తెలంగాణ రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు!

celebrations

 

 

 

 

 

‘అరువది తొమ్మిది’న్ మరియు నా పయి రేగిన ఉద్యమాలలో
ఒరిగిన కంఠ మాలల మహోన్నత త్యాగ ఫలంబునౌచు, నే
డరుగుచు నుండె గాదె ’తెలగాణము’ పూర్ణ స్వతంత్ర మొందుచున్!
అరువది యేండ్ల స్వప్న మిది, ఆకృతి దాలిచి ముందు నిల్చెడిన్!!

నా ‘తెలంగాణ’ కోటి రత్నాల వీణ
సర్వ స్వాతంత్ర్య రాష్ట్రమై సాకృతి గొన –
అమరులైన వీరుల ఆత్మ లందె శాంతి!
మురియుచుండ్రి ’తెలంగాణ’ భూమి సుతులు!!

నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై
ఆకాశమంత ఎత్తార్చినాను –
నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి
పద్యాలు గొంతెత్తి పాడినాను –
నే దాశరథి కవి నిప్పు లురుము గంట
మొడుపులన్ కొన్నింటి బడసినాను –
నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై
పద్య ప్రసూనాల పంచినాను –

ఐదు కోటుల సీమాంధ్రు లందరికిని
మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి,
మూడునర కోట్ల ప్రజలకు ముక్తి గలుగ –
పాడినాను తెలంగాణ భాగ్య గీతి!

శ్రీలంగూర్చగ దివ్య ‘భద్రగిరి’పై సీతమ్మగా ‘లక్ష్మి’యున్ –
ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ ‘బాసర’న్ ‘వాణి’యున్ –
‘ఆలంపూరు’న జోగులాంబగ శుభాలందింపగా ‘గౌరి’యున్ –
మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలున్ బ్రోచున్ తెలంగాణమున్!

                               యావత్ తెలంగాణ ప్రజలకు

         తెలంగాణ రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు!

                                    – డా. ఆచార్య ఫణీంద్ర

Telangana

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. Jai Gottimukkala
  జూన్ 02, 2014 @ 15:18:45

  శ్రీశ్రీ మాటను కొద్దిగా మారిస్తే: “ఆ స్వప్నం నిజమయ్యింది, ఆ స్వర్గం రుజువయ్యింది”.

  Congratulations to you and all Telangana people. Jai Telangana!

  స్పందించండి

 2. నా తెలంగాణ కోటి రత్నాల వీణ
  జూన్ 02, 2014 @ 23:15:38

  పద్యాలు చాలా బాగా రాశారు మిత్రమా! నవ్య త్రిలింగాంధ్ర రాష్ట్రోద్భవ శుభాకాంక్షలు! అభినందనలు!

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జూన్ 09, 2014 @ 15:37:38

  Thank you very much
  @ Jai Gottimukkala
  @ నా తెలంగాణ కోటి రత్నాల వీణ

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: