ఆ రెండు రూపాయలలో ఒకటి స్వరమై .. ఒకటి తాళమై …

ఒకసారి సంగీత దర్శకులు శ్రీ కె.వి. మహదేవన్ ఒక చిత్ర నిర్మాణ సంస్థ పిలుపు మేరకు వారి ఆఫీసుకు వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు అక్కడి ఆఫీస్ బాయ్ పాటలు పాడుతూ ఊడుస్తున్నాడు. మహదేవన్ ఆ అబ్బాయిని పిలిచి, రెండు రూపాయలు చేతిలో పెట్టి, “బాగా పాదుతున్నావు. ఎందుకురా ఈ పని చేస్తావు? వెళ్ళి సంగీతం నేర్చుకో!” అన్నారు. ఆ రెండు రూపాయలలో ఒకటి స్వరమై, ఒకటి తాళమై ఆ అబ్బాయిని గొప్ప సంగీత దర్శకుణ్ణి చేసింది. ఏ మనిషి అయినా .. కృషి, పట్టుదల ఉంటే ఎంతైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయ వ్యక్తిత్వం ఆయనది. ఆ మహనీయుడే ఎం. ఎస్. విశ్వనాథన్. ఆయన మహాకవి ఆత్రేయతో కలసి సుప్రసిద్ధ దర్శకులు కె. బాల చందర్ చిత్రాల కోసం అజరామరమైన అమృత తుల్యమైన గీతాలను సృజించారు. నా కౌమార, యవ్వన దశలో ఆ గీతాలు నన్నెంతో ప్రభావితం చేసాయి. ఒక కవిగా నాలో నెలకొన్న భావుకతకు, అభ్యుదయ భావజాలానికి, పోరాట స్ఫూర్తిలో నిర్భయత్వానికి ఆ గీతాలు కొంత బాటలు వేసాయి. నిన్న శ్రీ ఎం. ఎస్. విశ్వనాథన్ పరమపదించారని తెలిసి ఎంతో వ్యధ చెందాను. ఆ మహనీయుని దివ్య స్మృతికి అంజలి ఘటిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

MS_Viswanathan

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: