‘వాజపేయం’

అతని హృదయమంతా
దేశాభివృద్ధి రాగం –
అతని శరీరం నిండా
దేశభక్తి భావనల యోగం –
అతని జీవితం –
నీతి, నిజాయితీల సంభోగం –
అతని వ్రతం
నిర్మల రాజకీయ యాగం –
ఆ యాగం పేరే ‘వాజపేయం’!
అందిస్తుంది స్ఫూర్తి ఆ యశఃకాయం!!

(భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపాయ్ గారికి అశ్రు నివాళిగా …)

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు