‘దేవదాసు’ కెపుడు చావు లేదు!!!

చిలిపికనుల తోడ, తెలివితేటల తోడ
తెలుగుకవన గరిమ తేటపరచి
ప్రభువు మెప్పునొందు ‘రామకృష్ణ’ వికట
సత్కవీంద్ర పాత్ర చావబోదు!

చిత్తమందు గలుగు శ్రీరంగనాధుని
వేశ్యయందు గూడ వెదికి జూచు
విష్ణుభక్తుడైన ‘విప్రనారాయణ’
సత్త్వగుణుని పాత్ర చావబోదు!

“నా అనా, రహో అనా”రని జీవ స
మాధి చుట్టు తడిమి, మతిని దప్పి
ఆర్తితోడ తిరుగునట్టి ‘మొగల్ యువ
చక్రవర్తి’ పాత్ర చావబోదు!

గ్రుడ్లు తేలవేసి కొద్ది కొద్దిగ రక్త
మొలికి నోటి నుండి, ఊరి బయట
రచ్చబండ మీద ప్రాణమ్ముల వదలు
‘దేవదాసు’ కెపుడు చావు లేదు!!! 

చావు లేని ఇట్టి జీవభూమిక లెన్నొ
తెలుగు చిత్రసీమ తెరను నిలిపె
నవరసాల నటుడు నాగేశ్వరాఖ్యుడే!
చావు లే దతనికి! చావు లేదు!!!

– డా. ఆచార్య ఫణీంద్ర

దివంగత మహానటుడు
“నాగేశ్వరరావు” గారితో నాకు మిగిలిన స్మృతి చిహ్నాలు:

anr1

anr3

anr2

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. bonagiri
  జన 23, 2014 @ 09:59:30

  అవునండి, ఇలాంటి దేవదాసు మళ్ళీ పుట్టడు కూడ!

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  జన 23, 2014 @ 23:46:25

  bonagiri garu!
  thank you!

  స్పందించండి

 3. Palla Kondala Rao
  జన 24, 2014 @ 05:38:13

  ఆత్మవిశ్వాసానికి అడ్రస్ అయిన హేతువాది అక్కినేని తెలుగు సినిమా ప్రపంచంలో చిరంజీవి!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జన 24, 2014 @ 20:46:09

  పల్లా కొండలరావు గారు!
  నిజమే! ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం!
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: