ఈ పల్లెటూరు …

ఈ పల్లెటూరు … (గీతం)

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

ఈ చేలు .. ఈ పైరు …
ఈ గాలి .. ఈ నీరు …
ఈ పల్లెటూరు …
కనులకే విందు ..
మనసుకే పసందు ..
విడలేములే! ||ఈ చేలు||

పనులన్ని తీర్చి, పల్లెనే తలచి,
ప్రాణాలు ఎగసి, పరుగులే తీసి,
విహారమ్ముగా .. విలాసమ్ముగా …
చేరేము మురిసి! ||ఈ చేలు||

ఏడాది కొకసారి వచ్చేను తలపు –
చూడాలనిపించు చిననాటి నెలవు –
గడిపేమొ లేదొ .. ఒక వారం అయినా ..
కడచేను సెలవు! ||ఈ చేలు||

పట్నాలలోన పనిచేయు ప్రగతి –
పట్టించెనేమొ మనకీ దుర్గతి!
మనసొకటి కోరు .. బ్రతుకొకలా మారు ..
ఇదేరా జగతి! ||ఈ చేలు||

ఈ చేలు .. ఈ పైరు …
ఈ గాలి .. ఈ నీరు …
ఈ పల్లెటూరు …
కనులకే విందు ..
మనసుకే పసందు ..
విడిపోదుమే!
విడలేక .. విడలేక ..
విడిపోదుమే!!

(పాత హిందీ సినిమా పాట – “యే రాతే .. యే మౌసం .. నదీకే కినారే .. యే చంచల్ హవా .. ” ట్యూన్ లో -}

— ### —

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: