నవ వర్ష కవితా గానం

2 జనవరి 2017 నాటి సాయంత్రం త్యాగరాయ గాన సభలో నూతనాంగ్ల సంవత్సర సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో నా కవితా గానం ..

– డా. ఆచార్య ఫణీంద్ర

img-20170102-wa0032

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నవ వర్ష గ్రంథము
————————
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
————————————–
మూడు వందల పై చిల్కు పుటలు గల్గు
పుస్తకమ్మును నేడింక మూసి వేసి,
క్రొత్త పుస్తకమ్మును జనుల్ కోరి తెరచు
సముచిత ముహూర్త మిప్పు డాసన్నమయ్యె!

ఒకొక పుటలోన నొక కల –
ఒకొకటి నెరవేరు – తీర కొకొకటి మిగులున్!
రకరకముల సుఖ దుఃఖాల్
చక చక రుచి జూపి సాగు సంవత్సరమే!

సాక్షిగ కాలమున్ నిలువ సాగిన దింకొక వత్సరంబు – నే
వీక్షణ జేయుచుండ నగుపించెను నూతన వత్సరంబు, తా
సాక్షిగ నిల్చె కాలము – “డిసంబరు ముప్పది యొక్క” టర్ధ రా
త్ర్యక్షర పాత్రమైన బహుళార్థక నూతన గ్రంథమిచ్చుచున్!

ఆశావహ దృక్పథమున
ఈశోపాసన సలిపెద నీ నవ గ్రంథం
బాశించిన రీతి లిఖిత
మై, సాగగ నవ్య వర్ష మానందముగాన్!

మిత్రులార! కొనుడు – మీ నవ వర్ష గ్రం
థమ్ములు వికసించి దాని పుటలు
సంతసమ్ముల నిడు సంపదలై నిల్వ –
అందజేయుదు నభినందనములు!

— @@@ —

img_20170102_222756

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. వెంకట రాజారావు . లక్కాకుల
  జన 05, 2017 @ 12:32:41

  మూడు శతకాల పైచిల్కు పుటలు వ్రాసి
  యపర నవ వర్ష గ్రంథాన్ని యతిసుళువుగ
  గడుసుదనమొప్ప నందర కరము లందు
  ఈ ఫణీంద్ర మాష్టారు దీవించి పెట్టె .

  కరుణించి ప్రకృతి సకాల వర్షాలతో
  మెండుగా పంటలు పండుగాత !
  సిరి సంపదలతో శ్రీమంతులై జనుల్
  జీవన సౌఖ్యాల చేరువగుత !
  ఆరోగ్య సౌభాగ్య మందరి దరిజేరి
  ఆనంద పరవశు లగును గాత !
  దైవ చింతనతో ధార్మిక గార్హస్థ్య
  బాథ్యతాయుతములు ప్రబలు గాత !

  ప్రకృతి భీభత్సములు లేక , పాలక జన
  పాలనా పీడనలు , యుధ్ధ భయము లేక
  శాంతి చేకూరు గాత ప్రజలకు – మించి
  రెండు వేల పదేడు మేలెంచు గాత !

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  జన 06, 2017 @ 16:37:34

  Thank you Raja Rao garu.
  Wish you a very Happy New Year 2017.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: