“స్వీట్ సిక్ష్టీన్”

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

(31/12/2015 సాయంత్రం కవిసమ్మేళనంలో గానం చేసిన కవిత)

image

పరువములో అడుగిడె నిక –

ఇరువది యొకటవ శతాబ్ది ఈ వత్సరమే!

కరిగెను పదునైదేడులు!

చిరు ప్రాయము దాటి స్వీటు సిక్ష్టీనయ్యెన్!

 

అందరి కన్నులు నిలిచెను

అందముగా నడచి నీవి టరుదెంచగ, నీ

సుందర రూపము పైనే!

ఉందురు దుర్మార్గులు – కాచుకోవలె సొగసుల్!

 

ఉన్నత విద్యలు నేర్చుచు,

ఉన్నతముగ నిలిచి, తగిన ఉద్యోగముతో

కన్న సమాజము సేవను

సన్నుతి గొనుమమ సలుపుచు  సాటి యుగములన్!

 

నీవు మెట్టు చోట, నిత్య మెల్లరు గూడ

సంతసమ్ము నొంది సాగవలయు!

నీదు సేవలంది నిర్భాగ్యు లగువారి

కందవలయు గొప్పనైన మేలు!

 

తరుణము నిద్దియే తరుణి! ధర్మము, సత్యము, సద్గుణంబులున్

వరలగ నొంట బట్టగ! ప్రపంచమునందున నెల్ల వారికిన్

చెరగని నవ్వుతో కరము చేయుము సాయము! కీర్తి నొందు మీ

తెరగున సాగి, శ్రేష్ఠముగ తీరిచి దిద్ద శతాబ్ది కాలమున్!

— &&& —

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

  1. వెంకట రాజారావు . లక్కాకుల
    జన 01, 2016 @ 07:30:32

    క్రొత్త వత్సర పద్యాలు క్రొత్తదన మొ
    లుక పదార్వన్నె బంగారు రోచులీనె ,
    ‘ స్వీటు సిక్స్టీను ‘ షోడశ విభవ కళల
    పున్నములు దెచ్చు గావుత ! పొలుపు హెచ్చి .

    స్పందించు

  2. Zilebi
    జన 01, 2016 @ 08:22:37

    ఆచార్య వారు పరువం లో పడ్డారు ! ఉందురు దుర్మార్గులు – కాచుకోవలె సొగసుల్!

    నూతన సంవత్సర శుభాకాంక్షల తో

    జిలేబి

    స్పందించు

  3. Dr.Acharya Phaneendra
    జన 01, 2016 @ 09:34:10

    లక్కాకుల వారు .. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతనాంగ్ల వత్సర శుభాకాంక్షలు.

    స్పందించు

  4. Dr.Acharya Phaneendra
    జన 01, 2016 @ 09:46:15

    జిలేబి గారు ..
    పరువంలో పడ్డది నేను కాదు – 21వ శతాబ్ది.
    అయినా నేను కొత్తగా కాచుకొనేది ఏముంది?
    రాజకీయ రంగంలో కె.సి.ఆర్, తెలుగు బ్లాగు రంగంలో నేను .. పడినన్ని తిట్లు మరెవ్వరూ పడి ఉండరు.
    ఫర్వా లేదు .. స్వీయ లాభాపేక్ష లేకుండ, ధర్మం కొరకు పోరాడి గెలిచిన తృప్తి నాకుంది!!! అందరి కన్న ముందు సీమాంధ్రకు ఏమ్ కావాలో సూచించి కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేసిన తృప్తి మరీ మరీ ఉంది.
    మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు మరియు నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!

    స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: