రచయితలు తమ ముద్రిత గ్రంథాలను అమ్ముకోవడం ఎలా?

చాలా మంది రచయితలు, కవులు తాము పుస్తకాలు అచ్చు వేసుకొని నష్టపోయామని, తమ పుస్తకాలు అమ్ముడుపోక అటకలపై మూల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారికి ఉపయుక్తంగా ఉండే నా సూచనలు ఇవి.  

books 

 

1. మొదట ముద్రణకు ముందే రచయిత నిష్పక్షపాతంగా ఆ గ్రంథానికి ప్రచురణ అర్హత ఉందా? .. లేదా? … అని బేరీజు వేసుకోవాలి. రచనలో పటుత్వం ఉంది … నలుగురికీ నచ్చుతుంది … అనుకొంటేనే పెట్టుబడి పెట్టాలి.

ముద్రణ సమయంలో గ్రంథం కాస్ట్ ప్రైజ్ కన్న ధర నాలుగింతలు ఎక్కువగా  ముద్రించాలి. “గ్రంథం లభించే చోటు” అంటూ స్వీయవిలాసంతోబాటు కొన్ని వివిధ  నగరాల, జిల్లాలలోని ప్రసిద్ధ బుక్ షాపుల అనుమతితో, వారి వారి చిరునామాలను కూడా ఆ గ్రంథంలో ముద్రించాలి.

2. గ్రంథావిష్కరణ రోజు సగం ధరకేఅని ప్రకటించి, అమ్మడం వలన కొన్ని అమ్ముడు పోతాయి. లేదా “కొత్త పుస్తకం కొంటే  కొన్ని పాత పుస్తకాలు (అమ్ముడు పోనివి) ఉచితం” అని ప్రకటించడం మరొక పద్ధతి. ఇలా బోణీ కొట్టవచ్చు.

3. తరువాత సమీక్షలు వివిధ పత్రికలలో వచ్చాక, కనీసం ఒక పది ఊళ్ళ నుండి గ్రంథం పంపమని లేఖలు వస్తాయి. వారికి సగం ధరకు, ఇంకా  పోస్టేజ్ ఫ్రీగా పంపుతాము అని …డబ్బును ఎం.ఒ. చేయమని కార్డు ముక్క వ్రాయాలి. అలా కొంతమందికి అమ్మవచ్చు.

4. ఆ పైన తక్షణం డబ్బును ఆశించకుండా, గ్రంథంలో ముద్రించిన బుక్ షాపులలో 50 ప్రతుల చొప్పున ఉంచాలి. ఒక సంవత్సరం తరువాత తీరుబడిగా వెళ్ళి, అమ్ముడు పోయిన గ్రంథాల డబ్బును (ఆ షాపు వాళ్ళ కమీషను పోను మిగిలింది) తెచ్చుకోవచ్చు.

5. వివిధ నగరాల, జిల్లాల, గ్రామాల, విద్యాసంస్థల గ్రంథాలయాలకు వెళ్ళి కొన్ని ప్రతులను అమ్ముకోవచ్చు.(సాధారణంగా 40% డిస్కౌంటుతో)

6. కొన్ని కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపాళ్ళ అనుమతితో తెలుగు పండితులకు, ఉపాధ్యాయులకు, సాహిత్యాభిరుచి గల విద్యార్థులకు కొన్ని ప్రతులను అమ్ముకొంటే కొంత డబ్బు వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపాళ్ళకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ఇచ్చి ప్రసన్నం చేసుకొని, విద్యార్థులకు సగం ధరఅంటే చాలా డబ్బే మూటగట్టుకోవచ్చు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను సంస్థ సిబ్బంది మరుసటిరోజు పుస్తకం కొనుగోలుకై డబ్బు పట్టుక రావాలని శాసించిన సందర్భాలు కూడా లేకపోలేదు. 

7.  వివిధ సాహిత్య సభలలో, ఎగ్జిబిషన్లలో, బుక్ ఫేర్ లలో పెట్టే పుస్తక విక్రయం స్టాళ్ళలో వాళ్ళ కమీషన్ రేట్ల ప్రకారం ఒప్పుకొని ఉంచితే, కొంత డబ్బు వస్తుంది. 

8. వివిధ పురస్కారాల వివరాలు తెలుసుకొని పంపితే, బహుమతి లభించే స్థాయి ఉంటే, పెద్ద మొత్తమే చేతికందుతుంది. 

 9. రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయాల కొనుగోళ్ళ ప్రకటన ఎప్పుడు వచ్చేది కాస్త గమనించి, అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా మంచి మొత్తమే లభిస్తుంది.

10. చివరగా .. బంగారు కోడిపెట్ట వంటిది రాజా రామమోహనరాయ్ ఫౌండేషన్వారి ప్రకటన! అది ఎప్పుడు వెలువడేది గమనించి అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా చాల పెద్ద మొత్తమే మన అకౌంటులో వచ్చి పడుతుంది.  

11.  ఈ మధ్య కినిగె వంటి సంస్థలు ఇంటర్నెట్ ద్వారా కూడా పుస్తకాలు విక్రయిస్తున్నారు. వారిని కూడా సంప్రదించవచ్చు. కొంత లాభం ఉండవచ్చు. 

12.  అయితే, వీటన్నిటి కన్న ఉత్తమమైన పద్ధతి ఒకటుంది. అది పుస్తక ముద్రణకు ముందే సాహిత్యాభిమానం గల దాతలను వెదుక్కొని స్పాన్సర్ చేయించుకోవడం. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని కొంచం కష్టపడితే కొన్ని వ్యాపార సంస్థల నుండి లేదా ప్రభుత్వ సంస్థల నుండి 2,3,4 కవర్ పేజీలకు అడ్వర్టైజ్మెంట్స్ సంపాదించుకొంటే పెట్టుబడి లేకుండా (లేదా స్వల్పమైన పెట్టుబడితో) పుస్తకాలు అచ్చు వేసుకోవచ్చు.

అయితే ఈ  సూచనలన్నిటిలోకి ప్రధానమయినది నా 1వ సూచనే!

పటుత్వ రచనను ముద్రించిన ఏ రచయిత కూడా లాభం పొందినా .. పొందకపోయినా…, నష్టపోడని మాత్రం కచ్చితంగా చెప్పగలను.

 నేను పైన చెప్పిన వాటిలో అందరూ అన్ని పాయింట్లను పాటించాలని లేదు. పుస్తకం ధర కాష్ట్ ప్రైజ్కి నాలుగింతలు పెట్టుకొన్నాక, నేను చెప్పిన వాటిలో కొన్ని పాటించి, కేవలం1/4 వంతు పుస్తకాలను అమ్ముకొన్నా మన పెట్టుబడి మనకు వస్తుంది కదా! నష్టం ఉండదు. చాలదా?

ఇక లాభమంటారా? 3/4 వంతు పుస్తకాలను ఉచితంగా పంచే వెసులుబాటు .. దానికేం విలువ కడుతారు? వెయ్యి పుస్తకాలు వేస్తే, కనీసం వందలాది మంది చదివి బాగుంటే ప్రశంసిస్తారు. అది విని కలిగే ఆనందానికి ఏం విలువ కడుతారు? నా స్వీయానుభవాన్ని చెప్పుతాను… వినండి. ఎప్పుడూ వెళ్ళని ఊళ్ళకు మొదటిసారిగా వెళ్ళినప్పుడు ముఖపరిచయం లేనివాళ్ళు కూడా ఆదరంగా వచ్చి కలిసి “మీరేనా ఆచార్య ఫణీంద్ర? మీ పుస్తకాలు మేం చదివామండి” అంటూ అందులోని విషయాలను ఉటంకిస్తుంటే … కవిగా నా జన్మ సార్థకం అయిందనిపిస్తుంది. ఆ మధురానుభూతికి ఏం విలువ కడుతారు? డబ్బేనా? ఇవన్నీ లాభాలు కావా?  

  – డా. ఆచార్య ఫణీంద్ర

                                 — &&& —       

       

 

       

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. sankar
  ఏప్రి 12, 2014 @ 08:12:23

  idi coostae telustundi. nuvventa neechamaina telabaan vedhava ani. ekkadaiki potundi telabaan buddi.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఏప్రి 12, 2014 @ 22:51:28

  తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ నా ఈ బ్లాగులో నిష్పక్షపాతంగా నా కవితలను, అభిప్రాయాలను అందించడంతో బాటు, రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు అందించవలసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడ అందరి కంటె ముందు గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ కు సూచించింది నేనేనని సర్వజన విదితమే! రాష్ట్ర విభజన ఒక వాస్తవమని అందరూ గుర్తించి, ఇకపై రెండు ప్రాంతాల తెలుగు ప్రజలు విభజనానంతరం కూడా సోదరభావంతో సహకరించుకొంటూ, పోటాపోటీగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నేను వ్రాసిన కవితలను ఈ మధ్య అనేక పత్రికలు, కవిసమ్మేళనాలలో సాహిత్యాభిమానులు, ముఖ్యంగా ఉగాదినాడు రాష్ట్రప్రభుత్వ కవిసమ్మేళనంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, నా సీమాంధ్ర కవిమిత్రులు, శ్రోతలు కూడా ప్రశంసిస్తున్నారు. కాని ‘శంకర్ ‘ అనే ఒక ధూర్తుడు ‘స్పాం’ ద్వారా పంపిన పై వ్యాఖ్యను చూడండి. అందరు రచయితలకు ఉపయుక్తమైన ఈ పోస్టును ఫేస్ బుక్ లో ప్రాంతాలకు అతీతంగా అందరూ మెచ్చుకొన్నారు. కొందరు ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. కాని ఈ దుష్ట, నికృష్ట బ్లాగరుకు ఇందులో నా నీచబుద్ధి కనిపించిందట. రాష్ట్ర విభజనపై అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అది నేరుగా నాతో చర్చించే సత్తా లేక అనేక మార్లు భంగపడి పారిపోయి, ఆపై ‘స్పాం’ ద్వారా కేవల ద్వేషభావంతో గత నాలుగైదు నెలలుగా నన్ను ఘోరాతిఘోరంగా నిందిస్తూ, అవమానిస్తున్న ఈ నీచుడు సాధించేదేమిటి? మొదట ఏదో ఆవేశంలో ఉన్నాడేమో అని క్షమించాను. తెలంగాణ రాష్ట్రమన్నది ఎన్నెన్ని రాజకీయ పార్టీలు ఎన్నెన్ని నాటకాలాడాక, ఎంతమంది యువకులు బలి అయ్యాక, ఎన్నెన్ని మలుపులు తిరిగాక ఏర్పడుతున్నదో అందరికీ తెలుసు. కాని నాపై వ్యక్తిగత ద్వేషంతో ఈ వంకర బుద్ధి ‘సంకర్’ చేసే ప్రతి స్పాం వ్యాఖ్యకు నా గుండెకు గాయమవుతున్నా, ఇంకొన్నాళ్ళు వాస్తవం జీర్ణమయ్యాక తప్పు తెలుసుకొంటాడని ఊరుకొన్నాను. ఎందుకంటే, లోగడ నన్ను అమానుషంగా నిందించిన ఒక బ్లాగరు తరువాత తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టాడని ఆయన బ్లాగు ద్వారానే తెలుసుకొని బాధపడ్డవాణ్ణి కాబట్టి, మరికొన్నాళ్ళు హృదయం కాలుతున్నా కూడా శపించకుండా నిగ్రహించుకొన్నాను. కాని దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అందుకే రగులుతున్న గుండెతో శపిస్తున్నా…

  న్యాయము చేసినట్టి పరమాత్ముని నిర్ణయ మద్ది! దాని న
  న్యాయముగా తలంచి, కసి నా పయి జూపుచు, వ్యాఖ్య ‘స్పాములన్’
  నా యెడ ‘బూతు’ బాణముల నాటుచు ‘సంకర’ నామధేయుడే
  గాయము చేసె నా హృదికి! గాడిద … వాడిక నాశనంబగున్!

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  ఏప్రి 12, 2014 @ 23:34:16

  లోగడ ‘శంకర్ ‘, ఉరఫ్ ‘వోలేటి ‘ అనే ఈ నీచుడు నాపై వాని బ్లాగులో “సీమాంధ్ర పాలు తాగిన ఫణి విషము గ్రక్కెను..” అంటూ ప్రచురించిన టపా, దానికి నా సమాధానాలు మరొక్క మారు చూడండి.
  —————————————————–
  shankar
  నవం 13, 2013 @ 13:43:34
  సీమాంధ్రులు తమ వుద్యమంలో వ్యతిరేకత తెలియజేసినది ఎవరిమీద??
  తెలంగాణా ప్రజలమీద.. అక్కడ నాయకులమీదా కాదే..సీమాంధ్ర నాయకులమీద.. మరి ఆచార్యుల వారు సీమాంధ్రప్రజలను ఎందుకు ఆడిపోసుకున్నట్టు..
  కొన్ని వందల నైజాం నవాబుల కాలంలో జరిగిన చీకటి జీవితాన్ని మర్చిపోయి.. ఆంధ్రప్రదేశ్ లో కలిసిన తర్వాత నేర్చిన పలుకులు, చదువులు, విద్య, వైద్యం ఇన్ని సౌకర్యాలు కలిగిన తర్వాత చేసిన మేలుకి కనీసం కృతజ్ఞత తెలుప లేని సంస్కారానికి పరాకాష్టే ఈ రాతలు..
  తెలంగాణా ఏరియాలో ఆంధ్రా నుండి వచ్చి పనిచేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలకు, దూషణ భూషణలను ఎదుర్కొని సేవలు చేసిన ఫలితం ఇది..
  శాంతిభద్రతలను కాపాడటంలో శ్రీ.వ్యాస్ లాంటి ఎంతో మంది ఆంధ్రా పోలీసులు అసువులు బాసారు..
  సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ఏర్పాటుకు వ్యతికులైతే ఇన్నాళ్ళూ వుద్యమం సాగదు.. కాని కొంతమంది తెలంగాణా నాయకుల దారుణమైన మాటలవలన గుండే ముక్కలై వుద్యమాలు చేసారు.. మూడు ప్రాంతాల ప్రజల పన్నులతో అభివృధ్ధి చేదిన రాజధాని నగరం నుండి పొమ్మంటున్నందుకు సీమాంధ్ర ప్రజలు వుద్యమం చేస్తున్నారు…
  కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, హైకోర్టు, అనేక సహాయ సంస్థలు అన్నీ అక్కడే.. ఆఖరుకి సముద్రమే లేని హైదరాబాద్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టేరు.
  ఇది న్యాయమా అని అడుగుతున్నారు సీమాంధ్రా జనం .. విభజన జరిగితీరాలి లేకపోతే ఎన్నేళ్ళయినా ఇలా సీమాంధ్రులపై విషాన్ని చిమ్ముతూనే వుంటారు….
  ————————————————————–
  Dr.Acharya Phaneendra
  నవం 23, 2013 @ 07:05:27
  “కొందరు స్వార్థపరులు రెచ్చగొడితే, ’సమైక్యాంధ్ర’ ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ప్రజలు తామేం తప్పు చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు” అని తోటి సోదరునిగా ఆవేదన చెందుతూ ఈ బ్లాగులో ఇంతకు ముందు ఒక టపాలో – “ఇప్పుడు ఎందుకు సీమాంధ్ర ప్రజలు ముద్దాయిలు అవుతున్నారు?” అన్న శీర్షికతో ఒక వ్యాసాన్ని వ్రాసి ప్రచురించాను. ఆ వ్యాసం చదివి సీమాంధ్ర ప్రజలలో ప్రస్తుత రాష్ట్ర విభజన పరిస్థితులలో సహృదయత నెలకొని, ఏర్పడబోయే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలలో నిజమైన సఖ్యత ఏర్పడాలని ఆకాంక్షించాను.
  అయితే పేరుకి మాత్రం ’సమైక్యాంధ్ర’ నినాదం తలకెత్తుకొని, ఒళ్ళంతా ఏక ప్రాంత ప్రయోజనాల స్వార్థం నింపుకొన్న ఒక విషపు పురుగులాంటి ’శంకర్’ ఉరఫ్ ’వోలేటి’ ఉరఫ్ ’ilare’, నేను ప్రవచించిన ఈ నిజమైన సమైక్యత, సఖ్యతను జీర్ణించుకోలేక తన బ్లాగులో (ఆ బ్లాగు ముఖచిత్రంలో నిలుపుకొన్న సీతా,రామ,లక్ష్మణస్వాములు వాని దురహంకారాన్ని క్షమిస్తారా?) నా మీద అక్కసంతా వెళ్ళగ్రక్కుతూ, విషం చిమ్మి, పైగా నా గురించి “సీమాంధ్ర పాలు తాగిన ఫణి విషము గ్రక్కెను..” అంటూ వ్యాఖ్యానించాడు.
  నేను సీమాంధ్ర పాలు తాగానా? ఏం? మా తెలంగాణలో పాలు లేవా??? అంటే “వాని దయాదాక్షిణ్యాల మీద మేము ఎదిగాము, మాకంటూ ప్రత్యేకమైన అస్థిత్వమేదీ లేదు!” అని వాని దురహంకార భావం. అదీ ఆ ఆధిపత్య, అహంకార ధోరణి గల ధూర్తునికి తెలుగు నేలపై ఒక ప్రాంతంపై, ఒక ప్రాంత ప్రజలపై ఉన్న చిన్నచూపు. ఇదీ వాని సమైక్య భావం! ఈ ఆధిపత్య, అహంకార ధోరణిని సహించలేకే కదా … తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఇలాంటి దురహంకారుల వల్లే కదా … మాలాంటి వాళ్ళు మానసిక క్షోభతో కరుడు గట్టిన తెలంగాణవాదులుగా మారింది.
  ఇంకా ఆ మూర్ఖుని అహంకారాన్ని, అవివేకాన్ని చూడండి –
  “కొన్ని వందల నైజాం నవాబుల కాలంలో జరిగిన చీకటి జీవితాన్ని మర్చిపోయి.. ఆంధ్రప్రదేశ్ లో కలిసిన తర్వాత నేర్చిన పలుకులు, చదువులు, విద్య, వైద్యం ఇన్ని సౌకర్యాలు కలిగిన తర్వాత చేసిన మేలుకి కనీసం కృతజ్ఞత తెలుప లేని సంస్కారానికి పరాకాష్టే ఈ రాతలు.. ”
  ఇక ఆ అవివేకికి నా సమాధానం ఇది …
  ఓ వోలేటి పండిత పుత్రా!
  అంటే మేము నవాబుల కాలంలో చీకటి జీవితాన్ని అనుభవించాము. మీరు మిమ్మల్ని బానిసలుగా చేసి పాలించిన బ్రిటిషర్ల కాలంలో భోగ భాగ్యాలను అనుభవించారా? ఒకవేళ అలా అనుభవించిన వాళ్ళే అయితే, నీ సిద్ధాంతం ప్రకారమే, మీకు చదువులు, విద్య, వైద్యం … ఇలా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ వాళ్ళు చేసిన మేలుకి కనీసం కృతజ్ఞత లేకుండా, సంస్కారం లేకుండా ఎందుకు స్వాతంత్ర్య సమరానికి దిగారు? ఆంధ్ర దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సర్ ఆర్థర్ కాటన్ వంటి మహనీయులతో సహా, బ్రిటన్ నుండి వచ్చి పనిచేసిన కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలను, దూషణ భూషణాలను ఎదుర్కొని సేవలు చేసిన ఫలితాన్ని గుర్తించి కృతజ్ఞతతో పడి ఉండకుండా, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు ఇంకా ఎందరో ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు విషం కక్కినట్టేనా? సరే! వాళ్ళు విదేశీ పాలకులు! స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మీ ప్రాంతంలో, మీ ఉద్యోగాలలో చేరి, ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, రైల్వే ఉద్యోగులుగా తమిళులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలకు, దూషణ భూషణాలను ఎదుర్కొని, మీకు సేవలు చేసిన ఫలితాన్ని గుర్తించి కృతజ్ఞతతో పడి ఉండకుండా, వాళ్ళ మీద ఎందుకు విషం కక్కినట్టు?
  అసలు విద్యలు నేర్వడానికి, సేవలు పొందడానికి – మరి, కలసి ఉండడానికి సంబంధం ఉందా?
  జర్మనీకి చెందిన ’రైట్ బ్రదర్స్’ విమానాలను కనుగొన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఆ సేవలను పొందుతున్నాం. అందుకు కృతజ్ఞతగా మనం భారత దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ను జర్మనీలో కలుపవచ్చునా?
  ఇప్పుడు అర్థమయిందా? నీవి ఎంత పరాకాష్టకు చేరిన అజ్ఞానపు వ్రాతలో?
  ఓ మూర్ఖ శిఖామణీ!
  ఇక నీ ఆధిపత్య అహంకార ధోరణికి నా సమాధానాలు విను –
  మీరు మాకు ’పలుకులు’ నేర్పారా?
  అసలు నీకు తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి తెలుసా?
  తెలుగు భాష ఉమ్మడి ద్రావిడ భాషా కుటుంబంలో వేరుపడి పుట్టింది ’అశ్మక దేశంలో( ఇప్పటి మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతం). ఇప్పుడు నేను మీకు తెలుగు భాషను మేమే అందించామని అనవచ్చునా?
  చరిత్రలో మొట్టమొదటి తెలుగు మహానగరం – ప్రతిష్ఠానపురం. దీనినే యూరోపియన్ చరిత్రకారులు ’పైఠాన్’ (ఇప్పటి నిజామాబాదు జిల్లాలోని ’బోధన్’) అన్నారు. ఇప్పుడు నేను మీకు తెలుగు నాగరికతను మేమే నేర్పించామని అనవచ్చునా?
  చరిత్రలో మొట్టమొదటి తెలుగు రాజులు శాతవాహనుల రాజ్య పాలన ప్రారంభమయింది ఇప్పటి కరీంనగర్ జిల్లా ’కోటి లింగాల’లో. ఇప్పుడు మీకు పరిపాలన నేర్పింది మేమే అని విర్రవీగవచ్చునా?
  ఆ శాతవాహనులే తరువాత రాజ్యాన్ని విస్తరించుకొని అమరావతిని కొత్త రాజధానిగా నిర్మించుకొన్నారు. ఇప్పుడు మేము … మీకు మొట్టమొదటి రాజధానిని నిర్మించి ఇచ్చింది మేమే … కృతజ్ఞతతో పడి ఉండండి … అని అహంకరించవచ్చునా?
  అసలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మహాభారత కాలంలోనే – ’అంధక’దేశంగా, ’తెలింగ’ దేశంగా వేరుగా ఉన్నాయి. అప్పుడు అంధక దేశీయులు కౌరవుల పక్షాన, తెలింగ దేశీయులు పాండవుల పక్షాన పోరాడారు. ఇప్పుడు నేను మీరు మొదటి నుండి అధర్మం పక్షాన నిలిచారని దెప్పిపొడువవచ్చునా?
  తెలుగు వారికి మొట్టమొదటగా దేశి ఛందస్సులను, జాను తెనుగును, విప్లవాత్మక భావాలను పరిచయం చేసిన పాల్కుర్కి సోమనాథుడు ఇప్పటి వరంగల్ జిల్లా ప్రాంతీయుడు …
  తెలుగు వారికి మొట్టమొదటగా ఛందో మర్మాలను తెలియజేసిన అప్పకవి ఇప్పటి మెదక్ జిల్లా ప్రాంతీయుడు …
  … ఇలా … వ్రాయాలంటే చరిత్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు భాష, సంస్కృతి, నాగరికత, వ్యాకరణం, పరిపాలన … అన్నీ నేర్పించింది మేమే అనవచ్చునా?
  కాని, ఇలాంటి వ్యర్థ వాదనలకు నా సమయాన్ని వృథా చేసుకోలేక పోతున్నాను. మొదట ఈ వివరాలన్నీ తెలియజేస్తూ నా ఈ బ్లాగులో ఒక టపానే ప్రచురిద్దామనుకొన్నాను.
  కాని నీకు, నీలాంటి దురహంకారుల మిడిమిడి జ్ఞానానికి అంత సీన్ లేదని ఈ వ్యాఖ్యతో ముగిస్తున్నాను.
  —————————————————————-
  Dr.Acharya Phaneendra
  నవం 24, 2013 @ 23:23:16

  గ్రీన్ స్టార్ గారు!
  గుండు మధుసూదన్ గారు!

  ఆ మూర్ఖ దుర్మార్గ ధూర్తునికి నేను వ్రాసిన వాస్తవాలను సహేతుక వాదనతో ఖండించేందుకు ఏమీ లేక, చేతగాని చవట వలె spam లో ప్రచురణకు అనర్హమైన బూతులతో మన తెలంగాణ బ్లాగర్లను పేరు పేరున దూషిస్తూ వ్యాఖ్యను పంపాడు. అదే అధర్మబుద్ధి గల ఆ నికృష్టుని ఓటమికి, ధర్మయుద్ధం చేస్తున్న మన విజయానికి సంకేతం.

  మీ ఇరువురికి నా ప్రత్యేక ధన్యవాదాలు!

  ————————————————

  స్పందించండి

 4. Ramakrishna
  ఏప్రి 15, 2014 @ 21:22:58

  Dear Sir

  Please ignore such mails. By the way your ekapadya ramayanam reminded me my guru shri Boorugadda Narasimhacharyulu garu.

  regards

  sistla

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  ఏప్రి 17, 2014 @ 21:12:34

  Ramakrishna garu!

  Generally I ignore such idiot’s comments. But this bloody fool VOLETI/SANKAR/ILARE has been irritating me for last 4 months. I thought … Enough is enough! Let the world know the dirty face & cruel mind of this scoundrel and if my ideology of “DHARMA” is truthful, let my curse punish him for ever.
  I put this curse in Chandassu which I believe that has got its own power.

  Any how, Thanks for your cordial support and appreciation.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: