“అదిగో – మరో ద్వారక ..!

రచన : “పద్య కళాప్రవీణ”

           డా. ఆచార్య ఫణీంద్ర

An aerial view of flood affected areas of Chennai

ఘోరము! చెన్న పట్టణము కూరుక పోయెను వర్ష ధారలన్ –

నీరము, నీరమే .. కనగ నీరమె మొత్తము! నీరమందునన్

జారిన ద్వారకా పురికి ఛాయ వలెన్ కనిపించు నీ పురం

బారయ, నిప్పుడీ జనుల నాదుకొనంగల నాథు డెవ్వడే?

 

మునిగె దుకాణము, లిండ్లును,

మునిగెను రో, డ్లేరు పోర్టు, మొత్తము రైల్వే,

మునిగెను సెల్ఫోన్ టవరులు,

మునిగిరి మా తమిళ ప్రజలు, మునిగెను బ్రతుకుల్!

 

వరుణుం డుగ్రుడునై యపారమగు పెన్ వర్షంబులన్ ధాటిగా

కురియం బూనె దినంబు లెన్నొ వరుసన్! క్రోధం బదేలయ్యెనో?

నిరతంబు న్నిట త్రాగగా జనులకున్ నీరందకే యక్కటా!

కరువున్ జూతుము గాని, యిట్లు జలమే ఖడ్గంబ దేలయ్యెనో?

 

“ప్రక్కన గల కర్ణాటక

తక్కువ నీరు వదులు” నని, తగు పాళ్ళకునై

నిక్కచ్చిగా నడుగువా

రెక్కడ గన నక్కడ .. ఇపు డెల్లెడ నీరే!

 

 

అయినచో ననావృష్టి, లేదన్న యెడల

నిట్టు లతివృష్టి యనుచో నికెట్టు లయ్య?

‘పార్థ సారథీ’! మౌనివై బండ యటుల

కూరుచుంటివో కను చిద్ది గుడిని, పురిని!

(“పార్థ సారథి దేవాలయం” – ‘చెన్నై’లో అతి ప్రాచీనం, బహుళ ప్రసిద్ధం)

 

 

నాడిటు లుగ్ర రూపుడయి నాశము గూర్చగ నింద్రు డెంచియున్

దాడిని సేయగా, గిరిని తక్షణ మెత్తియు నీదు వ్రేలిపై

నీడను గూర్చి గాచితివి నీ పరివారము, బంధు మిత్రులన్!

నేడిటు లూరుకొంటి వెటు నీ కను ముందర నీట మున్గినన్?

 

 

త్వరగ కోలుకొనెడి దారు లన్వేషించి

ప్రభుత, దాత లింక పరగు గాక!

దైవ మింక పైన తగినంత వర్షమే

కురియు గాక! ప్రజలు మురియు గాక!

           — &&& —

 

 

1 వ్యాఖ్య (+add yours?)

 1. kinghari010
  డిసెం 21, 2015 @ 10:24:26

  నిజమే చెన్నై మరో ద్వరకలాగే తయారయింది!
  మొదటి వరస కురిసి ఆగినపుడు ఆంధ్రా నుంచి బంధువు లొకరు ఫోన్ చేస్తే “ఈ మాదిరి వర్షం ఇంకో నెల రోజులు కురిస్తే ద్వారకలా మునిగిపోతుందేమో చెన్నై కూడా:-)” అని జోకేశా.తగ్గినట్టే తగ్గి మళ్ళీ రెండో విడత అందుకున్నప్పుడు నిజంగానే అంతపనీ జరుగుతుందేమోనని భయం కూడా వేసింది.

  ఇదివర్లో పల్లెటూళ్ళ నుంచి టవునుకు వచ్చిన వాళ్ళకి స్నానానికి చెంబుడు నీళ్ళూ భోజనాల దగ్గిర స్పూనుతో ఇవ్వటం లాంటి కార్టూన్లు చూసి నవ్వుకున్నా.రెండో విడత వర్షానికి మా పనీ అట్లాగే తయారయింది.

  మేమింకా నయం.అన్నా నగర్ కొంచెం మెరక ప్రాంతం కాబట్టి తట్టుకోగలిగాం.
  ప్రభుత్వం పూర్తిగా ఫెయిలయిపోయినంది.

  స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: