G.O.M.కు నేను అందించిన సూచనలు ఫలించే అవకాశం!!!

విభజన ప్రక్రియ వేగవంతంగా దూసుకు వెళుతుంటే … సీమాంధ్ర నాయకులు, ప్రజలు తమ ’సీమాంధ్ర’ ప్రాంత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, ఇంకా మూర్ఖంగా ”సమైక్యాంధ్ర’ అంటూ కాలాన్ని వృధా చేస్తున్న తరుణంలో – తెలంగాణవాదినై కూడ, తోటి సీమాంధ్ర తెలుగు సోదరుల ప్రయోజనాల గురించి నిస్వార్థంగా బాగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నియమించిన ’గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్’  ( G.O.M.) కు నేను మొట్టమొదటగా సూచనలు అందించిన విషయం బ్లాగు మిత్రులందరికీ విదితమే.

(See the link : https://dracharyaphaneendra.wordpress.com/2013/10/20/గ్రూప్-ఆఫ్-మినిష్టర్స్-gomక)

అందులో విద్యాపరంగా నేను చేసిన సూచనలు … సీమాంధ్రకు ఐ.ఐ.టి., ఐ.ఐ.యం., సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటి ఏర్పాటు గురించి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్టుగా వస్తున్న వార్త నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. అయితే మళ్ళీ ఈ ప్రతిపాదనలన్నీ … విజయవాడ, విశాఖపట్నం … అనగా కేవలం కోస్తా ప్రాంతానికే పరిమితం చేయడం విచారకరం. ఐ.ఐ.టి., ఐ.ఐ.యం. లలో ఒకదానిని, లేదా కనీసం సెంట్రల్ యూనివర్సిటీని రాయల సీమకు కేటాయించడం న్యాయమని నా అభిప్రాయం.

ఏదేమయినా …హిందీ తరువాత, దేశం మొత్తంలో ఏ ఇతర భాషీయులకు లేని విధంగా తెలుగువాళ్ళకు రెండు ఐ.ఐ.టీ.లు, రెండు సెంట్రల్ యూనివర్సిటీలు లభిస్తే అంతకన్న ఆనందించవలసిన విషయం మరొకటి ఉండదు. 
ఇన్నాళ్ళు … 42 మంది ఎం.పి.లు కలసి ఉంటే ఏదైనా సాధించవచ్చు – అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచిన సీమాంధ్రులకు ఈ జరుగుతున్న పరిణామాలు కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నాను. ఇలాగే రెండు రాష్ట్రాలలోని ప్రజలు – ఎవరికి వారు ఆత్మ గౌరవంతో ఆనందంగా జీవిస్తూనే, ఒకరికొకరు సహకరించుకొంటూ, పోటాపోటీగా అభివృద్ధి చెందితే దేశంలోనే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలువడం ఖాయమని మొదటి నుండి మా వంటి నిష్పాక్షిక భావాలు గల విభజనవాదులు చెప్పుతున్నది. ఇప్పటికైనా సీమాంధ్ర సోదరులు తమ రాజకీయ కమ్ వ్యాపార నాయకుల మాయ మాటల వల నుండి బయటపడి వాస్తవాలను గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

సాక్షి :

S21113

ఈనాడు :

en21113

నమస్తే తెలంగాణ :

nt21113

ప్రకటనలు

9 వ్యాఖ్యలు (+add yours?)

 1. viswamitra
  నవం 03, 2013 @ 11:42:40

  You are really a broadminded person. You can not accept others to share Hyderabad, but you are praying god (Govt) for development of other regions like Hyderabad. You are really genius.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  నవం 03, 2013 @ 12:39:57

  Mr. Viswamitra!
  You have to grow enough to understand my broad-mindedness.
  Who said I can not accept others to share Hyderabad? In fact there are many Tamil brothers, Marwadi brothers, Bengali brothers and even Seemandhra brothers who are already sharing Hyderabad with me … but not with the way you want … not with your selfish motive of dominating people like us with the support of your dominating leaders in a combined Govt. who play to their wish by their money power, Faction-ism power and by their strength in No. of M.L.A.s in the combined state.
  If you are wise you can understand that many of us share Mumbai, Delhi, Bangalore and other cities, as Indians.
  I may not be genius, as you said. But I am not so cunning like you.

  స్పందించండి

 3. harinatha
  నవం 03, 2013 @ 12:40:36

  oka I IT ,I I M Eesheth sarifothantha,hyedarabad nu delevopment chenathi ivaru,project and water disbution ela,farmers prolems ela, so many unsovleve problems are lying.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  నవం 03, 2013 @ 12:55:54

  Mr. Harintha!
  G.O.M.కు నేను చేసిన సూచనలలో మీరు చెప్పిన విషయాలే కాక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవేవి చదువకుండా మీరు తొందరపడి కామెంట్ పెట్టడం తప్పు!
  అయినా… ’హరినాథ’గా మీరేం చేస్తున్నారు? G.O.M.కు సూచనలు పంపేందుకు ఇంకా 5వ తేది వరకు సమయం ఉంది. మీకేం కావాలో అడుగమనే కదా G.O.M. అక్కడ కూర్చుంది. మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటే … ఇంకొకరు అరటి పండు ఒలిచి గువ్వం మీ నోట్లో పెట్టాలా?

  స్పందించండి

 5. prakash jagityal
  నవం 03, 2013 @ 13:04:02

  i appreciate ur views Dr. Acharya.

  స్పందించండి

 6. M.V.Ramanarao
  నవం 03, 2013 @ 13:51:35

  నేను కూడా మీ లాగే 10 కాలంస్ లో సూచనలు చేసి కేంద్రానికి పంపించాను. సూత్రప్రాయంగా విభజనకి అందరూ ఆమోదిస్తే చాలు.అమలు పెట్టడానికి కొంతవ్యవధి తీసుకొన్నా పరవాలేదు.ముఖ్యంగా నదీజలాల విభజన,irrigation projects నిత్వరగా నిర్మించడానికి,వివాదాలు పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వ సారథ్యంలోనే కమిటీలు పనిచేయాలి.కొత్తగా నెలకొల్పే సంస్థలు విశాఖ,విజయవాడల్లోనేగాక కర్నూలు,తిరుపతి వంటి చోట్ల కూడా నెలకొల్పాలి. అలాగే తెలంగాణాలో కూడా హైద్రాబాద్లోనేగాక వరంగల్,నిజాంబాద్ వంటి పట్టణాల్లో కూడా సంస్థలు వికేంద్రీకరించాలి. రెండు రాష్ట్రాల్లో కూడా 15% సీట్లు ,ఉద్యోగాలు స్థానికేతరులకు కేటాయించాలి.జోనల్ సిస్టం 10 సం; తర్వాత రద్దుచేయవచ్చని నా అభిప్రాయము.

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  నవం 03, 2013 @ 14:43:29

  Prakash garu!
  Thank you very much!!!

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  నవం 03, 2013 @ 14:56:09

  రమణారావు గారు!
  అనేక సంవత్సరాలుగా రగులుతున్న ’తెలంగాణ సమస్య’కు సుహృద్భావ వాతావరణంలో శాశ్వత పరిష్కారం లభించి, భావిలో ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతంవారిపై వేలెత్తి చూపవలసిన అవసరం లేకుండా, రెండు రాష్ట్రాలు సోదర భావంతో ప్రగతిపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నవాళ్ళలో నేను ఒకణ్ణి!
  అందుకు మనమంతా మనవంతు కృషి చేద్దాం!
  మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  నవం 03, 2013 @ 16:54:18

  రమణారావు గారు!
  మరొక్క మాట … !
  ” … అలాగే తెలంగాణాలో కూడా హైద్రాబాద్లోనేగాక వరంగల్,నిజాంబాద్ వంటి పట్టణాల్లో కూడా సంస్థలు వికేంద్రీకరించాలి.” అన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
  గతంలో ’చుక్కా రామయ్య’గారితోబాటు ఎంతో మంది మేధావులు, ప్రజాసంఘాలు వ్యతిరేకించినా, ఆదిలాబాదు (బాసర) కు రావలసిన ఐ.ఐ.టి.ని అప్పటి ముఖ్యమంత్రి ’రాజశేఖరరెడ్డి’ నిరంకుశంగా హైదరాబాదుకు తరలించినప్పుడు … తెలంగాణ ప్రజలు చాల మనస్తాపానికి గురైన విషయం – మన జ్ఞాపకాల పొరలలో నుండి ఇంకా చెరిగిపోలేదు.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: