకు హ్యాండు”!


కలిగియున్నవారు ఖర్చు చేయగలేరు!

లేనివారికి పనులే దొరకవు!

వింత స్థితిని దెచ్చె విధి నేడు ప్రజలకు!

“కోవి డ”ణచి వేసె కోర్కె లన్ని!!


“పాజిటివు” గ నుండుమనుచు పాఠములను

 చదువుకొని పాటించెడి జనుల కిపుడుటెస్టు –

“పాజిటి”వైనచో డిల్లపడుచు

దీనముగ జూచునట్టి దుర్దినములాయె!


ఇంతకు మునుపున్న అలవా ట్లేవియైన

మరచి పోవలె; నన్నిటిన్ మానవలయు!

“బీ నెగెటి”వనుకొని, ఎటు వెళ్ళకుండ –

ఇంటిపట్టు నుండుటయే మరింక శుభము! #

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: