మాతృభాషా స్తుతి గీతం

ఈ రోజు “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా గతంలో నేను రచించిన నా మాతృభాషా స్తుతి గీతాన్ని ఆస్వాదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

కమ్మనైన భాషరా

ఆంధ్రము!

[ లలిత గీతం ]

రచన :

డా. ఆచార్య ఫణీంద్ర

images

కమ్మనైన భాషరా ఆంధ్రము

కవి కోకిలల కళా కేంద్రము

కమనీయ మధు కవితా సాంద్రము

కావ్య తృష్ణ తీర్చే చలివేంద్రము

|| కమ్మనైన ||

 

భారతి నుదుటను దిద్దిన చెంద్రము

హారతి పట్టగ వెలిగిన చంద్రము

భావ కుసుమ నిలయమీ సుధీంద్రము

భాషలన్నిటిలో రాజేంద్రము

|| కమ్మనైన ||

 

గుసగుసలాడే వేళ మంద్రము

బుస కొట్టే వేళ నాగేంద్రము

సహృదయ జన చర్చలలో సంద్రము

సభలోన సరస మాహేంద్రము

|| కమ్మనైన ||

___ *** ___

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. Zilebi
  ఫిబ్ర 22, 2016 @ 06:12:25

  భేషు గా ఉందండీ !

  (సింపుల్ అండ్ సూపెర్బ్)

  జిలేబి

  స్పందించు

 2. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 22, 2016 @ 06:24:11

  ధన్యవాదాలు జిలేబి గారు!

  స్పందించు

 3. Zilebi
  ఫిబ్ర 22, 2016 @ 07:03:56

  ఇతడుర ఫణీంద్రు డాంధ్రుడు !
  అతడనెను అ ఆ ఇ ఈ లె అందరిది గనన్
  ఇతని కవితలన్ జోదుగ
  అతులిత మధురిమ సుధామ యరసము గంటిన్

  చీర్స్
  జిలేబి

  స్పందించు

 4. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 22, 2016 @ 11:16:21

  జిలేబి గారు!
  మీ అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు!
  మీ పద్యం చాల బాగుంది. ఇలా చిన్ని మార్పులు చేస్తే మరింత అందగిస్తుంది.
  “ఇతడే ఫణీంద్రు డాంధ్రుడు !
  అతడనియె “అ-ఆ-ఇ-ఈ” లె అందరివి యటన్!
  ఇతని కవితలన్ జోదును,
  అతులిత మధురిమ, సుధామయ రసము గంటిన్!”
  మరొకమారు ధన్యవాదాలతో –
  – డా. ఆచార్య ఫణీంద్ర

  స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: