ఎవరు తెలబానులు?


india

రాజ్యాంగ పరిధి మేరకు తమకంటూ ఒక రాష్ట్రాన్ని కోరుకొని పోరాడిన తెలంగాణ ప్రజలను (ఒకప్పుడు సీమాంధ్రులు అలా పోరాడి సాధించుకొన్న వారే సుమా!) దేశ ద్రోహులుగా చిత్రిస్తూ, ‘తాలిబాన్’లతో పోలుస్తూ ‘తెలబాన్లు’ అని పదమూడేళ్ళుగా సీమాంధ్రులు (అందరూ కాదు) నోరు పారేసుకొన్నారు.

ఇప్పుడు అసలు రంగులు బయటపడ్డాయి.

తెలంగాణను ఇస్తే, కొందరు సీమాంధ్రులు పార్లమెంటును బాంబులతో పేలుస్తామంటున్నారు. కొందరు సీమాంధ్ర ఎం.పి.లు కత్తులతో, పెప్పర్ స్ప్రేలతో ప్రవేశించి ‘అఫ్జల్ గురు’ వారసులలాగా పార్లమెంటుపై దాడి చేసారు. కొందరు ఆ దుర్మార్గ దుష్ట నికృష్ట ఎం.పి.లను ‘భగత్ సింగ్’తో పోల్చారు.(మన్నించు షహీద్! ఆ నీచులు మా తెలుగు వాళ్ళయినందుకు సిగ్గుతో తల దించుకొంటున్నాను.) ఇంకొందరు కాంగ్రెస్ ప్రభుత్వం కశ్మీర్, పంజాబ్ లలోలాగా దక్షిణాది రాష్ట్రంలో కూడా చిచ్చు పెట్టిందని అంటూ తమను తాము కశ్మీరీ మిలిటెంట్లకు, ఖలిస్తాన్ తీవ్రవాదులకు వారసులుగా ప్రకటించుకొంటున్నారు. కొందరు సీమాంధ్రను వేరే దేశం చేయాలంటున్నారు. మరికొందరు ఉత్తర భారత దేశం నుండి దక్షిణ భారత దేశాన్ని విడదీయాలంటున్నారు. 

సిగ్గు, లజ్జ ఉంటే … సీమాంధ్రులు (అందరినీ అనడం లేదు!) గుండెల మీద చేయి వేసుకొని ఇప్పుడు చెప్పాలి –

ఎవరు దేశ ద్రోహులు?  ఎవరు తెలబానులు?

స్వచ్ఛమైన దేశభక్తి నిండిన భారతీయ హృదయం గల తెలంగాణవాదిగా

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. akhill
  ఫిబ్ర 16, 2014 @ 11:46:09

  oka thaaguobthu vedhava ni Gandhi annappudu siggu raledha mee telabanlaki ?

  స్పందించండి

 2. Viswaroop
  ఫిబ్ర 16, 2014 @ 12:32:16

  చెప్పడానికి వాళ్ళింకెక్కడున్నారు సార్? అబ్రకదబ్రలతో న్యాయాన్ని మాయజేసేటోళ్ళూ, మేమే చదువరులమంటూ విర్రవీగేవారూ అంతా పాపం కేంద్రం దెబ్బకు నోటమాటరాక బలాదూర్ అయ్యారు.

  ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ బస్సులనూ, రైళ్లనూ ఆపేసి ఉద్యమకారులను ఎక్కడివారినక్కడ అరెస్టులు చేస్తుంటే, నిర్భందాన్ని తట్టుకోలేక తోటివారు ఆత్మహత్యలు చేసుకుంటే కడుపు రగిలి నాలుగు విగ్రహాలు కూలిస్తే అదేదో మహాపాతకం జరిగినట్టు నెత్తీ నోరూ చించుకుని మొత్తుకున్నవారు, ఇప్పుడు ప్రపంచం ముందర భారత పార్లమెంటు పరువు తీసి జైషే మహమ్మద్ తరహాలో పార్లమెంటుపై దాడికి పూనుకున్నవాడిగురించి మాత్రం కిక్కురుమనట్లేదు.

  స్పందించండి

 3. గ్రీన్ స్టార్
  ఫిబ్ర 16, 2014 @ 17:51:39

  >>ఎవరు దేశ ద్రోహులు?

  తెలభాంద్రులు

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 16, 2014 @ 21:47:40

  అఖిల్ గారు!
  ‘తాగుబోతు ‘ అన్నది వ్యక్తిగత విషయం. అది దేశ ద్రోహం కాదు.
  టపాలోని నా ప్రశ్నకు మీ ప్రశ్న అహంకారంతో చేసిన ఎదురు దాడి కాని, ఏ రకంగాను సరైన సమాధానం కాదు. గుండెల లోతుల నుండి ఎంతో ఆవేదనతో వ్రాసిన నా టపా చదివాక కూడ మీలో పశ్చాత్తాపం లేదంటే మీకు మానవత్వం ఉందో లేదో మీరే నిర్ణయించుకోవాలి. పైగా ఇంత జరిగాక కూడా మళ్ళీ నోరు పారేసుకొన్న మీ పాపానికి నిష్కృతి లేదు. న్యాయం, ధర్మం మా పక్షాన ఉన్న విషయం సత్యమయితే … ఆ ధర్మ సంస్థాపకుడు మీలోని ఆ అహంకారాన్ని ఏదో విధంగా తప్పక నశింపజేస్తాడు.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 16, 2014 @ 21:54:20

  విశ్వరూప్ గారు!

  మీరన్నది నిజం! అయితే ‘కేంద్రం’ అన్నది నిమిత్త మాత్రమే! స్వార్థంతో అధర్మంగా పోరాడుతున్న వాళ్ళకు నిజానికి తగిలింది ‘ధర్మం’ దెబ్బ!

  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 16, 2014 @ 22:05:12

  గ్రీన్ స్టార్ గారు!

  ఆ విషయాన్ని వాళ్ళే నిర్ణయించుకోనివ్వండి.
  వాళ్ళు సంస్కార హీనులై నోరు జారుతారు. మనమెందుకు సంస్కార హీనులం కావాలి?

  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 7. Jai Gottimukkala
  ఫిబ్ర 17, 2014 @ 14:48:17

  ఇప్పుడు కొత్తగా మాకు ఒక దేశం కావాలని మొదలెట్టారు.

  http://gulfnews.com/news/world/india/angry-tdp-mps-from-seemandhra-make-separatist-threats-1.1291404

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: