ఎరుపు కారు

ఎరుపు కారు
రచన : “పద్య కళాప్రవీణ” డా. ఆచార్య ఫణీంద్ర

fb_img_1488244645525

పరుగులిడును సతత మెరుపు కారొక్కటి
నాదు మెదడులోని నరము మీద!
పరుగులిడెను నాదు బాల్యమ్ములో నద్ది
స్వగృహమున పరచిన చాప మీద!!

ఎరుపు రంగదేల? ఏనాడు తలపోయ
లేదు వేరు రంగు నాదు మదిని!
ఎరుప దెందుకన్న – ఎరుక నాకొ కెరుపే!
సహజమ దనుకొంటి స్వాంతమందు!

ఎవరు ముట్టుకొన్న నేడుపే నా పాట!
“నాది – నాది” యంచు వాదులాట!
జోరుగ తిరుగాడి “షోకేసు”లో “పార్కు”
చేయబడెడి దద్ది సేద దీర!

ఎదుగు పిదప గంటి నెన్నెన్ని కారులో –
వివిధ వర్ణములను వెలుగు వాని!
ఎన్ని చూడనేమి! చిన్నతనమున నా
ఎరుపు కారు నెపుడు మరువలేదు!

పెరిగినాక నేను తిరుగుచుంటి నిపుడు
కలుగ ప్రీతి, యెరుపు కారునందు!
ఎందుకనగ – తిరుగు నెరుపు కా రెప్పుడు
నాదు మెదడులోని నరము మీద!

(మార్క్ హల్లిడే కవి ఆంగ్ల కవిత – 2003 – “ద పింక్ కార్” కు స్వేచ్ఛానువాదం)

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. Zilebi
  ఫిబ్ర 28, 2017 @ 18:33:09

  మీరేమన్నా సీపీయెం తీర్థం పుచ్చుకున్నారా ఎరుపు రంగంటే అంత మోజు ?

  జిలేబి

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 28, 2017 @ 20:19:19

  “పింక్ కార్” ను యథాతథంగా “గులాబీ కారు” అని అనువదిస్తే .. మీరు”రాష్ట్రం సిద్ధించినా ఇంకా టి.ఆర్.ఎస్. పిచ్చి వదల్లేదా?” అనేవారే! ఏదో ఒక రంగు అనుకొని అనువదించాను. అందునా నా కారు రంగు నిజంగానే ఎరుపు! అదీ సంగతి!!
  ఇంతకీ నా అనుసృజన ఎలా ఉందో చెప్పలేదు మీరు?

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: