తిరుమల వేంకటపతిపై చూపు వెనుదిరుగదు!!!

ఇంతింత తిరుమణికాపు … 

(తిరుమల వేంకటేశ్వరస్వామిపై భక్తి గీతం)

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

sri balaji

ఇంతింత తిరుమణికాపు –
ఎంత వైభవమగు రూపు –
వేంకటపతిపై చూపు
వెనుదిరుగదు! తిరు
వేంకటపతిపై చూపు
వెనుదిరుగదు!!                                  ||ఇంతింత||
వజ్రఖచిత ఘన కిరీటము –
పద్మపత్ర సమ నేత్రద్వయము –
అధర జనిత మధు మందహాసము –
వెరసి కమనీయ వదనరాజము … !    ||ఇంతింత||
అమ్మల గన్న అమ్మలు
అలిమేల్మంగ, శ్రీ సతులు
రొమ్మున కొలువై భక్తులపై
చిమ్మెడి దివ్య కాంతులు … !               ||ఇంతింత||
అభాగ్యజీవుల అశాంతి బాపి
ఆత్మస్థైర్యమిడు అభయహస్తము … !
అనంత కోటి పాతకములను
పరిహరించెడి పాదయుగ్మము … !     ||ఇంతింత||
నెట్టే వరకు కదలరని
తిట్టేరు ధర్మకర్తలు … !
కొట్టినగాని కదలమని
పట్టుబట్టేరు స్వామిభక్తులు … !          ||ఇంతింత||

         — &&& —

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: