‘కవి సమ్మేళనం’లో నా కవితా గానం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేటులో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3/4/2021 నాడు
“భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు”
(75 వసంతాలు – “వజ్రోత్సవాలు” అని కూడ అనవచ్చు) సందర్భంగా నిర్వహించిన ‘కవి సమ్మేళనం’లో
నేను కవితా గానం చేసి సత్కారం పొందాను.

నేను ఆలపించిన కవిత :
వజ్రోత్సవ వైభవం

రచన : "పద్య కళాప్రవీణ", "కవి దిగ్గజ" డా. ఆచార్య ఫణీంద్ర

~~~~
దాస్య శృంఖలముల దౌర్భాగ్యమును త్రుంచ
వీరయోధులెంతొ పోరి, పోరి,
స్వపరిపాలనమ్ము సాధించి నేటికి
పంచ సప్తతి బహు వర్షములయె!

“స్వాతంత్ర్యమే మన జన్మ హక్క”ని చాటె
లోకమాన్య తిలకు భీకరముగ
విప్లవ సింహాలు వ్రేలాడె ఉరికొయ్య,
భగతు సింగును, తుర్రెబాజు ఖాను!
సైన్యమ్మునే కూర్చి “జై హింద్” నినాదాల
జ్వాలయయ్యెను సుభాష్ చంద్రబోసు!
శాంతి మార్గమ్ములో సత్యాగ్రహమ్ముతో
జన వాహిని నడుపజాలె గాంధి!

ఉక్కు మనిషి పటేలు; నెహ్రు మొదలైన
ధర్మ సంగ్రామ వీరుల త్యాగ ఫలము –
దేశమందు స్వారాజ్యపు దివ్వె వెలిగె!
దినదినము వర్ధిలి వెల్గె దేశ దీప్తి!

అణుశక్తి రంగాన స్వావలంబన పొంది –
భారతీయుల యశో ప్రభలు చాటె!
అంతరిక్ష ప్రయో గాద్భుత విజయాలు
భారతీయుల యశో ప్రభలు చాటె!
అగ్ని, పృథ్వి మొదలు ఆకాశ్ క్షిపణులెన్నొ
భారతీయుల యశో ప్రభలు చాటె!
బహుళ సాంకేతిక భవ్య పరిశ్రమల్
భారతీయుల యశో ప్రభలు చాటె!

శాస్త్ర, విజ్ఞాన, వ్యవసాయ సాధికారి
కాభివృద్ధి, కంప్యుటరు విజ్ఞాన ప్రగతి,
పరిణతి గల మానవుల వనరుల తోడ
భారతావని ఘన యశో ప్రభలు చాటె!

భారతీయు డమిత భవ్య చరిత్రుడు –
కృష్ణుడై పలికెను గీత నితడు!
బోధ చేసె నితడు బుద్ధుడై బౌద్ధమున్!
కాళిదా సితండె! గాంధి ఇతడె!

భారతీయుల కిదె ‘వజ్రోత్స’వాభినం
దనలు! వేల యేండ్లు – ధరణి కెల్ల
దారి చూపినట్టి ధార్మిక సంపద
వీరి సొత్తు! ఎవరు వీరి ఎత్తు? #

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

<span>%d</span> bloggers like this: