“తాజ్ మహల్” (లలిత గీతం)

ఈ మధ్య తాజ్ మహల్ విషయంలో అనవసరమైన వివాదాలు రేగుతున్న నేపథ్యంలో … గతంలో నేను తాజ్ మహల్ ను సందర్శించినపుడు వ్రాసుకొన్న లలిత గీతాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఆస్వాదించండి.

  • “తాజ్ మహల్” (లలిత గీతం)
    ——————————–
    రచన: డా. ఆచార్య ఫణీంద్ర

నీలాకాశంలో
నిండు పున్నమి వెన్నెల
నేలపై జారి
అయ్యింది “తాజ్ మహల్”
పాల సంద్రంలో
జున్ను పాలు, మీగడ
నేలపై పొంగి
అయ్యింది “తాజ్ మహల్”

ఇది ప్రేమకు సంకేతం –
ఒక ప్రేమికుని హృదయం –
అనురాగ దేవాలయం –
ఒక అద్భుత సౌందర్యం –
||నీలాకాశంలో||

పాల రాయిలో పాల మనసును
పొదుగుకొన్న అందం –
కాల వాహిని కదలి పోయినా
చెదరిపోని బంధం –
కనుమరుగైన ప్రేయసి కోసం
కాగిన విరహపు సింధువు –
కన్నుల పొంగి, కరుడు గట్టిన
కరుగని కన్నీటి బిందువు –
||నీలాకాశంలో||

ప్రేమ పక్షులు ఎగిరెగిరొచ్చి
వాలే పాలవెల్లి –
ప్రేమ పరిమళం నాల్గు దిక్కులా
పంచే సిరిమల్లి –
ప్రేమ ప్రేమను ప్రేమించేలా
ప్రేరేపించే జాబిలి –
ప్రేమను పంచి, ప్రేమను పెంచి
పోషించే లోగిలి –
||నీలాకాశంలో||

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: